మిద్దెతోట లో మామిడి మొక్క పెంచాలి అనుకుంటున్నారా….
మొదటగా మామిడి మొక్క కోసం మట్టి మిశ్రమం తయారు చేసుకోవాలి
పళ్ళ మొక్కలకు స్తూల, సూక్ష్మ పోషకాలు చాలా అవసరం.
మామిడి మొక్క కోసం మట్టి మిశ్రమం
మట్టి – 30%
కంపోస్ట్ – 30%
కోకోపీట్ – 20%
వేప పిండి – 10%
బోన్ మీల్ + ఎప్సమ్ సాల్ట్ + సీ వీడ్ + వామ్ + ట్రైకోడర్మా + మెటరైజియమ్ – 10%
కుండీ పరిణామం –
24×24″ గ్రో బ్యాగ్ / సగానికి కట్ చేసిన 200 ltr డ్రమ్
మీరు తీసుకున్న గ్రో బాగ్ / డ్రమ్ కానీ అడుగున రంధ్రాలు సరిగా పెట్టుకున్న తర్వాత అడుగున ఒక లేయర్ రాళ్ళ ఇసుక వేసి ఆ తర్వాత లేయర్ బొగ్గులు వేయాలి. తర్వాత లేయర్ ఎండు అకులు వేయాలి. ఇలా లేయర్స్ లా వేయడం వల్ల భారీ వర్షాలు వచ్చినప్పుడు ఎక్కువ నీళ్లు నిలబడకుండా డ్రైన్ అయిపోతాయి.
ఆ తర్వాత మనం తయారు చేసుకున్న మట్టి మిశ్రమం నింపాలి.
ఇలా నింపిన తర్వాత మట్టి అంతా పై నుండి కింద వరకు తడిచేలా నీళ్లు పట్టి ఒక రెండు రోజులు వదిలేయాలి.
ఇక మిద్దెతోట లో మామిడి మొక్క పెట్టుకోవడానికి ఒక మూడు రకాలు అనుకూలం గా ఉంటాయి.
అల్ సీసన్ మామిడి
పునాస మామిడి
నాన్ డాక్యుమై గోల్డ్ మామిడి,
-మిద్దెతోట లో ఏ పళ్ళ మొక్క అయినా అంటు కట్టిన మొక్కే తీస్కోవాలి.
-మట్టి మిశ్రమం నింపిన కుండీ లో మొక్క నాటుకోవాలి.
– మనము మట్టి మిశ్రమం లోనే స్తూల సూక్ష్మ పోషకాలు కలిపాము కనుక ఒక 3 నుండి 6 నెలల వరకు ఇంకేమి ఇవ్వాల్సిన పని లేదు.
– రోజు విడిచి రోజు బియ్యం కడిగిన నీళ్లు ఇవ్వచ్చు, వారానికి ఒకసారి అరటిపళ్లు నానపెట్టిన నీళ్లు ఇస్తుండచ్చు
-చీడ పీడలు ఏవి రాకుండా 100 gms మట్టి ని లీటర్ నీళ్లలో కలిపి ఒక రెండు సార్లు వడ కట్టి మొక్క కి స్ప్రే చేయాలి, మొక్క కి హాని చేసే ఏ రకమైన క్రిమి కీటకాలకి అయినా గాలి పీల్చుకోవడానికి ముక్కు లాంటి నిర్మాణం ఉండదు, వాటి చర్మం పై ఉన్న రంధ్రాల ద్వారానే అవి గాలి పెల్చుకుంటాయి, మనం మట్టి ధ్రావణం స్ప్రే చేయడం వలన మొక్క పై ఆశించి ఉన్న పురుగుల పై మట్టి పడి వాటి చర్మం రంధ్రాలు మూసుకుపోతాయి దీని వల్ల అవి గాలి పీల్చుకోలేక చనిపోతాయి.
సాయంత్రం, రాత్రి సమయం లో కొన్ని రకాల రెక్కల పురుగులు ఆకులు తింటూ రసం పీలుస్తూ ఉంటాయి, మనం మట్టి ధ్రావణం స్ప్రే చేసి ఉండటం వల్ల ఆ మట్టి వాటి కడుపు లోకి వెళ్లి అది అరిగించుకోలేక చనిపోతాయి.
-మామిడి మొక్క దగ్గర పసుపు రంగు జిగురు అట్టలు కట్టి ఉంచాలి.
– ఏ మొక్క కి అయినా కాల్షియయ్, ఫాస్పరస్, నైట్రోజెన్, మెగ్నీషియం, పోటాషియం చాలా అవసరం, అందుకే ప్రతి నెలా కంపోస్ట్ + బోన్మీల్ + ఎప్సమ్ సాల్ట్ + సీ వీడ్ కలిపి ఇవ్వాలి. వారానికి ఒకసారి అరటిపండు నీళ్లు ఇవ్వాలి.
-మామిడి మొక్క కి పూత బాగా రావడానికి సొయా బీన్స్ మొలకల ధ్రావణం ఇవ్వచ్చు. సోయాబీన్స్ ఒక రాత్రి నీళ్లలో నానపెట్టి ఆ తర్వాత ఒక పలుచని వస్త్రం లో కట్టి ఒక
రోజు వదిలేస్తే మొలకలు వస్తాయి, వీటిని మిక్సీ పట్టి కొంచం బెల్లం కలిపి ఒక మూడు రోజులు వదిలేయాలి, ఆ తర్వాత ఒక లీటర్ నీళ్లలో ఇది ఒక 10gms కలిపి మొక్క కి స్ప్రే చేయచ్చు.
-పప్పు జాతి ధాన్యాల్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి వీటిని మొలక కట్టినప్పుడు ఆ ప్రోటీన్ అనేది అమైనో ఆసిడ్స్ గా మారతాయి ( ఇవే కార్బన్ & నైట్రోజెన్ )
-మామిడి మొక్క పూత సమయం లో నీరు చాలా తక్కువ ఇవ్వాలి, ఏవి స్ప్రే చేయకూడదు.
-మామిడి మొక్క కి పిందెలు నిలబడిన తర్వాత ప్రతి నెలా కంపోస్ట్,+ బోన్ మీల్ + సీ వీడ్ ఇస్తుండాలి, అరటిపండు నీళ్లు ఇవ్వడం మర్చిపోవద్దు.
-మామిడి మొక్క కి నీళ్లు తక్కువ అయినా ఎరువులు ఎక్కువ అయినా ఆకుల అంచులు ఎండిపోతుంటాయి, calcium deficiency వస్తే కొత్త చిగుర్లు రావు మొక్క ఎదగదు, అలాంటప్పుడు నల్ల నువ్వులు చెక్క ని నీళ్లలో నానపెట్టి ఇవ్వచ్చు.
– మామిడి కాయలకు పురుగు రాకుండా fruit fly traps కట్టాలి.
-మామిడి కాయల సీసన్ అయిపోయాక కొమ్మ కత్తిరింపులు చేసుకోవాలి.
Thank you.
Srinivas konidana.
Team CTG.
