Nutrient deficiencies in Plants-Remedies

మొక్కల్లో స్తూల పోషకాల లోపాలు, వాటి నివారణ మార్గాలు

బోరాన్ లోపం:-

మొక్కల్లో బోరాన్ లోపించినప్పుడు చిగుర్లు, మొగ్గలు రంగు మారతాయి,రాలి పడిపోతుంటాయి

నివారణ :-

లేత తాజా కొబ్బరి నీళ్లు ఒక 50 to 100 ml తీస్కుని ఒక లీటర్ నీటిలో డైల్యూషన్ చేసి మొక్కలకి ఇవ్వచ్చు, స్ప్రే కూడా చేయచ్చు

సల్ఫర్:-

మొక్కల్లో సల్ఫర్ లోపం వలన ఆకులు లేత ఆకుపచ్చ రంగులోకి మారతాయి, ఆకుల ఈనెల పాలిపోయినట్లు ఉంటాయి, ఆకుల పై ఎటువంటి మచ్చలు ఉండవు

నివారణ:-

సల్ఫర్ లోపానికి ఇంగువ ధ్రావణం చక్కగా పనిచేస్తుంది, ఒక చిటికెడు ముద్ద ఇంగువ తీస్కుని కొంచం వేడినీటిలో నాన పెట్టి ఆ నీటిని ఒక 2 spoons తీస్కుని ఒక లీటర్ నీటిలో కలిపి మొక్కలki స్ప్రే చేయాలి

కాల్షియం

కాల్షియం లోపం వలన మొక్క ముదురు ఆకు పచ్చ రంగులో ఉంటుంది, చిగుర్లు మాత్రం పాలిపోయి ఉంటాయి, చిగుర్లు ఎండిపోతాయి,

నివారణ

దీని నివారణ కు కోడిగుడ్డు పెంకుల పొడి వాడవచ్చు, సున్నం పొడి కూడా మట్టి మీశ్రమం లో కలపచ్చు, లేదా వేనిగర్ ని కూడా నీటిలో కలిపి మొక్కలకు ఇవ్వచ్చు

ఐరన్

ఐరన్ లోపం వలన ఆకులు పాలిపోయి ఉంటాయి, ఈనెలు మాత్రం ముదురు ఆకు పచ్చ రంగులోనే ఉంటాయి, ఆకుల పై ఏ మచ్చలు ఉండవు

Zinc

జింక్ లోపం వలన మొక్కల ఆకులు పాలిపోయి ఉంటాయి, ఆకుల చివర్లు ఏండి పోయి సన్నగా మారతాయి, ఏ ఎదుగుదల ఉండదు, ఆకులపై మచ్చలు ఉంటాయి

కాపర్

కాపర్ లోపం వలన ఆకులు పాలిపోయి గులాబీ రంగులోకి మారిపోయి రాలిపోతుంటాయి

నివారణ

మొక్కల్లో ఐరన్, కాపర్, జింక్ లోపం గమనించినప్పుడు OWDC నీళ్లలో జింక్, కాపర్, ఐరన్ ముక్కలని కానీ plates ని నానపెట్టి మొక్కలకి పోయాలి

మాంగనీస్

మాంగనీస్ లోపం వలన ఆకులు పాలిపోయి, ఈనెలు ముదురు ఆకుపచ్చ రంగులో మారి ఆకుల పై మచ్చలు ఉంటాయి ఆకులు రాలిపోతుంటాయి

నివారణ

మొక్కల లో మాంగనీస్ నివారణ కు owdc నీళ్లని వాడవచ్చు, లేదా పెసలు, శనగలు, రాగులు ఇలా అన్ని రకాల మొలకలు అన్ని మిక్సీ పట్టి ఆ ద్రావణాన్ని నీళ్లలో కలిపి మొక్కల కి పోయాలి, అలాగే వాడేసిన టీ పొడి ని కూడా మొక్కలకు ఇవ్వచ్చు

మెగ్నీషియం

మెగ్నీషియం లోపం వలన ఆకులు పాలిపోయి ఒక cup లాగా ముడుచుకుంటాయి , ఆకులపై మచ్చలు పడి రాలిపోతుంటాయి

నివారణ

దీని నివారణ కు epsom salt ఒక 2 spoons ఒక లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేయచ్చు, మొక్క ఉన్న మట్టిలో ఇవ్వచ్చు, మొలకల ధ్రావణం, owdc కూడా బాగా పని చేస్తుంది

మాలిబ్దినమ్

మాలిబ్దినం లోపం వలన ఆకులు నారింజ రంగులో కానీ, పసుపు రంగులోకి కాని మారతాయి, ఆకుల పై మచ్చలు ఉన్నాయి, ఆకుల అడుగు భాగం లో జిగురు లా వస్తుంది

నివారణ

దీని నివారణ కు కూడా OWDC నీళ్లు, మొలకల ధ్రావణం స్ప్రే చేయడం వలన ఉపయోగం ఉంటుంది

ఫాస్పరస్

ఫాస్పరస్ లోపం వలన ఆకులు చిన్నగా ఉంటాయి, ఎదుగుదల ఉండదు, ఆకులు రాగు రంగులోకి మారి ఆకుల చివర్లు ఎండిపోయి ఉంటాయి

నివారణ

నివారణ కు మట్టి మీశ్రమం లో ఇసుక కానీ గులాకరాళ్ళ ని కాని రాళ్ళ పొడి ని కానీ కలపాలి

పోటాసియం

పోటాషియం లోపం వలన ఆకులు చిన్నగా ఉంటాయి, ఆకుల చివర్లు మాడిపోయి వెనక్కి ముడతపడి ఉంటాయి, ఆకులు పై తుప్పు పట్టినట్లు మచ్చలు ఉంటాయి

నివారణ

దీని నివారణ కు బూడిద కాని ఎండిపోయిన అరటి తొక్కలు పొడి చేసి మొక్కలు ఉన్న కుండీలలో వేస్తుండాలి

nitrogen

నైట్రోజెన్ లోపం వలన ఆకులు నీటారుగా నిలబడి ఉంటాయి,ఆకులు బాగా పాలిపోయి ఉంటాయి, ఆకులపై మచ్చలు ఉంటాయి, ఆకులు మాడిపోయి ఉంటాయి

నివారణ

nitrogen కొసం మొక్కలకి vermi compost ఇస్తుండాలి, లేదా మొక్కలు ఉన్న కుండీ లలో ధ్విదళం కలిగిన విత్తనాలు నాటాలి (చిక్కుడు, బీన్స్ ) ఇవి వాటి వెర్లలో nitrogen ని దాచుకుని పక్కనే ఉన్న మిగతా మొక్కల ki అందిస్తాయి

Thank you
Rupineni Sarojkanth

Shopping Cart