From Venugopal’s Terrace Garden
Phosphorus uses. How and when to use.
మొక్కలు బాగా ఆరోగ్యంగా ఎదగడానికి వాటి వేరు వ్యవస్థ (Roots) చాలా important. కానీ మనలో చాలామంది పశువుల ఎరువు, vermicompost వేస్తే సరిపోతుంది అని అనుకుంటారు. కానీ వాటి వేరు వ్యవస్థ మీద అంత శ్రద్ధ చూపం. మొక్క ఆరోగ్యంగా, బలంగా, చీడ పీడలను తట్టుకొనేటట్లుగా ఉండాలంటే వేరు వ్యవస్థ చాలా ముఖ్యం. అవి ఎలా వృద్ధి చెందుతాయి అనే విషయం చూద్దాం. మొక్క బాగా ఎదిగి వున్నప్పుడు, దాని ఆకులద్వారా సూర్యరశ్మి గ్రహించి, కిరణజన్య సంయోగ క్రియ జరిగి ఆహారం తయారయి కొమ్మలూ, రెమ్మలూ ద్వారా చివరికి వేళ్ళకు చేరి వేళ్ళు వృద్ధి చెందుతాయి. ఇది మొక్క ఎదిగి వున్నప్పటి పరిస్థితి. కానీ విత్తనం వేసినప్పుడు ఈ స్థితి లేదు కదా. మరి అప్పుడు వేరు వ్యవస్థ ఎలా వస్తుంది మొక్క ఎలా ఎదుగుతుంది. చెట్టు ముందా విత్తు ముందా అన్నట్లు వుంటుంది.
బలమైన వేరువ్యవస్థ కి Phosphorus ముఖ్యం. మొక్క ఎదిగాక ఇంక ఫాస్ఫరస్ అవసరం లేదు. అందుకే మనం Phosphorus ఎరువుని విత్తనం పెట్టినప్పుడే లేదా నారు నాటినప్పుడే వెయ్యాలి. అందుచేత విత్తనం వేసేటప్పుడు కానీ, నారు నాటేటప్పుడు గానీ విత్తనానికి, నారు వేర్లకి అతి దగ్గరగా మాత్రమే phosphorus వెయ్యాలి. Bone Meal ని soil Mix లో కలపకూడదు. కలిపినా మొక్కకి అది అందదు. నారు మొక్కని నాటేటప్పుడు Grow Bag లోనీ soil mix లో చిన్న గొయ్యి(నారు మొక్క పట్టేటంతగా) తీసి, అందులో ఒక Teaspoon Bone Meal గానీ Rock phosphate గానీ చల్లి నారు మొక్కని పెట్టండి. నారు మొక్క వేళ్ళకి మనo వేసిన Bone Meal కి గానీ Rock phosphate కి గానీ తగిలినప్పుడే వేళ్ళు బాగా వృద్ధి చెందుతాయి.(ఈ ఎరువు వేళ్ళకు తగిలినా మొక్క వేళ్ళు పాడవవు. Phosphorus పనిచేయాలంటే VAM వెయ్యాలి. VAM పనిచేయాలంటే Potash, Nitrogen కావాలి. VAM ఎలా పనిచేస్తుంది, Potash, Nitrogen ఎందుకు కావాలి అనేది ఇంకో Note లో చెప్పుకుందాం.
_Venugopal, A Member of CTG Family