Selection of Potsize for Terrace Gardens

మిద్దెతోట మొదలుపెట్టేటప్పుడు మనలో చాలా మందికి ఏ మొక్క ఎంత సైజు కుండీలో పెట్టాలో అవగాహన ఉండదు. నాకున్న కొంచం ఎక్స్పీరియన్స్ తో మీకు ఈ విషయం గురుంచి చెబుతున్నాను.
ముందుగా ఆకు కూరలని ఎటువంటి వాటిలో పెంచుకోవచ్చో చూద్దాం
మెంతులు :
వీటిని మన దగ్గర ఉన్న పనికి రాని కూల్ డ్రింక్ బాటిల్స్ దగ్గర నుండి స్వీట్ బాక్సలలో,కొబ్బరి చిప్పలలో ఇలా మనకి ఏది అందుబాటులో ఉంటే అందులో పెంచుకోవచ్చు.
కొత్తిమీర,పుదీనా :
వీటిని 6 అంగుళాల లోతు గల కుండీలో సులువుగా పెంచుకోవచ్చు.
తోటకూర,గోంగూర,పాలకూర, సిలోన్ బచ్చలి :
8 అంగుళాల లోతు గల కుండీలో పెంచుకోవచ్చు.
టమాటా,వంగ :
12 అంగుళాల లోతు గల కంటైనర్ లో ఒక మొక్క చొప్పున పెట్టుకోవచ్చు.
10 liters పెరుగు బకెట్ లో,సగం కట్ చేసిన వాటర్ బబుల్ లో ఒక్కొక్క మొక్క పెట్టుకోవచ్చు.
మిర్చి,బెండ,గోరుచిక్కుడు,చెట్టు చిక్కుడు : 12 అంగుళాల లోతు గల కంటైనర్ లో 2-3 మొక్కలు పెట్టుకోవచ్చు.
మల్బరీ,గులాబీ,మందార: 10లీటర్ల పెరుగు బకెట్ లో ఒక మొక్క చొప్పున పెట్టుకోవచ్చు.

MADHURI
CTG VIJAYAWADA 1

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart