PREPARATION OF OWDC + NWDC + VAM Solution

OWDC plus NWDC plus VAM All Three mixed Solution తయారీ.
అనేక మంది రైతులు/టెర్రేస్/ఇంటి తోటల పెంపకందారులు వివిధ రకాల Solutions తయారు చేసుకోవడానికి అనేక డ్రమ్ములను నిర్వహించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున, డాక్టర్ కిషన్ చంద్ర గారు 25 ఆగస్టు 2024 నాటి తన వీడియోలో OWDC, NWDC, VAM యొక్క కన్సార్టియం కోసం వెళ్లాలని సూచించారు.
ఆయన సూచనల ప్రకారం నేను All Mix సొల్యూషన్ సిద్ధం చేయబోతున్నాను. వివరాలు ఇక్కడ ఇస్తున్నాను.

20 లీటర్ల బకెట్ తీసుకొని 17 లీటర్ల నీటితో నింపండి. అందులో 200 గ్రాముల బెల్లం వేసి బాగా కలపండి. మీ వద్ద ఇప్పటికే అందుబాటులో ఉన్న OWDC, NWDC, VAM solutions ని ఒక్కో లీటరు ఇందులో పొయ్యండి.
సుమారు 10 రోజులు రోజుకు రెండుసార్లు కలపండి. మొత్తం మూడు OWDC, NWDC మరియు VAM యొక్క కన్సార్టియం తయారు అవుతుంది.
ఈ మిశ్రమాన్ని 50% నీటితో dilute చేసి, మొక్కలలో పొయ్యండి.
ఇది ఒక అద్భుతమైన మిశ్రమంగా చెప్పబడుతోంది. నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా పనిచేస్తుంది. ఇంకా OWDC, NWDC, VAM యొక్క అన్ని ప్రయోజనాలు మట్టికి అందుబాటులో ఉంటాయి. నేల ద్వారా సంక్రమించే అనేక వ్యాధులు నియంత్రించ బడతాయని భావిస్తున్నారు.
దయచేసి ఫలితాల కోసం ప్రయత్నించండి.

Note:
మొత్తం Solution 10 రోజుల్లో multiply అవుతుందా అనే సందేహం మీకు రావచ్చు.
ఎందుకంటే ఇది OWDC మరియు VAM తో OK.వీటి Multiplication time ఒక వారం.
కానీ NWDC యొక్క ప్రస్తుత multiplication time 20 రోజులు. ఇప్పుడు Dr.Kishan Chandra గారు NWDC యొక్క కొత్త Stock కు కొన్ని సవరణలు చేసారని వీటి వల్ల ఇప్పుడు NWDC కొత్త బాటిల్‌ తో 10 రోజుల్లో Multiply అవుతుంది అని తెలియజేసారు. ఇప్పుడు మీకు
మీకు పాయింట్ అర్థమైందని ఆశిస్తున్నాను.
ఏమైనప్పటికీ ప్రస్తుతానికి మీరు NWDC యొక్క మీ ప్రస్తుత Stock తో ముందుకు వెళ్ళండి. Proper Multiplication కోసం మరో వారం లేదా 10 రోజులు wait చెయ్యండి. అంటే కనీసం 10 నుంచి 15 రోజుల దాకా ఆగండి.

-Venugopal Rao garu
CTG RAJAMAHENDRAVARAM

Shopping Cart