Charged Biochar- Benefits

క్లుప్తంగా ఉపయోగాలు:

1. మనం మొక్కలకి వేసే ఎరువులు ఎక్కడా వృధా కాకుండా పూర్తిగా మొక్కల వేళ్ళకి అందించబడతాయి.

2. పదే పదే ఎరువులు వేయవలసిన అవసరం తగ్గుతుంది. దీనితో మనకి input cost తగ్గుతుంది.

3. Watering frequency కూడా తగ్గుతుంది. ఇదివరకటి అంత water ఇవ్వనవసరం లేదు.

4. వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెందుతుంది. దీని మూలాన మొక్క ఆరోగ్యంగా వుంటుంది.

5. Yield 150 percent దాకా వస్తుంది. Yield క్వాలిటీ కూడా బాగా పెరుగుతుంది.

6. Soil fertile గా మారుతుంది.

7. మనం periodical గా ఇచ్చే fertilisers తో బొగ్గు మళ్ళీ మళ్ళీ ఛార్జ్ అవుతూ వుంటుంది. ఎరువుల వేస్టేజ్ వుండదు.

8. బొగ్గులు soil లో వందల సంవత్సరాలయినా అలాగే వుంటాయి. నీటిలో కరగవు. ఏ పురుగులూ వాటి జోలికి పోవు.

9.ఇది కార్బన్ డయాక్సైడ్, Nitrous Oxide వంటి కలుషిత మైన gases ని పట్టుకుంటుంది. మీ గార్డెన్ లో అసలు Foul smell అనే మాట వుండదు. ఇది Terrace Gardeners మరియు బాల్కనీ Gardeners కి ఒక వరం లాంటిది.

10. మొక్క ఆరోగ్యం గా వుండటం వల్ల immunity పెరిగి పురుగుల, తెగుళ్ల  ప్రభావం తగ్గుతుంది.

11. ఇది కలిపిన Soil Mix తేలికగా వుంటుంది. Grow bags తేలికగా వుంటాయి. Soil గుల్ల గుల్ల గా వుండటం వల్ల మైక్రోబియల్ యాక్టివిటీస్ బాగా జరిగి మొక్కలు ఆరోగ్యంగా వుంటాయి.

By Venugopal, A Member of CTG Family

Grow & Eat Organic Vegetables &  Be Healthy

Shopping Cart