Brinjal cultivation on Roof Tops

వంగ పంట మన టెర్రస్ లో ఎలా పెంచుకోవాలి అనే విషయాలు తెలుసుకుందాం:
నారు పెంచుకోవడానికి విత్తనం విట్టేసమయం: వర్షా కాలం పంట కోసం జూన్ – జులై,శీతాకాలం పంట కోసం అక్టోబర్ – నవంబర్, వేసవి కాలం పంట కోసం జనవరి – ఫిబ్రవరి ల లొ నారు పెంచుకోవాలి.
నారు పెంచుకొనుటకు : 30- 35 రోజుల నారును నాటుకోవాలి Pot / నేల మీద కానీ నాటుకోవాలి,
నేలలు (Soils) : నీరు ఇంకే నేలలు,ఎర్ర నేలలు, సారవంతమైన నేలలు అనుకూలం,
Soil Mixer: (30 :30:20:30=100 %) ప్రకారం అంటే రెడ్ సాయిల్ 30+పశువుల ఎరువు 30 + వేప చెక్క 20 + వెర్మికాంపొస్ట్ 20, kgs లో కలుపుకోవాలి,
రకాలు: నాటు రకాలు, హైబ్రిడ్ రకాలు చాలా వచ్చాయి,నాటు రకమైన కొన్ని పోలురు వంకాయ బాగా ఉంటుంది,
నాటే దూరం:1. నీటరుగా పెరిగే రకాల మొక్క మొక్కకి మధ్య దూరం 60 Cm x 60 Cm,
2. గుబురుగా పెరిగే రకాల మొక్క మొక్కకి మధ్య దూరం 75 Cm x 50 Cm,
నాటు రకాలు పంట కాలం : 130 – 140 రోజులు ఉంటాయి, దిగుబడికుడా సుమారు ఒక చెట్టుకు 6-8kg ల వరకు వస్తాయి,
హైబ్రిడ్ రకాలు: 140-160 రోజులు ఉంటాయి,దిగుబడి కూడా సుమారు ఒక చెట్టుకు 12-16kg ల వరకు వస్తుంది,
నీటి యాజమాన్యం,: నాటే ముందు నాటిన వెంటనే నీరు పోయాలి, తర్వాత మన Pot లొ తేమ శాతం బట్టి 3-4 రోజులకు ఒకసారి నీరు పోయాలి, Pot లొ డ్రైనేజ్ హోల్స్ కచ్చితంగా పెట్టుకోవాలి, వంగ పంట లో వేరు కుళ్ళు రాకుండా ఉంటుంది,
సస్య రక్షణ:
పురుగులు:
1.మొవ్వు మరియు కాయతోలుచు పురుగు: ఇది నాటిన 30-40 రోజుల నుండి ఆశిస్తుంది, మొక్క పెరుగుదలలో మోవ్వు ను , తర్వాత దశ లో కాయలను తొలిచి నష్టాన్ని కలుగచేస్తాయి,కాయలు వంకర్లు తిరిగి పోతాయి, చిగుర్లు ఆగిపోతాయి,
రసం పీల్చే పురుగులు:
2.దీపపు పురుగులు, పేను బంక, తెల్ల దోమ:ఆకుల అడుగు భాగం లో చేరి రసాన్ని పిల్చడం వల్ల ఆకులు పసుపు రంగుకు మారి పైకి ముడుచుకొని ఎండి పోతాయి,
3.ఎర్ర నల్లి: ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చడం వల్ల ఆకులు పాలిపోయి తెల్లగా మారుతాయి,ఆకుల మీద సాలే గుడు తీగలు తెల్లగా కనిపిస్తాయి,
4.నులి పురుగులు (రూట్ నాట్ నెమటోడ్) : ఈ పురుగు చెట్టు వేర్ల మీద బొడిపెలాల కనిపిస్తాయి, ఇవి ఆశించిన మొక్కలు తక్కువగా పెరిగి తక్కువ కాయలను ఇస్తుంది,
తెగుళ్లు:
1.ఆకు మాడు తెగులు,కాయ కుళ్ళు తెగులు: ఇది నాటిన 30 రోజుల తర్వాత వస్తుంది,ఆకులు అన్ని మాడిపోయినట్లు కనిపిస్తాయి,ఈ తెగులు ఆశించిన ఆకుల పైన గోధుమ రంగు మచ్చలు ఏర్పడుతాయి,తెగులు ఎక్కువగా అయితే ఆకులు రాలిపోతాయి,తెగులు సోకిన కాయలు పసుపు రంగుకు మారి కుల్లిపోతాయి,
2.వెర్రి తెగులు(లిటిల్ లీఫ్): ఆకులు సన్నగా మారి పాలిపోయి ఆకు పచ్చని రంగు కలిగి ఉంటాయి,మొక్కలు గుబురుగా చీపురు కట్ట లా కనబడుతాయి,పూత కతా లేకుండా గొడ్డు బారి పోతాయి, ఇది వైరస్ తెగులు దోమల ద్వారా వ్యాపించే అవకాశం ఉంటుంది,

  1. ఎండు తెగులు(బ్యాక్టీరియల్ విల్ట్) : ఈ తెగులు ఆశిస్తే సరైన నివారణ చర్యలు లేవు,
    వంగ పంటలో సమగ్ర సస్యరక్షణ చర్యలు తీసుకోవడం వల్ల పై సమస్యల నుండి మన టెర్రస్ లో ఉండే వంగ మొక్కలను కాపాడుకోవచ్చు:
    a. వేప పిండిని సాయిల్ మిక్సర్ లో కచ్చితంగా వాడుకోవాలి, వేప నూనె నాటిన 30 రోజుల తర్వాత నుండి వేప నూనే స్ప్రే చేసుకోవాలి,
    b. ట్రికోడర్మ విరిడి మొక్కల Pot లొ డ్రెంచింగ్ చేసుకోవాలి ,
    c. Pot లొ బంతి ,ఉల్లి మొక్కలు నాటుకోడం,
    d. జిగురు అట్టలు,బట్టలు 2-4 వరకు మన టెర్రస్ లో పెట్టుకోవడం,
    e. పురుగు,తెగుళ్లు ఆశించిన చిగుర్లు,కాయలు త్రుంచి దూరంగా పడేయడం ,
    పైన తెలిపిన పద్దతిలో మన టెర్రస్ లో వంగ మొక్కలను ఆరోగ్యం గా పెంచుకోవచ్చు.

    ===D. Lingeswaraiah (CTG-KURNOOL)
Shopping Cart