Macro And Micro Nutrients

From Venugopal’s Terrace Garden

Macro and Micronutrients – Application:

Macronutrients  ఇంకా Micronutrients గురించి ఇదివరకు మనం మెసేజ్ ద్వారా తెలుసుకున్నాం. ఇంకా మొక్కలకి Macronutrients  ఎక్కువ మోతాదు లోనూ, Micronutrients తక్కువ మోతాదు లోనూ అవసరం అవుతాయి అనే విషయం కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు అవి ఎలా అప్లై చేయాలి అన్న విషయం చూద్దాం.

శాస్త్రజ్ఞులు ఏం చెప్తారంటే, Macronutrients  ఎప్పుడూ Soil application గానూ, Micronutrients Foliar Spray గానూ ఇవ్వాలని. ఎందుకంటే మొక్కలు Nutrients ని వేళ్ళ ద్వారా తొందరగానూ, ఇంకా ఎక్కువ మోతాదు లోనూ, తీసుకుంటాయి. ఆకుల ద్వారా కూడా తీసుకుంటాయి గానీ తక్కువ మోతాదులోనూ, ఇంకా నెమ్మదిగా తీసుకుంటాయి. అందుకనే పై సలహా ఇవ్వడమైనది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే Macronutrients ఎప్పుడూ విత్తు నాటేటప్పుడు or Transplantation time లోనే ఇచ్చేయ్యాలి. అంటే Soil mix నే బలంగా వుండాలి. అప్పుడే మొక్క బలంగా ఆరోగ్యంగా ఎదిగి మంచి yield ఇస్తుంది. అవసరం అయినప్పుడు పై పాటుగా ఇస్తూ వుండాలి. ఎరువులు soil application గా ఇచ్చినప్పుడు, మట్టిలో Moisture వుండేటట్లు చూసుకోవాలి. ఇంకా Topsoil లూజు చేసి, without disturbing Surface roots, ఎరువు వేసి కలపాలి. పైపైన ఎరువు వేసేసి వదిలేస్తే అది మొక్కల వేళ్ళకి అందదు. దానివల్ల వేసిన ఉపయోగం ఉండదు. ఎరువు వేసిన తరువాత లైట్ గా watering చేస్తే, మనం వేసిన ఎరువు మొక్కల వేళ్ళ దాకా చేరే అవకాశం వుంటుంది.

ఇదివరకు చెప్పుకున్నట్లుగా మొక్కలకి ఎప్పుడూ fully decomposed ఎరువు మాత్రమే ఇవ్వాలి. Partially or undecomposed ఎరువు ఇవ్వ కూడదు. దానివల్ల నష్టమే గానీ ఉపయోగం వుండదు.

-Venugopal, A Member of CTG Family

Shopping Cart