చామంతులు పెంచే విధానం:౼౼౼
◆ చామంతి మొక్కల్ని కుండీల్లోనే కాదు, నేలమీద కూడా సులుభంగా పెంచుకోవచ్చు. అయితే వీటిని నాటేందుకు మరీ పొడిబారిన లేదా మరి ఎక్కువ తేమ లేదా నీరున్న ప్రదేశాన్ని ఎంపిక చేసుకోకూడదు.
◆ఎర్రమట్టి 50% , 30% డీకంపోస్ట్ చేసిన పశువుల ఎరువు 20% వర్మి కంపోస్ట్, కొద్దిగా వేపపిండి, కొద్దిగా Tricoderma viridi వేసి మట్టి మిశ్రమాన్ని తయారుచేసుకొని కుండీల్లో నింపుకోవాలి.
◆ చామంతి మొక్కల్ని నేలలో నాటేటప్పుడు ఒక్కో దానికి మద్య ఆరు అంగుళాల దూరం ఉండేలా చూసుకోవాలి. పెద్ద కుండీల్లో అయితే రెండు మూడు కలిపి నాటుకోవచ్చు. అప్పుడు గుబురుగా అందంగా కనిపిస్తాయి.
◆ చామంతి మొక్కలకు కనీసం మూడు గంటల పాటు నేరుగా ఎండ తగిలే ఉండాలి. అలాగని 28డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే మాత్రం షేడ్ తప్పనిసరి. లేదంటే పాక్షికంగా ఎండ తగిలే చోటకు మార్చుకోవాలి. మొక్కకు గాలి, వెలుతురు ధారాళంగా తగిలే ప్రదేశంలో మొక్కను నాటుకోవాలి. బాగా పూలు పూయాలంటే తగినన్ని పోషకాలు ఎప్పటికప్పుడు అందించాలి.
◆ మొక్క పెరిగే టప్పుడు Npk లేదా పొటాషియం ని మొక్కకి ఇవ్వాలి. మొగ్గలు తొడిగినప్పుడే ఒక spoon చొప్పున bonemeal నూ అందిస్తే పూలు బాగా పూస్తాయి.
◆ ఈ మొక్కకు నీళ్లు మరీ ఎక్కువ అయినప్పుడు కాండం, వేర్లూ కుళ్లిపోవడం వంటి సమస్య వస్తుంది..
◆తెల్లదోమ, పేనుబంక వంటివీ కూడా బాగా వస్తాయి. ఇవి చిగురులు, మొగ్గలకు పట్టుకుంటాయి.
అవి మొక్కలకి attack అవ్వక ముందే ప్రతీ 15 రోజులకి ఒకసారి neem oil spray చేయాలి.
◆ ఆకులపై మచ్చలు వచ్చి ఆకులు dull అవుతాయి. అటువంటి ఆకులను, dry అవుతున్న ఆకులు ఉంటే వాటిని ఎప్పటికప్పుడు తీసేసుకుంటు ఉంటే ఆ place లో కొత్త చిగురులు వస్తాయి.
◆ చామంతి మొగ్గలు రాక ముందు చిగురులు cut చేస్తూ ఉంటే మొక్క గుబురుగా పెరుగుతుంది మొగ్గలు బాగా ఎక్కువగా వస్తాయి.
◆మొగ్గలు start అయ్యాయి అంటే ఇంక మొక్క ఎదగదు. అందుకే మొగ్గలు రాకుండా , ముందుగానే చిగురులు cut చేస్తూ మొక్కని మనకి కావలసినంత వరకు గుబురుగా పెరగనిచ్చి తరువాత మొగ్గలకు వదిలెయ్యాలి. Flowers అయ్యిపోయాక మళ్ళీ stems ని cut చేస్తే plant బాగా growth అవుతుంది.
ఆ cuttings ని ఇసుకలో పెడితే వాటికి roots వచ్చి కొత్త మొక్కలు start అవుతాయి.
సేకరణ : చంద్రకళ CTG