Distribution లో OWDC పాకెట్స్ తీసుకున్నవారు..ఇలా తయారుచేసుకోవాలి.
ఒక పాకెట్ తో 100 లీటర్లు OWDC ద్రావణం చేసుకోవచ్చు.. 100 లీటర్ ల బ్లీచింగ్ చేయని( unchlorinated water)నీరు ఒక ప్లాస్టిక్ container లో తీసుకోండి..
దానిలో 500 గ్రాముల బెల్లం కరిగేలా కలపండి.
బాగా జరిగిన తరువాత దానిలో మీకునిచ్చిన ప్యాకెట్ లోని పౌడర్ నీ మొత్తం వేసెయ్యండి. బాగా కలిపి పైన గాలి తగిలేలా మూత పెట్టండి..గుడ్డ కట్టినా చాలు.. ప్రతిరోజూ ఉదయం సాయంత్రం కర్ర పుల్లతో కానీ, ప్లాస్టిక్ గొట్టం తో గానీ ఒక్క నిమిషం సేపు కలుపుతూ ఉండండి..రాగి,ఇనుము లాంటి లోహం తో చేసినవి పనికి రావు.
వారం రోజులలో మీకు OWDC ద్రావణం తయారవుతుంది .
దీనిని మట్టిలో 1 కి రెండింతలు నీరు కలిపి వేయండి..స్ప్రే కూడా చేయవచ్చు..
అలానే కంపోస్టు త్వరగా , బాగా కావడానికి కంపోస్టు బిన్ లో ప్రతి లేయర్ కి చిలకరించవచ్చు.
దీనిలో అనేకరకాల బ్యాక్టీరియా లు సంగ్రహించి పొందుపరిచారు.
దీనిలో కార్బన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా, కార్బన్ excreeting బ్యాక్టీరియా తో పాటు , photosynthesis bacteria, NPK bacteria, PSEUDOMONOS ఇలా చాలా బ్యాక్టీరియా లున్నాయి..ఇదొక్క కల్చర్ చాలు టెర్రస్ gardeners కి..ప్రతివారం వాడండి..అద్భుతమైన ఫలితాలుంటాయి.
ఒకసారి తయారు చేసుకున్న OWDC ద్రావణం ఒక నెల నిల్వ ఉంటుంది..తయారయిన దానిలో ఒక పదిలిటర్ లు పక్కన పెట్టుకుని దానిని మరల బెల్లం కలిపి 100 లీటర్ లు తయారుచేసుకోవచ్చు..ఇలా చాలా సార్లు చేసుకోవచ్చు .అతి తక్కువ ఖర్చు తో ఎక్కువ ఫలితం పొందవచ్చు .జీవామృతం చేసుకోలేని వారికి ఇది ఒక వరం. దీనిని అన్ని సబయాలలో వాడవచ్చు .ఎదిగే దశలో,పూలు వల్ల దశలో వాడవచ్చు . విత్తన శుద్ది కి వాడవచ్చు..నారు శుద్ధికి వాడవచ్చు. Decomposer గా వాడవచ్చు..multi purpose culture..