HOW TO GROW PAPAYA PLANT IN A CONTAINER

బొప్పాయి మొక్కను కంటైనర్‌లో ఆరోగ్యంగా పెంచడానికి కొన్ని చిట్కాలు:::::

కంటైనర్ పరిమాణం: కనీసం 20 అంగుళాలు ఉండాలి

పాటింగ్ సాయిల్: గార్డెనింగ్ ఎర్ర మట్టికి + 10% ఆవు ఎరువు + 15% కంపోస్ట్ +5% వేప పొడి + 5% ఇసుక .

నీరు: నీరు ఎప్పటికప్పుడు చూసుకుంటూ మొక్కకు నీరు ఇవ్వాలి. తక్కువ నీరు మొక్కను బలహీనపరుస్తుంది, ఎక్కువ నీరు వల్ల వేర్లు కుళ్ళిపోవడానికి దారితీస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకుని మొక్కకు నీళ్ళు అందివ్వండి

సూర్యకాంతి: బొప్పాయి మొక్క గాలిని తట్టుకోలేదు, మరియూ పూర్తి సూర్యకాంతి అవసరం, అందుకే ఈ మొక్కని ఆగ్నేయ వైపున పెట్టి పెంచండి

అధిక మరియూ ఆరోగ్యకరమైన కాత కోసం: ఆవు పేడ, OWDC ప్రత్యామ్నాయ వారాలు అందించండి, బెల్లం + వేప + ఆవాల పొడి + వేరుశెనగ పొడిని సమాన పరిమాణంలో తీసుకోండి కొన్ని నీటిలో 4 రోజులు పులవానివ్వండి, దీన్ని 1:10 ratio లో మంచి నీటిలో కలుపుకుని మొక్కకి అందివ్వండి. మరుసటి నెల అన్ని మొలకలు పేస్ట్ చేసి సమపాలం లో బెల్లంతో పులవబెట్టి, 1:10 ratio లో మంచి నీటిలో కలుపుకుని మొక్క మొదట్లో ఇవ్వండి.

సాధారణంగా ఫలాలు 7 – 12 నెలల నుండి ప్రారంభమవుతాయి

అనుకూలమైన పరిస్థితులు మరియు మంచి సంరక్షణ తో మొక్క 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పాటు పండ్లు ఇస్తూ ఆరోగ్యంగా ఉంటుంది.

రోగాలు రాకుండా ఉండాలంటే బొప్పాయి దగ్గర టమాట మొక్కలను పెంచకండి.

మగ మొక్కను ఆడగా మార్చడానికి, మగ బొప్పాయి మొక్క వేర్ల దగ్గర ఇనుప మేకును దింపంది.

CTGian
సంరెడ్డి మౌనిక

Shopping Cart