shanku puvvu-Medicinal properties

👉 నీలి రంగు శంఖ పువ్వు దేవుని పూజలోనే కాదు.. ఆరోగ్యానికి కూడా దివ్య ఔషదం..

👉 ఎలాగో తెలుసుకుందాం

👉 శంఖపుష్పం దేవుని పూజకు ఎంత పవిత్రమని భావిస్తారు. ఫాబేసి కుటుంబానికి చెందిన తీగ జాతి కి చెందిన మొక్క. వీటిని సంస్కృతంలో గిరికర్ణిక అని పిలుస్తారు. విష్ణుక్రాంత వృక్షానికి చెందినది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పలు పరిశోధనల్లో తెలుస్తోంది. దీనితో బ్లూ టీని తయారు చేస్తారు అది ఎలాగో చూద్దాం

👉 మూడు నాలుగు శంఖ రేకులను ఒక కప్పు నీటిలో వేయండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మరిగించి 4-5 నిమిషాలు మూత పెట్టాలి ఒక గ్లాసులో వడకట్టి తేనెతో త్రాగాలి. ఈ బ్లూ టీ శరీరానికి చాలా మేలు చేస్తుంది

👉 ఈ పువ్వు వివిధ వ్యాధులను నయం చేయడానికి సహాయపడుతుంది నీలిశంఖపువ్వు యాంటీఆక్సిడెంట్లు ఆందోళన మరియు ఒత్తిడిని దూరం చేస్తాయి

👉 నీలి రంగు శంఖపువ్వు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది వాపును తగ్గించడానికి మరియు అనేక దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించే లక్షణాలను కలిగి ఉంది

👉 శంఖపువ్వు సారం కొవ్వు కణాల ఏర్పాటును నిరోధిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. నీలి శంఖంపుష్పం చిన్న ప్రేగు ఆరోగ్యాన్ని కాపాడడం ద్వారా జీర్ణక్రియకు సహాయపడుతుంది

-NIvas : CTG Khammam

Shopping Cart