“Kitchen waste compost process”

“Kitchen waste compost process”

వంటగది వ్యర్థాల నుండి కంపోస్ట్ తయారీ విధానం:

కూరగాయలు తరిగిన తరువాత, మిగిలిన వ్యర్థాలను (waste ను) ఉపయోగించి, ద్రవ రూపంలో కంపోస్టు తయారు చేసుకోవచ్చు.
వంటగది లో వ్యర్ధాలు అంటే, తరిగిన పచ్చి కూరగాయల వ్యర్థం, కూరగాయల తొక్కలు, పండ్ల తొక్కలు, ఆకు కూరల వేస్ట్ (సిట్రస్ జాతి కి చెందిన పండ్ల వేస్ట్, వుడికించిన పదార్థాలు తప్ప) అన్నీ కిచెన్ కంపోస్ట్ తయారీ కి పనికి వస్తాయి.

  1. బోకాషి బిన్ ద్వారా ద్రవ రూపంలో కంపోస్టు తయారు చేసుకోవచ్చు.
  2. ఎండు టాకులు, గార్డెన్ లోని రాలిన పచ్చి ఆకులు, ప్రూనింగ్ చేయగా వచ్చిన పచ్చి ఆకులు, పచ్చి కిచెన్ వేస్ట్ తో ఘన రూపం లో మంచి కంపోస్ట్
    తయారీ చేసు కో వచ్చు.
  3. కిచెన్ వేస్ట్ ని ఆరబెట్టి ( ఎండ తగలకుండా) ఘన రూపంలో మంచి కంపోస్ట్ ని త్వరగా తయారు చేసుకో వచ్చు.
  4. పూజకు వాడిన, వాడిన పూలు, మనకున్న అవకాశాల ను బట్టి మనం సేకరించిన పూలను ఉపయోగించి ద్రవ రూపంలో కంపోస్టు తయారు చేసుకో వచ్చు.
  5. బోకాషి బిన్ ద్వారా ద్రవ రూపంలో కంపోస్టు తయారు చేసే విధానం:

ఈ విధానంలో రెండు అరలు వుంటాయి. ఒక బకెట్ లో ఇంకో బకెట్ అమర్చి ఉంటాయి.

మొదటి అర పై భాగంలో, lid ( మూతకి చుట్టూ) రెండు అంగుళాల క్రింద ఆ బకెట్ చుట్టూ రంధ్రాలు ఉంటాయి. (గాలి జొరబడటానికి)
అలానే ఆ బకెట్ క్రింది భాగం జల్లెడ లా వుంటుంది. (చేసుకోవాలి) దానిద్వారా పై భాగం
అంటే పైన వున్న బకెట్ లో వేసిన వంట గది వ్యర్థాల నుండి స్రవించిన ద్రావణం క్రింది బకెట్ లోకి చేరుతుంది.

క్రింది బకెట్ కి ఒక tap అమర్చుకుని దాని నుండి ద్రవాన్ని తీసికో వచ్చు.

ఏరోజుకారోజు కిచెన్ వేస్ట్ పై బకెట్ లో వేస్తూ వుండాలి. అలా మనకు liquid రూపంలో వస్తూనే వుంటుంది.

ఈ liquid ని 1: 10 ratio లో వాటర్ కలిపి , కొద్దిగా బెల్లం కలిపి మొక్కలకు
ఎరువుగా ఇవ్వవచ్చు. ( బెల్లం ఎప్పటి కప్పుడు కలుపుకోవాలి)

పై బకెట్ లో మురిగి పోయి, తడియారిన వేస్ట్ ని ఇంకో పద్ధతి ద్వారా ఘన రూపంలో కంపోస్టు తయారు చేసుకోవచ్చు.

గమనిక: ఈ బిన్ ఎండలో ఉంచరాదు.
దీనిలో నీరు పోయరాదు, వానకు తడవ నీయ కుండ చూడాలి.

  1. ఎందుటాకులు, గార్డెన్ లోని రాలిన పచ్చి ఆకులు, ప్రూనింగ్ చేయగా వచ్చిన పచ్చి ఆకులు, పచ్చి కిచెన్ వేస్ట్ తో ఘన రూపంలో మంచి కంపోస్టు తయారీ విధానం:

దాదాపు అందరికీ తెలిసిందే. ఒక బకెట్ లో ఒక లేయర్ మట్టి చల్లి, మరొ లేయర్ పచ్చి ఆకులు, మరొ లేయర్ ఎండుటాకులు వేసి, మరల మట్టి చల్లి, దానిపై OWDC ద్రావణం గాని, ఆవుపేడ నీళ్ళు గాని చల్లాలి.

అలా బకెట్ నిండే వరకూ ఇదే ప్రాసెస్ చేయాలి.

ఫైనల్ గా పై భాగాన్ని మట్టి తో మూసేయాలి.

నెల రోజుల్లో, లేదా రెండు నెలలో కంపోస్ట్ తయారు ఔతుంది.

ఈలోగా దీనిపై ఏదైనా ఆకుకూరలు పండించు కోవచ్చు.

నీరు ఎక్కువగా పోయ రాదు. నీళ్లు చల్ల వచ్చు (స్ప్రే మాత్రమే).

  1. కిచెన్ వేస్ట్ ని ఆరబెట్టి ( ఎండ తగలకుండా) ఘన రూపంలో మంచి కంపోస్ట్ ని త్వరగా తయారు చేసే విధానం:

దాదాపు ఇది కూడా అందరికీ తెలిసిందే. ఒక బకెట్ లో ఒక లేయర్ మట్టి చల్లి, మరో లేయర్ పచ్చి ఆకులు, మరో లేయర్ ఎండుటాకులు వేసి, మరో లేయర్ నీడలో బాగా ఆర బెట్టిన కిచెన్ వేస్ట్ ను వేసి గాని, అలాగే బొకాషి బిన్ నుండి సేకరించిన sludge ని కూడా ఒక లేయర్ గా వేసుకోవచ్చు. దాని పై మరల మట్టి చల్లి, దానిపై OWDC ద్రావణం గాని, ఆవుపేడ నీళ్ళు గాని చల్లాలి.

అలా బకెట్ నిండే వరకూ ఇదే ప్రాసెస్ చేయాలి.

ఫైనల్ గా పై భాగాన్ని మట్టి మట్టి తో మూసేయాలి.

నెల రోజుల్లో, లేదా రెండు నెలలో కంపోస్ట్ తయారు ఔతుంది.

ఈలోగా దీనిపై ఏదైనా ఆకుకూరలు పండించు కోవచ్చు.

నీరు ఎక్కువగా పోయ రాదు. చల్ల వచ్చు (స్ప్రే మాత్రమే).

  1. పూజకు వాడిన, వాడిన పూలు, మనకున్న అవకాశాలను బట్టి మనం సేకరించిన పూలను ఉపయోగించి ద్రవ రూపం లో కంపోస్టు తయారుచేసే విధానం:

ఒక 🛢 డ్రం లో నీరు పోసి దానిలో మనం సేకరించిన పూలను ఉల్లిగడ్డల సంచి లాంటి సంచి లో వేసి, డ్రం లోని నీటిలో మునిగి వుండేలా చూసుకోవాలి.

4 రోజుల పాటు నాన నివ్వాలి . ఆ తరువాత , ఆ నీటిని డైరెక్ట్ గా కాని dilute చేసి గాని మొక్కల కు ఇవ్వ వచ్చు.

“సర్వే జనః సుఖినోభవంతు”

వేంకటేశ్వర రావు ఆళ్ళ, వికారాబాద్.
(City of terrace gardens groups)
—-oOo—-

Shopping Cart