Terrace Gardens-Precautions in Summer

వేసవిలో TERRACE GARDEN లోని మన మొక్కలను సంరక్షించుకోవడానికి చేయవలసిన కొన్ని పనులు/ తీసుకోవలసిన జాగ్రత్తలు.

  1. Shade net ఏర్పాటు చేసుకోవడం.
  2. Pots లో potting mix తడి ఆరిపోకుండా mulching చేసుకోవడం.
  3. ఉదయం, సాయంత్రం మొక్కలకి నీళ్ళు పోయడం.
  4. రెండు పూటలా నీటిని మొక్కల పై spray చేయడం.
  5. వేసవిలో liquid fertilizers నే మొక్కలకి వాడడం మంచిది.
  6. మొక్కలకి ఎక్కువ pruning చేయరాదు.
  7. మొక్కలకు ఎక్కువగా pesticides ని వాడవద్దు.
  8. మొక్కల Surrounding area చల్లగా ఉండేవిధంగా చూసుకోవాలి.
  9. క్రొత్తగా మొక్కలను నాటుకో రాదు.
  10. ప్రతి పనికి ఒక నిర్ధిష్టమైన సమయాన్ని ఎంచుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు చేయరాదు.
  11. అధిక వేడిమి ఉన్న సమయం లో watering/liquid fertilizers/ pesticides/ అన్నీ నిష్టిదం. ఇవీ ఏవి చేయరాదు.
  12. ఘాటైన కషాయాలు, ఎక్కువ మోతాదులో క్రిమిసంహారక ద్రవాలు వాడటం మంచిది కాదు.
  13. మొక్కలు వాడిపోకుండ కొద్దిగా epsum salt ను instant booster గా వాడితే, మంచిది.
  14. కుండీలో మట్టి గుల్లగా ఉండేవిధంగా చూసుకోండి. తడి/ తేమ క్రింది వరకు చేరుతుంది.
  15. చేమంతి, strawberry లాంటి మొక్కలను, ఆకు కూరలు లాంటి వాటిని సాధ్యమైనంత వరకు semi shade లోకి చేర్చండి. మీకు మంచిదనిపిస్తే, పై వాటిని ఆచరించి,తమ TG లోని మొక్కలని ఈ వేసవి ముగిసే వరకు కాపాడుకోగలరు.

.…వేంకటేశ్వర రావు ఆళ్ల, 
వికారాబాద్.

Shopping Cart