VAM helps in optimum absorption of phosphorus

From Venugopal’s Terrace Garden

Phosphorus మొక్కకి బాగా అందాలంటే VAM ఉపయోగించాలి.

VAM ఒక fungus. దీనిని Mycorrhiza అని పిలుస్తారు. మనం మొక్క దగ్గర Phosphorus వేసినప్పుడు అది immediate గా మట్టిలోని Aluminium, Iron, Calcium తో కలిసి రసాయన చర్య ద్వారా ఒక కరగని పదార్థంగా మారి నీటిలో చాలా slow గా కరుగుతుంది. అందుకనే దీనిని మొక్క వేసినప్పుడే వెయ్యాలి అని చెబుతారు. కానీ phosphorus కరిగి మొక్కకి బాగా అందాలంటే మైక్రోబియల్ యాక్టివిటీ జరగాలి. ఆ యాక్టివిటీకి ఫంగి కావాలి. అదే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న VAM.  VAM Soil లో కరగని పదార్థంగా మారిన phosphorus ని కరగ దీసి మొక్కకి అందేలా చేస్తుంది. ఎలా అంటే మనం వేసిన VAM లోని Fungus కొన్ని Organic Acids release చేసి మట్టిలో కరగని పదార్థంగా మారిన phosphorus తో రసాయన చర్య జరిపి మొక్క తీసుకునే Bioform లోకి మారుస్తుంది. ఇది వేళ్ళు, కాండం, కొమ్మల ద్వారా ఆకులకు చేరుస్తుంది. ఆకులకు చేరిన ఈ phosphorus Photosynthesis (కిరణజన్య సంయోగక్రియ) జరపడానికి అవసరం. అప్పుడు ఆకులు ఈ phosphorus, సూర్యరశ్మి తో కలిసి ఆహారం (అదే కార్బోహైడ్రేట్స్) తయారు చేసి మళ్లీ రెమ్మలు, కొమ్మలు, కాండం ద్వారా వేళ్ళకు అందిస్తుంది. అలా వేళ్ళూ వృద్ధి చెందుతాయి తద్వారా మొక్క కూడా ఆరోగ్యంగా ఎదుగుతుంది. వేళ్ళు తనకు అందిన కార్బోహైడ్రేట్స్ ని  కొంత శాతం తనకు phosphorus ని కరగదీసి శక్తిని అందించినందుకు కృతజ్ఞతగా VAM కి అందిస్తుంది. VAM లోని ఫంగస్ కి ఈ కార్బోహైడ్రేట్ యే ఆహారం. ఇలా ఒకటికి ఒకటి సహకరించుకుని మొక్కని పెంచుతాయి. దీనినే Symbiosys అంటారు. ఈ ప్రయాణాలకు అన్నిటికీ incharge Potash. అందుకే potash కూడా ముందు గానే వెయ్యాలి. లేకపోతే పైన చెప్పిన పనులేవీ జరగవు. ఈ  పనులన్నీ జరగాలంటే మొక్క వేళ్ళూ, Phosphorus, Potash దగ్గర దగ్గరగా వుండాలి. అందుకే phosphorus ని soil mix లో కలపకుండా వేళ్ళకి దగ్గర వెయ్యమన్నది.

-Venugopal, A Member of CTG Family

Shopping Cart