Decomposed Manure-Ghanajeevamrutham


చాలా మందికి పశువుల ఎరువు అంటే ఎన్ని నెలలది, ఏయే పశువుల ఎరువు, ఎలా వాడాలి అనే సందేహాలు ఉన్నాయి. ఎరువులు రెండు రకాలు. రసాయనిక ఎరువులు, సేంద్రియ ఎరువులు.
బాగా మాగిన పశువుల ఎరువులు, పంటలకు పోషకాలు అందించే సేంద్రీయ ఎరువుల రకం. పశువుల ఎరువులను పొలాలలో, తోటల్లో వేయడం వల్ల నేలకు బలం చేకూరుతుంది. రసాయనిక ఎరువులపై ఆధారపడకుండా, మాగిన పశువుల ఎరువులను ఉపయోగించి పంట దిగుబడిని , నేల సారాన్ని పెంచుకోవచ్చు. 

పశువుల ఎరువుల గురించి కొన్ని విషయాలు: 

పశువుల ఎరువులో నత్రజని, భాస్వరం వంటి పోషకాలు ఉంటాయి.

పశువుల ఎరువును కంపోస్టింగ్ చేసి, అంటే ఎండుటాకులు, కూరలు,పడ్లతొక్కలు కలిపి ఎరువుగా మార్చుకోవచ్చు.

పశువుల ఎరువును ఎక్కువగా వానకాలంలో వేయడం మంచిది.

పశువుల ఎరువును నిల్వ చేయడానికి, ఇంటిలో , చెట్ల నీడ గల ప్రాంతాన్ని ఎంచుకోవాలి. బాగా మాగని ఎరువు తెచ్చుకొని బస్థాలలో నింపిపెట్టుకొని, 6 నెలల తరువాత వాడుకోవచ్చు.
. పశువుల ఎరువులు బాగా మాగకుండా( మాగడం అంటే పూర్తిగా తయారుకావడం) వాడినట్లయితే పేడ పురుగులు లద్దె పురుగులు వచ్చి మొక్కలకు హానిచేస్తాయి. కనీసం 6 నెలల పాటు పశువుల ఎరువును మాగబెట్టుకోవాలి.
. పిడకలు పశువుల ఎరువు కింద పనికిరావు ఎందుకంటే అవి ఎండబెట్టడం వల్ల అందులోని జీవజాలం నశిస్తుంది. కొంత తేమకలిగిన పొడి ఎరువు వాటిలోని మైక్రోబియల్ యాక్టివిటీ నశించకుండా, మొక్కలకు కావలసిన స్థూల,సూక్ష్మ పోషకాలు అందించగలదు.
. ఘనజీవామృతం ద్వారా తయారైన పిడకలు నానబెట్టినప్పుడు కొంతవరకు పోషకాలను అందించగలుగుతాయి. అంతే తప్ప పిడకల వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు.
. సాధ్యమైనంతవరకు ఆవులు, గేదెలు ద్వారా వచ్చే ఎరువు కానీ లేదా మేకలు, గొర్రెల వల్ల వచ్చే ఎరువు గాని కోళ్లు ద్వారా వచ్చే ఎరువు కానీ మనం పశువుల ఎరువుగా వాడుకోవచ్చు. వీటిని కనీసం ఆరు నెలల కంటే ఎక్కువ నిలవబెట్టుకుని వాడుకోవాలి.
. ఇలా బాగా మాగిన పశువుల ఎరువును మొక్కలకు నెలకొకసారి ఇచ్చుకోవచ్చు. లేదా ప్రతిసారి మట్టి మిశ్రమాన్ని కలుపుకున్నప్పుడు 30% పశువుల ఎరువులు కలుపుకొని తయారుచేసుకోవచ్చు.
. కూరగాయలు, పాదుల మొక్కలకు పూత పిందె దశలో తగినంత పశుల ఎరువును వేసుకోవచ్చు.
. అలాగే పువ్వుల మొక్కలకు కూడా ఈ ఎరువును నెలకోసారి వాడుకోవచ్చు.

సుజాత
CTG విజయవాడ

Shopping Cart