Rose Plant Growing Tips-Telugu

🌹 గులాబీ మొక్కల పెంపకం చిట్కాలు 🌹
గులాబీ మొక్కలు చూస్తే wow అనిపించక మానవు! ఇందులో ఎన్నో రంగులు, కొత్త కొత్త హైబ్రిడ్ రకాలు అందుబాటులో ఉన్నాయి.
👉 నాటు గులాబీ రకాలు తెగుళ్లను తట్టుకుని హెల్తీగా పెరుగుతాయి.
👉 హైబ్రిడ్ రకాలు కొంతకాలం మాత్రమే బాగుంటాయి, త్వరగా చనిపోతాయి.
గమనిక:
గులాబీ మొక్కలు pH ఎక్కువ ఉన్న మట్టిలో బాగా పెరుగుతాయి.

కొత్తగా నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలు మధ్యలో ఎండిపోవడం లేదా చనిపోవడం సాధారణం. దానికి కారణాలు ఇవి:

🌱 1. రీపాటింగ్ పద్ధతి

  • నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలను మన వాతావరణానికి అలవాటు అయ్యాక రీపాటింగ్ చేయాలి.
  • రూట్స్ డిస్ట్రబ్ కాకుండా జాగ్రత్తగా చేయాలి.

– రూట్స్ దగ్గర ఉండే చిన్న బాస్కెట్లు తీసి మొక్కలను నాటడం మంచిది.

🌱 2. మట్టిలో ఎరువుల మిశ్రమం

  • పశువుల ఎరువు, ఎండుఆకులు, వేపపిండి కలిపి మట్టిని గుల్లగా చేయాలి.

– నిమ్మ తొక్కలు, నారింజ తొక్కలు వంటి పుల్లటి పదార్థాలు కలిపితే గులాబీ బాగా పెరుగుతుంది.

🌱 3. పుష్పాల కోసం ప్రత్యేక టిప్స్

– మొక్క బ్రతికిన తర్వాత నిమ్మరసం, ఫ్రూట్ బేస్డ్ వెనిగర్, కాఫీ పౌడర్, టీ పౌడర్ వేస్తే పూలు గుబురుగా, మంచి రంగులో వస్తాయి.

🌱 4. ప్రూనింగ్ అవసరం

  • మొగ్గలు అయిపోయాక కొమ్మలను కట్ చేసి, పశువుల ఎరువు వేయాలి.

– కొత్త చిగురులు వస్తాయి, వాటితో కొత్త మొగ్గలు మొదలవుతాయి.

🌱 5. ఎండు తెగుళ్ల నివారణ

  • కొమ్మలు ఎండిపోతే వెంటనే తీసి వేయాలి.

– NPK ఎరువు వేయడం వల్ల సమస్య తీరుతుంది.

🌱 6. ఫంగిసైడ్ అప్లికేషన్

  • ఎండిన కొమ్మలను కట్ చేసిన తర్వాత ఫంగిసైడ్ అప్లై చేయాలి.

– అప్పుడు ఆ ప్రదేశం నుంచి కొత్త చిగురులు వస్తాయి.

🌹 గమనించవలసిన ముఖ్యాంశాలు:

  • ఎండిన కొమ్మలు ఎప్పటికప్పుడు తీసివేయాలి.

– జాగ్రత్తగా పెంచితే గులాబీ మొక్కలు 2-3 సంవత్సరాలు సులభంగా పూస్తాయి. 👍🌱

నా అనుభవం:
నాకు తెలిసిన సరళమైన చిట్కాలు మీతో పంచుకుంటున్నాను. కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసే వారికి ఇవి చాలా ఉపయోగపడతాయి. 🌹🌹🌹🌹

Credit:
జయ ఉండవల్లి, CTGian🌱🌹

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart