NWDC ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.
100 LITER ల బోర్ వాటర్ తీసుకోండి. అందులో ఒక KG బెల్లం పూర్తిగా కరిగేలా కలపండి.. తరువాత అందులో 50 గ్రాముల NWDC ( బాటిల్ లోనిది అంతా)
వేసి బాగా పుల్లతో గాని, ప్లాస్టిక్ పైప్ తో గాని తిప్పండి. అలా రోజుకి రెండు సార్లు తిప్పుతూ ఉండాలి.. పైన పురుగులు పడకుండా గుడ్డ గాని గోనెపట్టా గాని కప్పి ఉంచండి..20 రోజులు అలా ఉంచాలి.. పొద్దుట సాయంత్రం కలపడం తప్పని సరి…21 వ రోజున పూర్తిగా NWDC ద్రావణం తయారై ఉంటుంది.. అందులో 5 liter లు తీసి పక్కన పెట్టుకోండి. మరల తయారు చేసుకోడానికి….
మిగిలిన 95 liter ల ద్రావణం పిచికారి చేసుకునే ద్రావణం..
ఇప్పుడు ఒక kg సున్నం 5 liter ల నీటిలో బాగా కలిపి చల్లగా ఉండే సున్నపు నీటిని ముందు తయారు చేసుకున్న 95 liter ల NWDC ద్రావణం లో బాగా కలిపి వెంటనే మొక్కలన్నీ తడిసేలా స్ప్రే చేయాలి.. నేను చెప్పిన ఈ కొలతలన్ని ఒక ఎకరానికి సరిపోతుంది.. దీనిని ఉన్నది ఉన్నట్టు గానే స్ప్రే చేయాలి డైల్యూట్ చేయకూడదు.
అదే మిద్దె తోటల వారికి 20 liter ల ద్రావణానికి కొలతలు.
బెల్లం 200 గ్రాములు
సున్నం 200 గ్రాములు.
NWDC పావు సీసా వేసుకుంటే చాలు..
డైల్యూట్ చేయకుండా స్ప్రే చేసుకోవాలి.. గుర్తుంచుకోండి.. సున్నము కలపక ముందే కొంత పక్కకు తీసి నెక్స్ట్ బ్యాచ్ కి జాగ్రత్త చేసుకోవాలి.
ఇది మొక్కకి ఒక కవచం లా ఏర్పడి మొక్కను పురుగుల నుండి fungus బాక్టీరియా ల నుండి 80 శాతం కాపాడుతుంది..
ఏ సున్నం వాడాలి.
1.కిల్లీ లలో వేసే సున్నం వాడవచ్చు.
- గుల్ల సున్నం వాడవచ్చు.
- సున్నపు రాళ్ళను నీటిలో వేసి అవి చల్లారి ముద్దగా అయ్యాక ఆ సున్నం వాడవచ్చు..
ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగ వచ్చు.
- IVV VARA PRASAD.
RAJAHMUNDRY.