నల్ల అల్లం 🫚
🫚 మాములు అల్లం మాదిరిగానే నల్ల అల్లం కూడా మన పూర్వ కాలం నుండి వస్తున్న పంటనే
🫚 నల్ల అల్లం ని ఎక్కువ గా ఆయుర్వేద ఔషదాల తయారీ లో, మూలికా వైద్యం లో, సంప్రదాయ వంటలలో వాడతారు
🫚 నల్ల అల్లం దుంపలను ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు నాటుకోవచ్చు, దుంపజాతి కనుక లోతు కొంచం తక్కువ వెడల్పు ఎక్కువ ఉన్న కుండీలలో నాటుకోవచ్చు, మట్టి మీశ్రమం లో ఇసుక శాతం ఎక్కువ ఉండేలా చూసుకోవాలి, నీళ్లు తక్కువ గా ఇస్తూ ఉండాలి, నెల కి ఒకసారి ఘన, ధ్రవ ఎరువులు ఇవ్వచ్చు
🫚 నల్ల అల్లం దుంప లోపలి భాగం dark maroon color లో ఉంటుంది, నల్ల అల్లం ని ఎండబెట్టి పొడి చేసి వంటల్లో వాడుకోవచ్చు, లేదా నల్ల అల్లం పొడిలో కొంచం తేనె కలిపి చిన్న ఉండల్లా చేస్కుని రోజుకి ఒక నల్ల అల్లం ఉండ ఉదయాన్నే తీస్కోవచ్చు
🫚 నల్ల అల్లం పెద్ద పేగు సమస్యల ని, అల్సర్, cancer లాంటి జబ్బులు రాకుండా నివారిస్తుంది
🫚 నల్ల అల్లం అలర్జీ, ఉబ్బసం, షుగర్ లాంటి వ్యాధులను తగ్గించడం లో ఉపయోగపడుతుంది
🫚 ఏదైనా దెబ్బలు తగలి సెప్టిక్ అయినప్పుడు నల్ల అల్లం దుంపల్ని కానీ ఆకులని కానీ నూరి గాయం పై పూత గా వేస్తే త్వరగా ఉపశమనం లభిస్తుంది, గాయం తగ్గుతుంది
🫚 ఒక్కోసారి బాగా అలసట గా అనిపిస్తుంది, పనులు అధికంగా చేయడం వల్ల కండరాలు పట్టేస్తూ ఉంటాయి.. నల్ల అల్లం అలసట ను త్వరగా తగ్గిస్తుంది, కండరాలు పట్టేయడాన్ని తగ్గిస్తుంది
🫚 నల్ల అల్లం గుండెల్లో మంట ను తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యం మెరుగు పరచడం లో ముఖ్య పాత్ర వహిస్తుంది
🫚 నల్ల అల్లం రక్తం లో cholestrol ని తగ్గిస్తుంది, కడుపు ఉబ్బరం, motions లాంటి వాటి నుండి ఉపశమనాన్ని ఇస్తుంది
🫚 నల్ల అల్లం ఆకలి మందగించడం లాంటి సమస్యను తగ్గించి ఆకలి పెరిగేలా చేస్తుంది
🫚 తరచుగా నల్ల అల్లం తీస్కోవడం వలన చర్మం లో కాంతి పెరుగుతుంది, వయసు ప్రభావం కనపడకుండా యవ్వనం గా కనపడటం లో సహాయ పడుతుంది
🫚 నల్ల అల్లం ను స్త్రీలు ఋతు సమయం లో తీసుకోకూడదు, దీని వలన అదిక రక్త స్రావం జరిగే ప్రమాదం ఉంది,
సేకరణ :
SRINIVAS KONIDENA
CTG KHAMMAM