CTG is procuring Bio Fungicides, Pest Oil, OWDC, VAM, Epsom Salt, Processed Meal and many other essential items for its members.
ఈరోజు మొక్కలకి అవసరం అయిన జీవన ఎరువుల గురించి తెలుసుకుందాము
TRICHODERMA:-
ట్రైకోడర్మా అనేది బూజు జాతికి చెందిన శిలింద్ర నాశిని, ఇది మొక్కల్లో శిలింద్రపు తెగుళ్ళు, ఎండు తెగుళ్లు, వేరు కుళ్ళు ను సమర్ధవంతం గా అరికడుతుంది.
కొత్తగా విత్తనాలు, దుంపలు నాటుకునే ముందు ట్రైకోడర్మా నీటిలో ముంచి నాటుకుంటే మంచిది, ట్రైకోడర్మా నీ soil mix కలుపుకునేటపుడు 1kg soil కి 5 నుండి 10gms కలుపుకోవాలి, మొక్క వాడిపోయి చనిపోయే స్థితి కి వెళ్తుంది అనుకున్నప్పుడు కొంచం ట్రైకోడర్మా నీ నీటిలో కలిపి మొక్క మొదట్లో పోయాలి.
PSUDOMONAS
Psudomonas అనేది ఒక fungicide, insecticide, growth and yield promotor, ఇదొక benificial బాక్టీరియా.
Psudomonas కూడా soil mix లో ప్రతి 1kg soil కి 5 to 10gms కలుపుకోవాలి, మొక్కలు ఎదుగుదల కి, మంచి దిగుబడి కి ఇది చాలా ఉపయోగం.
VAM
Soil mix లో VAM ని కలపడం వలన మొక్కల వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెందుతుంది, మొక్క ఎదుగుదల బాగుంటుంది
NPK
మొక్కల పెరుగుదల మరియు అభివృద్ధి ని మెరుగుపరుస్తుంది. మొక్కలలో శక్తి ని పెంచుతుంది. పండ్లు, కూరగాయలు ఉత్పత్తి పెంచుతుంది, మొక్కల్లో కొమ్మల సంఖ్య పెరుగుతుంది, పువ్వులు బాగా వస్థాయి.
METARHIZIUM
దీన్ని king of bio pesticide అనచ్చు, ఇది మొక్కలని ఆశించే మూడు వందల రకాల తెగుళ్ళు, వ్యాధులు, పురుగుల ని నివారిస్తుంది. 10 gms Metarhizium ని ఒక kg పశువుల ఎరువు, 250 gms వేప పిండి కలిపి 7 రోజలు పాటు నీళ్లు కలిపి గొనె బస్తా కప్పి ఉంచి 10 రోజుల తర్వాత మొక్కల కుండీలలో ఇస్తే ఈ ఫంగస్ pest ల పై ఆశించి సమూలం గా నివారిస్తుంది. 10gms Metarhizium ని 1 లీటర్ నీళ్లలో కలిపి మొక్కల మొదట్లో ఇవ్వచ్చు లేదా spray చేయచ్చు.
BAVARIA BASSIANA
ఇదొక జీవ శిలింద్ర నాశిని, దీన్ని అన్ని రకాల పువ్వులు, కూరగాయలు, పళ్ళ మొక్కలకు, ఇండోర్ ప్లాంట్స్ కి ఇవ్వచ్చు. లీటర్ నీటిలో 5-7gms దీన్ని కలిపి మొక్కల కు స్ప్రే చేయచ్చు.
BONE MEAL
దీన్ని కూరగాయలు, పళ్ళ మొక్కలకు వాడుకోవచ్చు, అధిక దిగుబడి వస్తుంది, కూరగాయలు పళ్ళ పరిమాణం బాగుంటుంది.
EPSOM SALT
Epsom salt మొక్కలకి వాడటం వలన మొక్కల ఆకుల్లో clorofil బాగా పెరుగుతుంది, దీనివల్ల కిరణజన్య సంయోగ క్రియ బాగా జరుగుతుంది, మొక్కల్లో రోగనిరొదక శక్తి పెరుగుతుంది, మొక్కల్ని replant చేసేటప్పుడు epsom salt వాడితే మొక్క transplantation shock నుండి త్వరగా కోలుకుంటుంది.
OWDC
Original waste decomposer దీనిలో మొక్కకి అవసరమైన 80 రకాల బాక్టీరియా ఉంటుంది,100 లీటర్ నీటిలో ఈ owdc bottle లోని లిక్విడ్ అంతా కలిపి ఒక kg బెల్లం వేసి ఒక 5 నుండి 7 రోజుల వరకు ప్రతి రోజు కలుపుతూ ఉండాలి, ఆ తర్వాత 1:5 ratio లో నీళ్లు కలిపి మొక్కలకి ఇవ్వచ్చు, 1:10 ratio లో కలిపి మొక్కల కి spray చేయచ్చు.. ఇది pesticide గా fungicide గా fertilizer గా పని చేస్తుంది, మట్టి గట్టి పడకుండా గుల్ల గా ఉంచుతుంది.
NEEM POWDER
వేపపిండి మట్టి మీశ్రమం లో కలపడం వలన వేరు పురుగుల నుండి మొక్కల్ని రక్షించుకోవచ్చు, వేప పిండి లో npk ఉంటుంది, ఇది మొక్కల ఎందుగుదల బావుండేలా చూస్తుంది.
EMULSIFIED
NEEM OIL
EMULSIFIED Neem oil మొక్కలు పెంచే ప్రతి ఒక్కరి దగ్గర ఉండవలసిన వాటిలో ప్రధానమైనది.. సోప్ వాటర్ add చెయ్యాల్సిన అవసరం లేదు..వెంటనే వాటర్ లో కలిసి పోతుంది. Emulsified
neem oil ని ప్రతి 15 రోజులకి ఒకసారి ఒక లీటర్ నీటికి కి 5ml కలిపి అన్ని రకాల మొక్కలకి spray చేస్తూ ఉండటం వలన చాలా వరకు తెగుళ్లు వ్యాధుల నుండి మొక్కలను రక్షించుకోవచ్చు*
SEAWEED GRANULES
మొక్కలకి ఇదొక పోషకాల గని, ఇది వాడటం వలన మొక్కల కి తక్షణ శక్తీ లభిస్తుంది, మొక్కలు వివిధ రకాల ఒత్తిడులకి గురికాకుండా రక్షిస్తుంది, మొక్కల ఎదుగుదల బాగుంటుంది. Soil ph స్థాయిలని మొక్కకు అనుగుణంగా ఉంచుతుంది.
TEAM CTG