how to grow vegetable creeper plants on Roof Tops

మన టెర్రస్ లో పందిరి కూరగాయల పెంపకం వాటి వివరాలు:
పందిరి కూరగాయలు: కాకర, బీర,సొర(అనప), దోస,గుమ్మడి,బూడిద గుమ్మడి,దొండ
వాతావరణం: వేడి వాతావరం అనుకూలం
నేలలు:నీటిని నిలుపుకునే తేలిక పాటి బంక మట్టి నేలలు, ఎర్ర నేలలు అనుకూలం
విత్తే సమయం:
A. కాకర, ఆనప,దోస : జూన్ – జులై చివరివరకు
B. బీర,బూడిద గుమ్మడి: జూన్ – ఆగస్ట్ & డిసెంబర్ – ఫిబ్రవరి
C. గుమ్మడి,పోట్ల: జూన్ – జులై, డిసెంబర్ – జనవరి
D. దొండ : జూన్ – జులై ,చలి తక్కువగా ఉండే కాస్తా ఆంధ్ర లో సంవత్సరం అంత నాటు కోవచ్చు,
విత్తనం & విత్తుకొనే పద్దతి: కుండీలో 2-4 విత్తనాలు విత్తుకోవాలి,1-2 సెంటీమీటర్ల లోతులో నాటుకోవాలి,
విత్తన శుద్ధి: ట్రైకో డేర్మా విరిడి లో విత్తనాలు కలిపి విత్తుకోవాలి,
నీటి యాజాన్యం: విత్తే ముందు మనం కుండి 12 గంటల ముందు మట్టిని తడుపుకొని పెట్టుకోవాలి, విత్తిన 3-4 రోజులకు ఒకసారి నీరు పోయాలి,
సస్య రక్షణ :
పురుగులు: పెంకుపురుగులు,ఆకుపురుగులు,పండు ఈగ ప్రదానం గా వచ్చు పురుగులు,
నివారణ: వేపనూనె స్ప్రే చేసుకోవాలి,
తెగుళ్లు: బూజు తెగులు, వేరుకుల్లు,వెర్రి తెగులు, ఆంత్రాక్స్ (పక్షి కన్ను తెగులు)
నివారణ: ట్రైకోడర్మ విరైడి, జీవామృతం వాడుకోవాలి,
తీగ జాతి కూరగాయలు పెంచుకోవడంలో కొన్ని జాగ్రతలు పాటించి మంచి దిగుబడి పొందడం.
1.మొలక వచ్చాక తీగ పాకే సమయంలో పందిరి లేదా నెట్ మీదకి జాగ్రత్తగా ట్రైన్ చేసుకోవాలి,

  1. పూత సమయంలో Male,Female ఫ్లవర్స్ ని గమనించి హ్యాండ్ పోలినేషన్ చేసుకోవడం వల్ల వెంటనే పంట తీసుకోవచ్చు,
    3.తేనె తీగలు,సీతాకోక చిలుకలు (బట్టర్ ఫ్లై) మన టెర్రస్ లో కనిపిస్తే హ్యాండ్ పొలినేషన్ అవసరం తక్కువగా వుంటుంది
    4.ఎక్కువగా నీళ్లు పోయడం వల్ల వెరుకుల్లు తెగులు వచ్చి చనిపోయే అవకాశం ఉంటుంది కనుక 3-4 రోజులకు ఒకసారి పోయాలి,
    5.ఎక్కువగా నీరు పోయడం వల్ల మన కుండీలో ఉన్న పోషకాలు డ్రైన్ అవుతాయి, Pot లొ ఎంత అవసరమో అంతే నీరు పోయడం వల్ల పోషకాలు పోకుండా కాపాడుకోవచ్చు.

    -D.Lingeswaraiah (CTG-Kurnool)
Shopping Cart