🪴 మన CTG ఈసారి మనకి ఇచ్చిన బయో ఫర్టిలైజర్ లోని అల్ మిక్స్ కేక్ ఫర్టిలైజర్ లో ఉన్న ఆయిల్ కేక్స్ వివరాలు🪴
- ఆముదం చెక్క
- విప్ప చెక్క
- సీతాఫలం చెక్క
- కానుగ చెక్క
- వేరుశనగ చెక్క
- ఆముదం చెక్క
- ఆముదం చెక్క
➡ ఈ ఆముదం చెక్క మట్టి లో బలాన్ని పెంచి మొక్కలు బాగా పెరిగేలా చేస్తుంది, ఇది అన్నీ రకాల నేలలలోనూ వాడుకోవచ్చు.
👉 ఆముదం చెక్క మట్టి లో కర్బన పెంచి మట్టి గుల్లగా ఉండేలా చేస్తుంది
👉 మట్టి లోని PH లెవెల్ సమాన స్థితి లో ఉంచుతుంది.
👉 ఆముదం చెక్క మట్టి ని గుల్లగా ఉండేలా చేస్తుంది కనుక మట్టిలోపలి వరకు గాలి ప్రసరణ బావుంటుంది, మొక్కకు నీళ్లు ఇచ్చినప్పుడు ఆ తేమ ని ఎక్కువ సమయం ఆపి ఉంచుతుంది, నెమటోడ్స్, చెదలు రాకుండా చూస్తుంది.
👉మొక్కలో రోగ నిరోధక శక్తి పెంచుతుంది, మొక్క ఎదుగుదలకి అవసరం అయిన స్తూల సూక్ష్మ పోషకాలు ఈ ఆముదం చెక్క లో ఉంటాయి. దీని వలన మొక్కలు అధిక దిగుబడిని ఇస్తాయి.
- విప్ప చెక్క
➡ విప్ప చెక్కలో మొక్కలకు అవసరం అయిన నైట్రోజన్, ఫాస్పరస్, పొటాషియం ఉంటాయి, విప్ప చెక్క మొక్కకు ఇచ్చినప్పుడు మట్టిలో కర్బన పదార్ధం పెరిగి మొక్కల్లో రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది, దీని వలన మొక్కలు చీడ పీడలను, వ్యాధులు, తెగుళ్ళను సమర్ధవంతం గా తట్టుకుని పెరుగుతాయి అధిక దిగుబడి ని ఇస్తాయి.
- సీతాఫలం చెక్క
➡ సీతాఫలం చెక్క లో మొక్కలని ఆశించే చీడ పీడలను అరికట్టె గుణం ఎక్కువగా ఉంటుంది. పెనుబంక, చెదలు, మిల్లిబగ్స్ ను నివారిస్తుంది, కూరగాయలలో విత్తనాల వృద్ధి కి తోడ్పడుతుంది.
👉 సీతాఫలం చెక్కలో నైట్రోజన్, ఫాస్పరస్, పోటాషియం ఉంటాయి,
👉 సీతాఫలం చెక్కని నేరుగా మొక్కల మొదట్లోని మట్టిలో కలపవచ్చు లేదా నీటిలో నాన పెట్టి మొక్కలకి స్ప్రే చేయచ్చు.
- కానుగ చెక్క
➡ కానుగ చెక్క లో నైట్రోజన్ ఉంటుంది, ఇది మట్టిలో కర్బన పెంచి మట్టి లో జీవం ఉండేలా చూస్తుంది, మొక్కల్లో ఫంగస్, తెగుళ్ళు, వేరు కుళ్ళు రాకుండా చూస్తుంది,
👉 మట్టిలో మొక్కకి అవసరం అయిన బాక్టీరియా పెరిగేలా చేస్తుంది, దాని వల్ల మొక్కలు అధిక దిగుబడి ఇవ్వడం లో దోహదపడుతుంది.
- వేరుశనగ చెక్క,
➡ వేరుశెనగ చెక్క మొక్కలు ఆరోగ్యం గా పెరిగేలా చేస్తుంది, మొక్కల ఆకుల్లో మంచి నీగారింపు, పెద్ద పరిమాణం లో పువ్వులు వచ్చేలా చూస్తుంది,
👉 వేరుశనగ చెక్క ఇవ్వడం వలన మట్టిలో మంచి బాక్టీరియా పెరిగి మొక్కల్లో పూత, కాత అధికంగా వస్తుంది.
- ఆవ చెక్క
➡ ఆవ చెక్క పూల మొక్కల్లో వాడటం వలన పువ్వులు బాగా పూస్తాయి, కూరగాయల మొక్కల్లో ఇచ్చినప్పుడు అధిక దిగుబడి వస్తుంది.
👉 ఆవ చెక్కలో ఉండే గ్లూకోసినోలెట్స్ మొక్కలకి హాని చేయని కొన్ని రకాల టాక్సిన్స్ ని ఉత్పత్తి చేస్తుంది, దీని వలన నెమటోడ్స్, తెగుళ్ళు మొక్కలకు రావు.
👉 ఆవ చెక్క ఇవ్వడం వలన మట్టిలో రసాయన మందులు వాడినప్పుడు దాని ప్రభావాన్ని తగ్గించి మట్టిలో కర్బన పధార్ధాన్ని పెంచుతుంది. మొక్కకు అవసరం అయిన అన్నీ రకాల పోషకాల్ని అందిస్తుంది.
➡ అల్ మిక్స్ కేక్ ఫర్టిలైజర్ ని మొక్కలకి ఇచ్చే విధానం
👉 కొన్ని గంటలు నీటిలో నాన పెట్టి ఆ తర్వాత ఈ నీటిని మరి కొన్ని నీళ్లలో డైల్యూషన్ చేసి మొక్కలకు ఇవ్వచ్చు
👉 మట్టి మీశ్రమాన్ని తయారు చేస్కుంటున్నప్పుడు నేరుగా దానిలో కలపవచ్చు
👉 కుండీలో కాని నేలలో ఉన్న మొక్కల మొదట్లో పాదులా చేసి నేరుగా ఇవ్వచ్చు
👉నీటిలో నానపెట్టి వడకట్టి మొక్కలకి స్ప్రే చేయచ్చు.
THANK YOU
TEAM CTG