బచ్చలి మొక్కని ఆరోగ్య సిరి వజ్ర అని కూడా అంటారు. బచలి ఆకులు దలసరిగా ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. అందువల్ల మిగిలిన ఆకు కూరల కన్నా బచలి ఆకులకు ఎక్కువ రోజులు నిల్వ వుండే సామర్థ్యం ఉంటుంది
◆ బచలి చాలా రకాలు ఉంటుంది.
●గుబురుగా , పొట్టిగా గా పెరిగేదాన్ని దుబ్బబచలి /మెట్ట బచలి/ మొద్దు బచలి/ మొక్క బచలి అంటారు. వీటిని కాడలతో పాటు కిందకి cut చేసుకోవాలి పాలకూర లాగా.
● తీగలుగా పాకే బచలి ని తీగ బచలి అంటారు. చిన్న ఆకులతో ఉండేదాన్ని చిన్న తీగ బచలి అంటారు. ఈ రకం మొక్క సహజంగా అందరి గార్డెన్ లో ఉంటుంది
● పెద్ద రకం తీగ బచలి. దీని ఆకులు చాలా పెద్దవిగా ఉంటాయి. ఒక ఆకు అరచేయిని మించి పెద్దగా వుంటుంది. కొన్ని ఆకులతోనే ఒక కుటుంబానికి సరిపడా కూర వండుకోవచ్చు.
●ఎర్ర బచలి . దీని కాండం ఎర్రగా ఉంటుంది . ఆకుల చివరలు కూడా ఎర్రగా ఉంటుంది. చూడటానికి చాలా అందం గా వుంటుంది.
కూర వండిన, దీని రుచి చాల బాగుంటుంది. Green కన్నా ఇది కొంచెం రుచి వేరేగా ఉంటుంది. ఎర్రబచలి కాడలతో పులుసు కూడా వండుకుంటారట.
● సిలోన్ బచలి. ఇది షుగరు ఉన్న వాళ్ళకి చాలా మంచిది దీన్ని రోజు మార్చి రోజు వండుకుని తింటే షుగరు controle లో ఉంటుంది. దీనికి flowers వస్తాయి చలా అందంగా ఉంటాయి. ఇంటికి అలంకరణగా కూడా దీన్ని పెంచుకోవచ్చు. దీన్ని దుంప బచలి/ చెట్టు బచలి అని కూడా అంటారు.
◆ బచలి చాలా easy గా గార్డెన్ లో పెంచుకోవచ్చు. విత్తనాలతో, stem cuttings తో పెంచుకోవచ్చు.
●దీనికి 6inch కుండీలో కూడా వేసుకోవచ్చు వెడల్పు ఎక్కువగా ఉంటే ఇంకా బాగా పెరుగుతుంది.
●దీనికి ఎండ 4-5 hrs ఉంటే చాలా healthy గా spead గా పెరుగుతుంది.
●దీనికి ఆకు తినే పురుగులు, రసం పీల్చే పురుగులు వస్తాయి. ఎండ తక్కువ వుండే place లో మొక్కని పెడితే ఈ పురుగులు ఎక్కువగా attack అవుతాయి.
ఇవి రాకుండా వుండలంటే, neem oil ని కానీ, పంచగవ్య ని కానీ 15 రోజులకి ఒకసారి spray చేయాలి
◆విత్తనాలు వేసుకుంటే వాటిని ముందుగా విత్తనశుద్ది చేసుకుంటే మంచిది. ఆవుమూత్రంలో గాని tricoderma viridi లో గాని 30 నిమిషాలు ఉంచి విత్తన శుద్ది అవుతుంది
ఇలా చేసి వేసుకున్న విత్తనాలు చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి. మొక్క పెరుగుతున్న తొలిదశ లోనే ఆకుతినే పురుగులు లాంటివి కొంత వరకు రాకుండా ఉంటాయి.
◆ బచలి మొక్కకిఎక్కువ ఎరువులు అవసరం లేదు.
ఆకుకూరలకి నైట్రోజెన్ ఎక్కువగా ఇవ్వాలి.
అది అన్ని రకాల ఎరువుల లోను సహజంగా ఉంటుంది. 15 రోజులకి ఒకసారి పశువుల ఎరువు గాని,compost గాని ఇస్తే చాలు.
-Chandra kala CTGian