🌞 ఎండాకాలం మొక్కల రక్షణ 🌞
➡ ప్రతి మొక్కకు కూడా ఆకులపై wax layer అని ఉంటుంది, ఈ wax layer వలన మొక్క లోని నీటి ని, శక్తి ని, enzyms ను ఎండకు ఆవిరి అయిపోకుండా మొక్క తనను తాను కాపాడుకుంటుంది.
➡ ఎప్పుడు అయితే ఎండలు పెరిగి మొక్క ఒత్తిడి కి లోనయ్యి మొక్క ఆకులపై ఉన్న wax layer కరిగిపోతుందో అప్పుడు మొక్కలో photo synthasis జరగడం ఆగిపోతుంది, photo synthasis ఆగిపోతే అప్పుడు మొక్క ఆహారాన్ని తయారు చేసుకోలేక, మొక్క తనని తనే తినడం మొదలు పెడుతుంది, అంటే మొక్కకి మొదలు కాండం దగ్గర మొదటి గా వచ్చిన ఆకుల నుండి శక్తి ని, enzyms, ప్రోటీన్స్ ని తీస్కోడం మొదలు పెడుతుంది, అప్పుడు మొక్క అమోనియా గ్యాస్ ని కూడా విడుదల చేస్తుంటుంది, ఈ గ్యాస్ కి pest attract అయ్యి మొక్కలపై దాడి చేస్తుంటాయి. దీని వల్ల ఆకులు పండుబారిపోతుంటాయి. దీనినే రిఫో సింతసిస్ / photo respiration అంటారు.
➡ అందుకే ఎండాకాలం లో మొక్క ఆకులపై ఉన్న wax layer పోకుండా చూసుకోవాలి, అందుకే మొక్కకు శక్తి ని మనం అందించాలి, wax layer పోకుండా oils ను spray చేస్కుంటూ ఉండాలి, egg emulsion oil, fish amino acid, fruit fermented juices లాంటివి స్ప్రే చేయచ్చు.
-SRINIVAS KONIDANA KHAMMAM CTG
TEAM CTG