Micronutrient liquid Fertilizer with OWDC

From Venugopal’s Terrace Garden

Micronutrient liquid Fertilizer with OWDC:

ఎలా తయారు చేసుకోవాలి:

ఇది చాలా Powerful Micronutrient Liquid Fertiliser. దీనికి కావలసినవి one Month Old OWDC, 3 నుంచి 4 రకాల పప్పుల పొడుల రకాలు:- కంది పిండి, పెసర పిండి, మినుగులు పిండి, రాగిపిండి, మొక్కజొన్న పిండి తీసుకోవచ్చు. అలాగే 3 నుంచి 4 రకాల Oil cakes say Groundnut cake, Gingelly cake, Mustard Cake, Sunflower cake etc, all mixed cake powder కూడా తీసుకోవచ్చు. వేప పిండి కూడా. రాగి చెంచా కానీ రాగి గిన్ని కానీ. ఇనుప మేకులు లేదా ఇనుప ముక్క ఏవయినా సరే. Boric acid powder, Rice Bran, కట్టెల బూడిద.

50 లీటర్ల తయారీ:– 50 లీటర్ల plastic Drum నిండా one month old OWDC  పోసి అందులో ఒక్కోక్క కిలో చొప్పున 4 రకాల పొడులు, 3 రకాల oil cakes, ఒక కిలో Rice Bran, 200 grams Boric Powder, ఒక దోసెడు వేప పిండి, బూడిద రెండు దోసెళ్లు, రాగి వస్తువు, ఇనప మేకులు, జింక్ ముక్క వేసి అన్నీ బాగా కలిసేటట్లు కలిపి మూత పెట్టి నీడలో పెట్టాలి. నీడ లేకపోతే పట్టా కప్పాలి. వారం నుంచి పది రోజుల పాటు రోజూ కలపాలి.

Usage and Dosage:

ఈ mixture One liter, OWDC 4 liters, Water 10 liters కలిపితే వచ్చిన mixture ని మొక్కకి ఒక మగ్గు చొప్పున లేదా మొక్క ఎంత తీసుకుంటే అంత వారం నుంచి 10 days కి ఒక సారి పోయవచ్చు అలాగే నెలకి ఒకసారి Spray కూడా చెయ్యవచ్చు.

గార్డెన్ size ని బట్టి ఎంత కావాలో అంతే తయారు చేసుకుంటే బావుంటుంది. దీనిని ఏడాది లోపుగా వాడేసుకుంటే బాగుంటుంది. ఇది పురుగులు పట్టినా ఏమీ ప్రమాదం లేదు. Filter చేసుకుని వాడుకో వచ్చు.

By Venugopal, A Member of CTG Family
From Venugopal’s Terrace Garden
EAT What You Grow-Grow What you Eat

Grow & Eat Organic Vegetables &  Be Healthy

Shopping Cart