🪰 Pest Management🪰
➡ వ్యవసాయం లో కాని మిద్దెతోట/పెరటితోట ల్లో కాని పెస్ట్ అనేది ప్రధాన సమస్య.. ఈ చీడ పీడలకు భయపడే చాలా మంది సేంద్రీయ విధానం లో మొక్కల పెంపకం పట్ల ఆసక్తి చూపరు, వెనకడుగు వేస్తుంటారు.
అయితే ఈ క్రిమి కీటకాలు ఎన్ని రకాలు ఉంటాయో చూద్దాం..
➡ ఈ భూమి మీద దాదాపు 15 లక్షల సూక్ష్మజీవులు, క్రిమికీటకాలు, పురుగులు ఉంటాయి, వీటిలో మొక్కలకు హాని చేసేవి ప్రధానం గా 15 వేలు మాత్రమే.
అంటే 15 లక్షల్లో 15 వేల పురుగులు శత్రు పురుగులు,
మిగతావన్ని మిత్ర పురుగులు. అయితే శత్రు పురుగులు బలంగా, మిత్ర పురుగులు కొంచం బలహీనం గా ఉంటాయి.
➡ సాధారణంగా ప్రతి పురుగులలో తల్లి దశ, గుడ్డు దశ, లార్వా దశ, ప్యూపా దశ ఉంటాయి, మొక్కలకి ఎక్కువ ప్రమాదం కలిగించే దశ లార్వా దశ.
➡ మిత్ర పురుగులు లో రెండు రకాలు ఉంటాయి
- పరాన్న జీవులు (parasites)
- పరాన్న భక్కులు (predators)
వీటినే Biological Control Agents అని అంటారు.
👉 పరాన్న జీవులు ( Parasites) :-
ఈ మిత్ర పురుగుల శరీరం లో సిరంజి లాంటి నిర్మాణం ఉంటుంది, దీని ద్వారా మొక్కల ఆకులని కొమ్మలను అంటి పెట్టుకుని ఆకుల రసం పీల్చుతు, కాండం తింటూ ఉన్న శత్రు పురుగుల శరీరం పై గుడ్లు పెట్టి వెళ్ళిపోతాయి, ఈ మిత్ర పురుగుల గుడ్లు ఆ శత్రు పురుగుల శరీరం లోపలికి వెళ్లి వాటి శరీరం లోపలే లార్వా, ప్యూపా దశల్ని పూర్తి చేస్కుంటాయి, ఈలోపులో ఇవి ఆ శత్రు పురుగుల శరీర బాగాల్ని తినేస్తూ పెరిగి బయటకు వస్తాయి, ఆ శత్రు పురుగు చనిపోతుంది.
👉 పరాన్న భక్కులు ( Predators) – ఈ మిత్ర పురుగులు మొక్కల చుట్టూ తిరుగుతూ శత్రు పురుగుల్ని,మొక్కల ఆకులపై ఉన్న శత్రు పురుగుల గుడ్లను తినేస్తూ ఉంటాయి.
Trichogramaa అనే మిత్ర పురుగు ఆహరం శతృ పురుగుల గుడ్లు.
బయట మార్కెట్ లో Tricho cards అని దొరుకుతాయి, ఆ cards పై దాదాపు 10 వేల trichogramma eggs ఉంటాయి, ఈ cards ని నాలుగు భాగాలు చేసి మొక్కల మధ్యలో ఆకులకి కడతారు, ఆ cards కి ఉన్న eggs నుండి బయటకు వచ్చిన trichogramma పురుగులు శత్రు పురుగుల గుడ్ల ని వెతుక్కుంటూ వెళ్లి తింటుంది.
👉 తూనీగలు, సాలె పురుగులు, ముసురు ఈగలు, అక్షింతల పురుగులు, కందిరీగలు, గొల్ల భామ ఇలాంటివి మిత్ర పురుగులు. పక్షులు కూడా మొక్కలకు మేలు చేసేవే.
➡ మొక్కల కి శత్రుపురుగుల లక్ష్యం గా రసాయన పురుగు మందులు స్ప్రే చేయడం ద్వారా ఆ మందులు గాలి లో కొంత, నీటిలో కొంత, నేల లో కొంత కలుస్తుంది, దాని వల్ల వాతావరణం కలుషితం అవుతుంది, ఈ రసాయన మందుల ప్రభావం వలన మిత్ర పురుగులు, నేల లో ఉన్న మంచి సూక్ష్మ జీవులు కూడా చనిపోతున్నాయి.
➡ వాతావరణం, నేల కలుషితం కాకుండా నేలలో జీవం ఉండాలన్నా, మిత్ర పురుగులు చనిపోకుండా ఉండాలన్నా, సేంద్రియ విధానం లో మొక్కల పెంచుతూ పంటలు పండించాలి.
-SRINIVAS KONIDANA KHAMMAM CTG
TEAM CTG