టొమాటో పంట మన టెర్రస్ లో ఎలా పెంచుకోవాలి అనే విషయాలు తెలుసుకుందాం:
వాతావరణం విత్తనం విట్టేసమయం: వర్షా కాలం పంట కోసం జూన్ – జులై,శీతాకాలం పంట కోసం అక్టోబర్ – నవంబర్, వేసవి కాలం పంట కోసం జనవరి – ఫిబ్రవరి ల లొ నారు పెంచుకోవాలి.
1.టొమోటో పంటను సంవత్సరం పొడవునా అన్ని నెలలో పెంచుకోవచ్చు,అధిక దిగుబడి కి శీతాకాలం అనుకూలం, అధిక వేడిమి తట్టుకోలేదు,ఎక్కువ వర్షపాతం తట్టుకోలేదు,
నారు పెంచుకొనుటకు : 30- 35 రోజుల నారును నాటుకోవాలి Pot / నేల మీద కానీ నాటుకోవాలి,
నేలలు (Soils) : నీరు ఇంకే నేలలు,ఎర్ర నేలలు, సారవంతమైన నేలలు అనుకూలం,
Soil Mixer: (30 :30:20:30=100 %) ప్రకారం అంటే రెడ్ సాయిల్ 30+పశువుల ఎరువు 30 + వేప చెక్క 20 + వెర్మికాంపొస్ట్ 20, kgs లో కలుపుకోవాలి,
రకాలు: నాటు రకాలు, హైబ్రిడ్ రకాలు చాలా వచ్చాయి,,
నాటే దూరం: 1. వర్షాకాలంలో మొక్క మొక్కకి మధ్య దూరం 60 Cm x 45 Cm,
- శీతాకాలం లో మొక్క మొక్కకి మధ్య దూరం 60 Cm x 60 Cm,
3.వేసవి కాలంలో మొక్కకి మొక్కకి మధ్య దూరం 45 Cm x 30 Cm
నాటు రకాలు పంట కాలం : 110 – 120 రోజులు ఉంటాయి, దిగుబడికుడా సుమారు ఒక చెట్టుకు 6-8kg ల వరకు వస్తాయి,
హైబ్రిడ్ రకాలు: 120-140 రోజులు ఉంటాయి,దిగుబడి కూడా సుమారు ఒక చెట్టుకు 12-16kg ల వరకు వస్తుంది,నీటి యాజమాన్యం,: నాటే ముందు నాటిన వెంటనే నీరు పోయాలి, తర్వాత మన Pot లొ తేమ శాతం బట్టి 3-4 రోజులకు ఒకసారి నీరు పోయాలి, Pot లొ డ్రైనేజ్ హోల్స్ కచ్చితంగా పెట్టుకోవాలి, టొమోటో పంట లో వేరు కుళ్ళు రాకుండా ఉంటుంది,
సస్య రక్షణ:
పురుగులు: - కాయతోలుచు పురుగు: ఇది నాటిన 30-40 రోజుల నుండి ఆశిస్తుంది, మొక్క పెరుగుదలలో మోవ్వు ను , తర్వాత దశ లో కాయలను తొలిచి నష్టాన్ని కలుగచేస్తాయి,కాయలు వంకర్లు తిరిగి పోతాయి, చిగుర్లు ఆగిపోతాయి,
2.పచ్చ దోమ : ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చడం వల్ల ఆకులు పసుపు పచ్చగా మారుతాయి,చివరకు ఆకులు ఎర్రగా మారి ముడుచుకొని దొనెలు మాదిరిగా కనిపిస్తాయి,
3.రబ్బరు పురుగు : ఈ పురుగు కాయ తొలుచు పురుగు లాగా పంటను నాశనము చేస్తుంది,విషపు ఎరలు పెట్టుకోవాలి,
తెగుళ్లు:
1.ఆకు మాడు తెగులు, ఎర్లీ బ్లైటే: ఇది నాటిన 30 రోజుల తర్వాత వస్తుంది,ఆకులు అన్ని మాడిపోయినట్లు కనిపిస్తాయి,ఈ తెగులు ఆశించిన ఆకుల పైన గోధుమ రంగు మచ్చలు ఏర్పడుతాయి,తెగులు ఎక్కువగా అయితే ఆకులు రాలిపోతాయి,తెగులు సోకిన కాయలు పసుపు రంగుకు మారి కుల్లిపోతాయి, - వడలు తెగులు(బ్యాక్టీరియల్ విల్ట్) : ఈ తెగులు ఆశిస్తే మొక్క అడుగు భాగంలోని ఆకులు పసుపు రంగుకు మారి, తోడిమ తో సహా రాలి, తర్వాత మొక్క చనిపోతుంది,
- ఆకుముడత వైరస్: ఆకులు చిన్నగా మారి ముడుచుకోపోతాయి,మొక్క ఎదుగుదల తగ్గి పుతా, కాతా బాగా తగ్గిపోతుంది, ఇది తెల్ల దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది,
- టొమోటో స్పాట్ విల్ట్ వైరస్: టొమోటో చిగూరు ఆకుల పై బాగం లో ఈనెలు గోధుమ వర్ణం కు మారి,ఆకుల మీద పసుపు మచ్చలు ఏర్పడి, మాడిపోతాయి,మొక్కలు గిదశబారి,పూత, పిందె పట్టక ఎండిపోతాయి,దీని నివారణకు వ్యాధి సోకిన మొక్కలు పికి వేయాలి ,
టొమోటో పంటలో సమగ్ర సస్యరక్షణ చర్యలు తీసుకోవడం వల్ల పై సమస్యల నుండి మన టెర్రస్ లో ఉండే వంగ మొక్కలను కాపాడుకోవచ్చు:
a. వేప పిండిని సాయిల్ మిక్సర్ లో కచ్చితంగా వాడుకోవాలి, వేప నూనె నాటిన 30 రోజుల తర్వాత నుండి వేప నూనే స్ప్రే చేసుకోవాలి,
b. ట్రికోడర్మ విరిడి మొక్కల Pot లొ డ్రెంచింగ్ చేసుకోవాలి ,
c. సజ్జ విత్తనాలు వేసుకోవాలి కుండి లో
d. జిగురు అట్టలు,బట్టలు 2-4 వరకు మన టెర్రస్ లో పెట్టుకోవడం,
e. పురుగు,తెగుళ్లు ఆశించిన చిగుర్లు,కాయలు త్రుంచి దూరంగా పడేయడం ,
పైన తెలిపిన పద్దతిలో మన టెర్రస్ లో టొమోటో మొక్కలను ఆరోగ్యం గా పెంచుకోవచ్చు.
Courtesy: D. Lingeswaraiah (CTG-KURNOOL)