GRAFTED PLANTS/అంటుమొక్కలు
మనకు CTG ప్రతి Meet లో grafted plants (అంటుకట్టిన) మొక్కలైన వంగ, టమోటో, మిరప, కాకర,సొర మొదలైనవి అందిస్తూ వుంటారు.
ఇక్కడ మనం గమనించినట్లైతే, 'గ్రాఫ్టింగ్ స్టాక్' గా అడవి వంగ మొక్కను వినియోగించినట్టు చెబుతున్నారు.
ఈ అడవి వంగ మొక్క వేరు వ్యవస్థ ను పరిశీలిస్తే, ఇది మట్టి లో చాలా లోతుగా పోతుంది. దాదాపు 3' నుండి 4' వరకు లోపలికి చొచ్చుకు పోతుంది తల్లి వేరు. దీనిలో ఎక్కువ భాగం 18" మాత్రమే మట్టిలో వుంటుంది.
అందువల్ల ధృఢమైన కాండం కలిగి, నేలలో దృఢంగా నిలబడ గలుగుతుంది. (Errection)
కాబట్టి ‘దీనితో అంటు కట్టిన మొక్కలు దృఢమైనవి గా నిలబడ గలుగుతాయి.’
(పడిపోవు , వాలిపోవు)
ఇక్కడ మనం టమాటో వేరు వ్యవస్థను గమనిస్తే అంత లోతుకు పోవు. కానీ గ్రాఫ్టింగ్ వల్ల దీని వేరు వ్యవస్థ మారి పోతుంది. అంటే వంగ వేరు వ్యవస్థ నుండి టమోటో అభివృద్ధి చెందుతుంది..
కాబట్టి నీటి ఎద్దడిని, భూమి నుంచి వ్యాపించే వ్యాధుల నుండి తట్టుకో గలవు. చీడ పీడలు కూడా చాలా తక్కువగా ఉంటాయి.
దిగుబడి విషయంలో భూమి/ నేల లో ఐతే, భూసారాన్ని బట్టి, ఇచ్చే fertilizers/ పోషకాలను బట్టి మంచి దిగుబడి వస్తుంది.
కానీ మనది “మిద్దె తోటలపెంపకం”
(Terrace Gardens).
ఇక్కడ మనం వివిధ రకాల, కొలతలు కల్గిన కుండీలను వాడుతాం..
అందులో
- 8″ లోతైన 5 ltrs పెరుగు బకెట్స్.
- 10″ లోతైన 10 ltrs పెయింట్ బకెట్స్.
- 14″ లోతైన 20 ltrs పెయింట్ బకెట్స్
- 16″ లోతైన25 ltrs పెయింట్ బకెట్స్.
- 16″ లోతైన water bubbles
- 18″ లోతైన half cutting చేసిన డ్రమ్స్.
ఇలా రకరకాల size వి మనం ఉపయోగిస్తాం మిద్దె తోటల పెంపకం లో…
ఈ అంటు మొక్కలు ( grafted plants) పెంచడానికి తక్కువలో తక్కువ లోతు అంటే 14″ నుండి 18″ వరకు లోతు కలిగిన కుండీలను వాడవచ్చు.
ఎక్కువ దిగుబడి కొరకు 18″ నుండి 36″ లోతైనవి శ్రేష్ఠం. లేదా నేల / భూమి మీద పెంచడం మంచిది.
మిద్దె తోటల పెంపకం విషయంలోకి వచ్చేసరికి భూమి/ నేల ఉండదు.
దాని స్థానంలో కుండీలో మట్టితో కూడుకున్న తేలికపాటి, బరువు తగ్గే మట్టి మిశ్రమం వస్తోంది.
మట్టిమిశ్రమం: మట్టి, కోకోపీట్, పేరిలైట్, ఇసుక , వర్మి కంపోస్టు/ కిచెన్ వేస్ట్ కంపోస్టు, బొగ్గు, బూడిద, బాగా ఎండిన పశువుల ( దేశీ ఆవులు, మేక, గొర్రెల పెండ) ఎరువులు గా ఉంటాయి. వీటిని బరువులేకుండా ఉండేందుకు వాడుతాము.
మట్టిమిశ్రమం లో చీడ పీడలు రాకుండా సుడోమనాస్, ట్రైకోడర్మావిరిడి, వేప పిండి, బోన్ మీల్ పౌడర్ లాంటివి కలపాలి.
అలాగే మిద్దె తోటలలోని కుండీలలో మొక్కలకు కేవలం నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, సల్ఫర్, క్యాలిషియం, కార్బన్, మెగ్నీషియం లాంటి మాక్రో న్యూట్రియెంట్స్ (Macro nutrients) యే కాక ( Micro nutrients)/ సూక్ష్మ పోషకాలైన బోరాన్, జింక్, మాంగనీస్, ఐరన్, కాపర్, మెరిడియం, క్లోరిన్ లాంటివి కూడా పుష్కలంగా కావాలి. చాలా మంది చెబుతుంటారు..ఏమంటే ఏ మొక్కనైన కేవలం మట్టి, పేడతో పెంచ వచ్చని, దీనికి ప్రత్యేకంగా మెన్యుర్ తయారు చేయాల్సిన అవసరం లేదని అంటారు..
చెప్పడానికి అందరూ చెబుతారు.
కానీ మిద్దె తోట పెంపకం విషయం లో అది వాస్తవం కాదు.
మీరు బాగా గమనిస్తే , మనం చిన్నప్పుడు ప్రతి ఇంటి పెరటిలో ఒక పెద్ద గొయ్యి /గుంట ఉండేది.. దానిలో మన ఇంట్లో పెంచే ఆవులు, గేదలు, మేకలు, గొర్రెలు, కోళ్లు, విసర్జించిన పేడ, అవి తొక్కి పాడు చేసిన మేత , మనం వంటకు వాడే కట్టెల పొయ్య నుండి వచ్చిన బూడిద, బొగ్గు, వాకిట్లోను, ఇంట్లోను వూడ్చిన చెత్త అంతా ఆ గుంతలోనే వేసేవారము.
అవి దాదాపు ఒక సంవత్సరం పాటు ఆ గుంతలో మగ్గుతాయి..( అప్పుడు తయారయ్యేది సహజ సిద్ధమైన ఎరువు. అందులో తయారయ్యే మాక్రో &మైక్రో న్యూట్రియంట్స్ తో సహజ సిద్ధమైన ఎరువు తయారు అయ్యేది)
దీన్ని మన వాళ్ళు పొలం లో చల్లి దుక్కి దున్నే వారు..తరవాత నీరు నింపి దమ్ము (AP) / ‘కరగడి’ (Telangana) చేసేవారు. అప్పుడు అది సారవంతమైన భూమి గా మారేది.. అప్పుడు వరి నారు కి కావాల్సిన విధంగా భూమి సిద్ధమైయేది.
అది అప్పటి పరిస్తితి.
అదేవిధంగా
వయస్సుకు తగిన విధంగా పిల్లలకు సరియైన సమయానికి సరైన పోషకాలు ఇవ్వకపోతే, ఎదుగుదల ఆగిపోయి గిడస బారి పోతారు. అదే విధంగా మొక్కల విషయం కూడా…
…..ప్రయత్నించి చూడండి….
ఇది సారవంతం మైన భూమి లో మాత్రమే సాధ్యం కావచ్చు.. కాని మిద్దె తోటల పెంపకం విషయంలో అలా కాదు…
గమనిక: మిరప, టమోటో, కాకర,సొర అంటు కట్టని వాటి వేరు వ్యవస్థను పరిశీలిస్తే, అవి ఎక్కువ లోతు వరకు చొచ్చుకు పోవు..దాని stem కూడా అంత దృఢంగా ఉండదు . అంటుకట్టిన grafting చేసిన మొక్కల stem అడవి వంగ కాబట్టి దానితో అంటు కట్టబడిన మొక్క బలంగా నిలబడుతుంది. దీని వేరు వ్యవస్థ చాలా లోతుకు విస్తరిస్తుంది
మన జీవ వ్యవస్థ లో….
పుట్టిన బిడ్డకు 5, 6 సంవత్సరాలు దాటే వరకు బాలారిష్టాలు తప్పవు. అది దాటిన తరువాత నుండి ఎదుగుదల మొదలౌతుంది. అప్పుడా బిడ్డకి 16/18 సంవత్సరాల వరకు పౌష్టికాహారాన్ని అందించాలి..అప్పుడే మాంచి ఆరోగ్యంగా, దృఢంగా పెరుగుతారు .
అదే విధంగా…
“కేవలం మట్టి, పేడ తోనే పుష్కలంగా దిగుబడి రావాలి అంటే మిద్దె తోటల పెంపకం లో అది సాధ్యమైయ్యే విషయం కాదు.”
ఉదాహణకు వర్షాకాలం కుండీలలో నీళ్ళు ఎక్కువై బయటికి వస్తాయి.. దానితో పాటు అన్నిరకాల పోషకాలు బయటికి పోతాయి. మొక్కకి కావల్సిన పోషకాలు అందకపోతే ఎదుగుదల ఉండదు.. దిగుబడి ఉండదు..
కాబట్టి ఏ సమయానికి మొక్కలకు ఏమేమి పోషకాలు అందించాలో గుర్తెరిగి అందించాలి. ఏ సమయంలో సస్య రక్షణ చర్యలు తీసుకోవాలో అప్పుడే చెయ్యాలి.
ఇది జంతు, వృక్ష, జీవ జీవన వ్యవస్థలో నిరంతరం కొనసాగే ప్రక్రియగా భావించాలి.
అలాగే మాక్రో న్యూట్రియెంట్స్ & మైక్రో న్యూట్రియెంట్స్ గురించి ఇంతకు ముందు మనం చర్చించుకున్నాము.
అవి మనం మిద్దె తోట లో ఉపయోగించే ఏ ఏ పదార్ధాలలో లభ్య మవుతాయో కూడాచర్చించుకున్నాం.
కాబట్టి మీరు దీన్ని పూర్తిగా అవగాహన చేసుకొని……….
- కుండీ size విషయం లోను
- Pot mixing విషయంలోను
- మీరు ఇచ్చే పోషకాల విషయంలోను
- మీరు తీసుకునే సస్య రక్షణ చర్యలు
పై విషయాలలో తగిన విధంగా ముందుకు పోవాలని ఆకాంక్ష… పిల్లల్ని పెంచినట్లే, మన grafted/ non grafted మొక్కలను పెంచుదాం… భారీ దిగుబడి సాధిద్దాం.
మన గ్రూప్ నుండి మేధావులు, విద్యావంతులు, అనుభవజ్ఞులు చెప్పిన సలహాలు సూచనలు పాటిద్దాం.
అందర్నీ కలుపుకొని, విషయాలు తెలుసుకుని ముందుకు సాగుదాం.. అందరినీ గౌరవిద్దాం, గౌరవింప బడుదాం.
“సర్వే జనః సుఖినోభవంతు”
🌹🌹🌹🌹🌹🌿🌿🌿🌿🌿
వేంకటేశ్వర రావు ఆళ్ళ, వికారాబాద్.
(City of terrace gardens groups) 8&9