Grow Plants in Pots – Growbags

మొక్కలు – వాటి కుండీ పరిమాణం

👉 మిద్దెతోట లో మొక్కలు పెంచే వారికి మట్టి మిశ్రమం ఎంత ముఖ్యమో సరైన కుండీ కూడా అంతే అవసరం.

👉 మొక్కకి అవసరం అయిన దాని కన్నా పెద్ద కుండీ ఇస్తే మొక్క వేర్లు మట్టి పై భాగం లో మాత్రమే స్ప్రెడ్ అయ్యి ఉంటాయి, మనం ఇచ్చే నీళ్లు, పోషకాలు అన్ని అడుగుకి వెళ్ళిపోతాయి, దాని వల్ల మొక్క సరిగా పెరగదు,
మొక్క కి అవసరం అయిన దాని కన్నా చిన్న కుండీ ఇచ్చినప్పుడు వేర్లు త్వరగా పెరిగి root bound అయ్యి మొక్కలో ఎదుగుదల ఉండదు.

ఆకుకూరలు

ఆకుకూరల వేర్లు పెద్దగా లోపలికి పోవు, తోటకూర గోంగూర వేర్లు మాత్రమే కొంచం లోతుగా వెళ్తాయి.
అందుకే తోటకూర, గోంగూర తప్ప మిగతా ఆకుకూరలు అన్ని లోతు తక్కువ, వెడల్పు ఎక్కువ ఉన్న tubs తీస్కోవాలి ex: rs. 50 tubs.
తోటకూర, గోంగూర ని 12×12inch grow bag or 10 ltr బకెట్ లో ఒక మూడు నాలుగు మొక్కలు వేసుకోవచ్చు.

కూరగాయలు :

టమాటో, మిర్చి మొక్కలు 12×12 inch grow bag / 10ltr బకెట్స్ లో రెండు మొక్కలు పెట్టుకోవచ్చు.
బెండకాయ, గోరుచిక్కుడు, వంగ, cauliflower,cabbage ఇలాంటి వాటిని 12″ grow bag /10ltr bucket లో ఒక్కొకటి వేసుకోవాలి.

తీగజాతి కూరగాయలు :

బీర, కాకర, దొండ, చిక్కుడు, బీన్స్, నేతి బీర, దోస, కీరా, air potato, ఆకాకర ఇలాంటివి rs.100 టబ్ లో ఒక్కొక్కటి వేసుకోవచ్చు.
సొర, పొట్లకాయ, గుమ్మడి, ములగ లాంటి వాటికి సగానికి కట్ చేసిన బ్లూ డ్రమ్ కానీ 18″ grow bag కానీ సరిపోతుంది.

దుంప జాతి కూరగాయలు :

Carrot, beetroot, ముల్లంగి, ఉల్లి వీటిని కూడా rs.100 black tubs లో నాలుగు లేదా ఐదు పెట్టుకోవచ్చు,
పసుపు, అల్లం లాంటివి కూడా rs. 100 టబ్ లో పెట్టుకోవచ్చు.

పళ్ళ మొక్కలు

పళ్ళ మొక్కలకు 24″×24″ grow bag కానీ సగానికి కట్ చేసిన 200 ltr బ్లూ డ్రమ్ లో కానీ వేయాలి.
Sweet lemon, table lemon ఇలాంటి వాటికి 20ltr bucket కానీ rs. 100 tub కానీ సరిపోతుంది.

పూల మొక్కలు:

గులాబీ, మందారం లాంటివి 14″, 16″ pot / grow bag లో పెట్టచ్చు.
కాగడ మల్లె, మల్లె, విరజాజీ, గన్నేరు, గిన్నే మాలతి, అలమండా, సన్నజాజి, టికోమా, నూరు వరహాలు ఇలాంటివి handles ఉన్న black tubs లో పెట్టుకోవాలి.

Seasonal plants :

వీటికి 8″, 10″ pots సరిపోతాయి.

Croton plants:

వీటికి కూడా 8″ to 14 ” pots సరిపోతాయి.

Succulents:

వీటికి 4 to 5″ pots చాలు.

కలువపూలు

వీటిని మొదట గా వెడల్పు గా ఉండే rs. 50 టబ్ లో పూర్తిగా మట్టి నింపి అందులో మొక్క వేసి ఆ టబ్ ని rs.100 లో పెట్టి పూర్తిగా నీటిని నింపాలి.

తామర పువ్వులు

ఈ తామర మొక్కలకి rs. 100 టబ్ లు లేదా సగం కి కట్ చేసిన బ్లూ డ్రమ్ లో వేస్తే ఎక్కువ పూలు పుస్తాయి.


SRINIVAS KONIDANA.
TEAM CTG.

Shopping Cart