“Organic liquid fertilizers/ సేంద్రీయ పోషక ద్రావణాలు”
- Beet root/ బీట్ రూట్ ద్రావణం:
బీట్ రూట్ లో వుండే సేంద్రీయ రసాయనాలు:
- పొటాషియం,
- మాంగనీస్,
- ఇనుము మరియు
- జింక్ వుంటాయి.
ఇవి మంచి సహజ ఖనిజాలు/సూక్ష్మ పోషకాలు.
సూక్ష్మ పోషకాలు/ Micro nutrients కిరణ జన్య సంయోగక్రియ లో ముఖ్య పాత్రను పోషిస్తాయి.
అందువల్ల ఇది మొక్కల ఎదుగుదలకు దోహదం చేస్తుంది.
ఇది instant booster గా పని చేసే Epsum salt లా మొక్కలకు సహాయ పడ గలదు.
తయారీ విధానం:
1 లీటరు నీటిలో ఒక బీట్ రూట్ ను సన్నగా తరిగి వేయండి.
దాన్ని 4 నుండి 7 రోజుల పాటు fermentation process అయ్యే వరకు వుంచాలి.
తరువాత 1:2 నిష్పత్తిలో నీళ్ళు కలిపి మొక్కలకు ఇవ్వ వచ్చు.
మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి.
వేసవిలో మొక్కలకు ఇవ్వ దగ్గ పోషక విలువలు కలిగిన ద్రావణం ఇది.
- బచ్చలి ఆకుల ద్రావణం:
బచ్చలి ఆకుల లో వుండే సేంద్రీయ రసాయనాలు:
- ఇనుము, 2. కాపర్,
- ఫాస్ఫరస్ మరియు
- జింక్.
ఇవి మంచి సహజ ఖనిజాలు/సూక్ష్మ పోషకాలు.
సూక్ష్మ పోషకాలు/ Micro nutrients కిరణ జన్య సంయోగక్రియ లో ముఖ్య పాత్రను పోషిస్తాయి.
అందువల్ల ఇది మొక్కల ఎదుగుదలకు దోహదం చేస్తుంది.
ఇది instant booster గా పని చేసే Epsum salt లా మొక్కలకు సహాయ పడగలదు.
తయారీ విధానం:
1 లీటరు నీటిలో కొన్ని బచ్చలి ఆకులను బాగా దంచి వేయండి.
దాన్ని 4 నుండి 7 రోజుల పాటు fermentation process అయ్యే వరకు వుంచాలి.
తరువాత 1:2 నిష్పత్తిలో నీళ్ళు కలిపి మొక్కలకు ఇవ్వ వచ్చు.
మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి.
వేసవిలో మొక్కలకు ఇవ్వదగ్గ మరోపోషక విలువలు కలిగిన ద్రావణం ఇది.
“సర్వే జనః సుఖినోభవంతు”
వేంకటేశ్వర రావు ఆళ్ళ, వికారాబాద్.
(CTG GROUPS)
—-oOo—-