Preparation of Compost using Cow manure, Vermi compost etc

ఎండాకాలం అయిపోయే లోపులో ఈ రకంగా compost mix చేస్కుని ఉంచుకుంటే మంచిది.

Cow manure = 25kg
Goat manure = 25kg
Vermi compost =25kg
Cocopeat = 25kg

Total 100kg.

బాగా mix చేసి ఈ mix పై గోనే బస్తాలు కప్పి one week వదిలేయాయి, మధ్య మధ్యలో బెల్లం నీళ్లు చిలకరిస్తూ ఉండాలి.

One week తర్వాత ఈ 100kg compost mix లో

Trichoderma – 1kg
Pseudomonas – 1kg
Vam – 1kg
Metarhizeum – 1kg
Npk – 1kg
Bone meal – 1kg
Epsom salt – 1kg.
Seaweed granules – 1kg

Mix చేయాలి.

ఈ compost mix ని ఒక drum లో ఎత్తి పెట్టుకుని 6 to 8 months వరకు ప్రతి నెలా కొంచెం కొంచం మొక్కలకు ఇవ్వచ్చు. Moisture ఉండేలా చూసుకోవాలి.

మొక్క పెట్టాలి అనుకున్నప్పుడు
Soil – 40%
Compost mix – 40%
Neem powder – 10%
Sand / rice husk – 10%

ఇలా కలిపి pot నింపి ఒక two days water తో soil mix బాగా తడిచేలా చూసుకుని ఆ తర్వాత మొక్క నాటుకోవాలి.

మొక్క పెట్టే కుండీలో అడుగున ఒక layer రాళ్ళ ఇసుక, next layer బొగ్గులు, ఆ తర్వాత layer ఎండు ఆకులు fill చేసి ఆ తర్వాత soil mix తో fill చేస్తే వర్షాలు ఎక్కువ పడినప్పుడు కుండీ అడుగున నీళ్లు నిలబడకుండా ఉంటాయి, మట్టి కూడా కిందకి కారదు.

Thank you.
Srinivas konidana.
Team CTG.

Shopping Cart