Kaakara padu

కాకరకాయ మొక్క
కాకర (bitter gourd) సంవత్సరం మొత్తం కాలాలలో సంబంధం లేకుండా కాపు వచ్చే హెల్తీ కూరగాయ,ఒక్కసారి వేసుకున్న విత్తనం కొన్ని నెలల,సంవత్సరాలు కాస్తునే వుంటుంది,అదే విత్తనం పడి మళ్లీ తోటలో ఎప్పుడు ఉండే కూరగాయ కాకర పోలినేషన్ అవసరం లేదు, పిందె పండి,పెరగ నపుడు,ఎరువు వేసి గోరు వెచ్చని నీరు ఇచ్చిన పిందె రాలడం,పండటం ప్రాబ్లెమ్ ఉండదూ

చేదుగా ఉంటుంది అని పిల్లలు కొందరు పెద్దలు తినరు, కాకర కాయ లోని పోషకాలు చాలా ఉన్నాయి, కాకర కాయ తరచుగా తీసుకోవడం వల్ల రక్తపోటు, హై బీపీ, అలర్జీలు కి మందుగా పనిచేస్తుంది

డయాబెటిస్ ఉన్నవారు అప్పుడప్పుడు కాకరకాయ తీసుకోవడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది

ఇందులో పోలిక్, పొటాషియం, మెగ్నీషియం, జింక్ పుష్కలంగా ఉంటాయి, జీర్ణశక్తి కూడా మెరుగవుతుంది

 కాకరకాయకి కడుపులో నులిపురుగులు దూరం చేసే గుణం కూడా ఉంది, ఐరన్ ఎక్కువగా ఉండి క్యాలరీలు తక్కువగా ఉంటుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది

అలర్జీలు, స్కిన్ ప్రాబ్లం, సోరియాసిస్ వంటి వ్యాధులను కూడా దూరం చేస్తుంది

కాబట్టి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కాకరకాయను నిర్లక్ష్యం చేయకుండా తగు మోతాదులో ఆహారంలో తీసుకోవడం ఎంతో ఆరోగ్య కరం 🙏

కాకరకాయ మొక్క

👉 కాకర మొక్క ఏ season లో అయినా సులభంగా పెంచుకోవచ్చు, వీటిలో పొడవు కాకర, చిట్టి కాకర, green కాకర, white కాకర ఇలా చాలా రకాల కాకర రకాలు ఉంటాయి

👉 కాకర మొక్క కి మిగతా మొక్కలకి లానే మట్టి, ఏదైనా compost, వేపపిండి, cocopeat / చెక్క పొట్టు ఇలా అన్ని mix చేసి మట్టి మీశ్రమం కలుపుకుని tub/grow bag నింపుకోవాలి, rs.100 tub లో ఒక రెండు కాకర మొక్కలు పెంచుకోవచ్చు

👉 seed పెట్టిన నాలుగు రోజుల్లో మొలక వచ్చేస్తుంది, కాండం కుళ్ళు వచ్చి నారు మొక్క పడిపోకుండా అప్పుడప్పుడు మజ్జిగ ధ్రావణం ఇస్తుండాలి

👉 విత్తనం నుండి మొలక వచ్చిన ఒక వారం రోజుల్లో తీగ రావడం మొదలవుతుంది, ఈ సమయం లో తీగ పాకడానికి ఏదైనా సపోర్ట్ ఇవ్వాలి

👉 కాకర తీగ ని నిలువు గారు పైకి పందిరి లా పాకించాలి అనుకుంటే, తీగ పైకి వెళ్లిన తర్వాత కింద నుండి sides లో వచ్చే తీగల్ని తీసేస్తూ ఉండాలి, అప్పుడే పందిరిపైన వచ్చే కొమ్మలకి బలం సరిపోతుంది, ఆలా కాకుండా vertical గా కాని వేరే చెట్టు కొమ్మలపై పాకించాలి అనుకుంటే side లో వచ్చే తీగలు ఉంచి top లో tips ని cut చేయాలి

👉 కాకర తీగ కి కూడా ఆకు ముడత తెగులు, పెనుబంక, millybugs, పండు ఈగ సమస్యలు బాగా వస్తాయి

👉 కాకర మొక్క కి మొదటగా male flowers బాగా వస్తాయి, ఈ పువ్వలు పసుపు రంగులో ఉండటం వలన pollinators attract అయ్యి garden లోకి రావడం మొదలవుతాయి, ఆలా male flowers పూస్తూ pollinators రావడం మొదలయ్యాక ఒక వారానికి female flowers రావడం మొదలవుతాయి

👉 చాలా మంది కాకర పిందెలు పసుపుపచ్చ గా మారి రాలిపోతున్నాయి అంటుంటారు, pollination సరిగా అవ్వనివి రాలిపోతుంటాయి, మనం గమనించాల్సింది ప్రతి పిందే కూడా కాయ గా మారదు, మొక్క బలాన్ని బట్టి ఆ మొక్క ఎన్ని మోయగలదో అన్నీ కాయలే ఉంటాయి, పిందెలు ఉన్న సమయం లో మొక్కకి నీళ్లు కొంచం తక్కువే ఇస్తుండాలి, నీళ్లు ఎక్కువ అయినా కాని, వాతావరణ పరిస్థితులు వలన కూడా పిందెలు రాలిపోతుంటాయి

👉 మొక్క కి ఏదైనా తెగులు వచ్చిన తర్వాత కాకుండా ప్రతీ వారం, లేదా 10 రోజులకు ఒకసారి వేప నూనె / పుల్లని మజ్జిగ / అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ధ్రావణం ఇలా స్ప్రే చేస్తూ ఉండాలి

👉 మొక్క కి బలానికి అప్పుడప్పుడు పంచగవ్య, ధ్రవజీవామృతం, vermi compost, bonemeal లాంటివి ఇస్తూ ఉండటం వలన మొక్కల్లో రోగనిరోధక శక్తి పెరిగి మొక్క బాగా ఎదుగుతుంది

👉 ఇక పిందెలు రావడం మొదలయ్యి కాయలకు పండు ఈగ సమస్య రాకుండా ఉండటానికి yellow sticky pads కట్టాలి, fruit fly traps కట్టాలి


-SRINIVAS 
CTG – KHAMMAM

Shopping Cart