What is Biochar

నల్లగా బొగ్గులా వున్నది అంతా బొగ్గు కింద లెక్క. కానీ Biochar అంటే Biomass ని Oxygen లేకుండా మండించి తయారు చేసినది. దీనినే Pyrolysis అంటారు. Biomass అంటే Wood Chips ఇంకా పంట అవశేషాలు-గడ్డి, వరి ఊక (Rice Husk), కొబ్బరి చిప్పలు etc. Nearly ఆక్సిజన్ లేకుండా very High Temperatures అంటే 300 degrees నుండి 600 డిగ్రీలు పైన Biomass ని మండించినప్పుడు వచ్చేదే Biochar.
గదులు గదులు గా వుంటుంది. Biochar Surface Area చాలా ఎక్కువ. ఒక అంగుళం మంచి బయోచార్ ముక్కలో ఒక Football ground అంత Surface area వుంటుంది. ఎంత ఎక్కువ Surface Area వుంటే అంత మంచిది. మనం వాడే బయో Fertilisers, Bio Pesticides లో వున్న Microbes అంటే బ్యాక్టీరియా, Fungus ఈ గదులలో safe గా మకాం పెడతాయి. తమ కార్యక్రమాలన్నీ చక్కగా నిర్వహిస్థాయి. Biochar లేనప్పుడు Microbes వేళ్ళలో మట్టి లో వుంటాయి. మీరే ఆలోచించండి. మైక్రోబియల్ యాక్టివిటీ ఎక్కడ చక్కగా నిర్వహించవచ్చో. Microbes Biochar లో వుంటే RCC building లో వున్నట్లు లెక్క. మట్టి లో వుంటే కచ్చా ఇంటిలో వున్నట్లు లెక్క. అందుకే మనం Biochar ని  మట్టిలో కలిపితే మైక్రోబియల్ యాక్టివిటీ బాగుండి మట్టి healthy తయారయి మొక్కలకి మంచి ఆహారం అందిస్తుంది. క్వాలిటీ బయోకర్ ని వాడినప్పుడే మంచి ఫలితాలు వుంటాయి. క్లుప్తంగా ఇదీ బొగ్గు కథ. దీని Benefits ఇదివరకటి నోట్ లో చెప్పుకున్నాం. మన Terrace Gardening Friends కోసం ఒక పేజీలో వివరించాను. Biochar Carging గురించి ఇంకో Note లో.

By Venugopal, A Member of CTG Family

Shopping Cart