చీడ పీడలు/ సశ్య రక్షణ
Soil borne డిసీజెస్ / భూమి నుండి సంక్రమించే వ్యాధుల నుంచి రక్షణ కోసం
మట్టి లో ట్రైకో డర్మ విరిడి, సూడో మోనాస్, వేప పిండి కలుపుకోవాలి.
“తెగుళ్ళు – వ్యాధి సోకే పురుగులు”
ముఖ్యంగా మూడు విధానాల ద్వారా వీటి వ్యాప్తి జరుగుతుంది.
Penetration: చొరబాటు, అనుమతి లేకుండా దూరడం, రంధ్రం చేసుకునిలోపలికి పోవడం.
Incubilation:
పొదిగే, పొదుగుట, సూక్ష్మ జీవుల పెంపొందించడానికి తగిన వాతావరణం సృష్టించడం.
Infection: సంక్రమణ, అంటు కొనుట, సోకుడు, వ్యాధిని సోకే విధంగా ప్రేరేపించడం.
తెగుళ్ళు
మాగుట తెగులు/ బూడిద తెగులు/వేరుకుళ్లు.
ఆకు పై భాగం లో తెల్లని పొడిలా వుంటుంది. తరువాత ఆకు పసుపు రంగు లోకి మారిపోయి, ఎండిపోతుంది.
అందుకే వెంటనే వాటిని తొలగించాలి.
వేప కషాయాన్ని 10 రోజులకు ఒకసారి చొప్పన 2 సార్లు పిచికారీ చేయాలి.
బూజు తెగులు:
ఇది 2 రకాలు.
(a) పౌడర్ మైల్డ్ డ్యూ
(b) డౌని మైల్డ్ డ్యూ
బూజు తెగులు:
ఆకు అడుగు భాగంలో బూజులా వుంటుంది. ఆకు పై పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. ఆకులు పండి రాలి పోతాయి.
పులిసిన మజ్జిగ, ఇంగువ ద్రావణం కలిపి వారానికి ఒకసారి చొప్పన 2 వారాలు పిచికారీ చేయాలి.
నల్ల మచ్చ/ గోధుమ మచ్చ/ ఫంగస్
ఇవి ఆకు పై భాగం లో గుండ్రని మచ్చలు గా ఏర్పడతాయి. కాయలకు కూడా సోకుతాయి.
3 గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్ నీ లీటర్ నీటి లో కలిపి 10 రోజులకు ఒకసారి చొప్పన 2 సార్లు పిచికారీ చేయాలి.
అగ్గి తెగులు:
దీని వల్ల మొక్క ఎండి పోతుంది.
పాము పొడ తెగులు:
పాము పొడ / leaf miner నివారణ కోసం వేప కషాయంగాని, నీమాస్త్రంగాని వారానికి ఒకసారి చొప్పన 2 వారాలు spray చేయాలి.
ఎఫెక్ట్ అయిన ఆకులను తొలగించి పారవేయాలి.
కాయ కుళ్ళు / పండు తెగులు/అంత్రస్:
Fruit fly/ పండు ఈగ నివారణ కోసం వేప కషాయంగాని, నీమాస్త్రంగాని వారానికి ఒకసారి చొప్పన 2 వారాలు spray చేయాలి.
మొగ్గ పెరుగుదల సమయం లో వేప పిండి మొక్క మొదళ్ళ లో వేయాలి.
Fruit fly trap ను కూడా వాడుకో వచ్చు.
వైరస్ ( మోజాయిక్) తెగులు:
ఆకు ఈనెల వద్ద పసుపు రంగు చారలు ఏర్పడతాయి. ఇవి సోకితే చాలా కష్టం.
వేప కషాయం/ నీ మాస్త్రం / వావిలకు కషాయాన్ని వారానికి ఒకసారి చొప్పన 2 సార్లు పిచికారీ చేయాలి.
పంటలను ఆశించే పురుగులు:
(ఇవి రెండు విధాలు)
(I) తొలిచి తినే పురుగులు
పచ్చ పురుగు.
లద్దె పురుగు.
గులాబీ రంగు పురుగు.
కాయ తొలుచు పురుగు / కాండం తొలుచు పురుగు.
గుమ్మడి పెంకు పురుగు.
నివారణ కోసం వేప కషాయంగాని, నీమాస్త్రంగాని వారానికి ఒకసారి చొప్పన 2 వారాలు spray చేయాలి.
(II) రసం పీల్చే పురుగు
ఆకుల క్రింది భాగం నుండి రసం పీల్చే పురుగులు.
ఇవి రెండు రకాలు.
(a). ఫ్లయ్స్ / ఎగిరే పురుగులు.
తెల్ల దోమ, పచ్చ దోమ
(b). ఆకు క్రింది భాగంలో ఉండే రసం పీల్చే పురుగులు.
పెనుబంక, ఎర్ర నల్లి, తెల్ల నల్లి, పిండి నల్లి, లీఫ్ మైనర్.
నివారణ:
(తొలిచి తినే పురుగులకు మరియు రసం పీల్చే పురుగులకు )
- పులిసిన మజ్జిగ, ఇంగువ ద్రావణం కలిపి వారానికి ఒకసారి చొప్పన 2 వారాలు పిచికారీ చేయాలి.
(లేదా)
- వేప కషాయాన్ని 10 రోజులకు ఒకసారి చొప్పన 2 సార్లు పిచికారీ చేయాలి. వేప పిండి/ వేపనూనె నెమటోడ్స్ ను, హానికర మైన సూక్ష్మ క్రిములను నశింప జేస్తుంది.
(లేదా)
ఒక లీటరు నీటికి ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా, రెండు టీ స్పూన్లు ఆలివ్ ఆయిల్ / వెజిటబుల్ ఆయిల్ బాగా కలిపి, స్ప్రే చేయడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ నుండి మొక్కల ను కాపాడుకో వచ్చు.
వారానికి ఒకసారి స్ప్రే చేయడం మంచిది.
“సర్వే జనః సుఖినోభవంతు”
వేంకటేశ్వర రావు ఆళ్ళ, వికారాబాద్. సి టి జి 8
—-oOo—-
