TIP OF THE DAY:-
ఎండాకాలం మొక్కలని కాపాడుకోవడానికి తీసుకునే జాగ్రత్తలు ….
ముందు గా feb నెలలో పూర్తిగా ఎండలు రావు కాబట్టి ఈ టైం లో గార్డెన్ ని శుభ్రం చేసుకొని ఈ సీజన్ కి కావాల్సిన విత్తనాలు వేసుకుని , పాత మొక్కలు కాత అయిపోయినవి తీసివేసి మట్టిలో పశువుల ఎరువు / వర్మి కాంపోస్ట్ , నీమ్ పౌడర్ , ఎండు ఆకులు వేసుకుని దానిని బలవర్ధకం చేసుకొని మొక్కలు పెట్టు కుంటే ఎండాకాలం లో కాయకూరలకి కొదవ ఉండదు , ఇలా పాత కుండీల్లో వీడ్ ని తేదీ వేసి కొద్దిగా పై పై మట్టి తీసి పశువుల ఎరువు . అల్ మిక్స్ కేక్ లాంటివి వేసి రెగ్యులర్ గా నార్మల్ వాటర్ బదులు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తే ఎండల నుంచి మొక్కలని కాపాడు కోవడానికి అవకాశం ఉంది అలాగే తీగ జాతి మొక్కలు ఇప్పుడే పెడితే న్యాచురల్ షేడ్ నెట్ లాగా ఉపయోగ పడుతుంది , కుండీలని తూర్పు, పడమర దిక్కులో పెట్టుకోవాలి , కుండీలని గ్రూప్స్ గా పెట్టుకోవాలి , కుండీల్లో చామ దుంప లు నాటితే వాటికి వెడల్పు ఎక్కువ ఉన్న ఆకులు వచ్చి అవి కింద మొక్కలకి నీడ ని ఇస్తాయి , సహవాసమొక్కలు / companion plants నీ వేసుకుంటే ఒక దానికి ఒకటి చేదోడు వడోడు గా వుంటాయి . తరువాత పండ్ల మొక్కల కుండీల్లో ఆకు కూరలు వేస్తే అది లైవ్ మల్చింగ్ లా ఉపయోగ పడుతుంది , పెద్ద కుండీల నీడలో చిన్న మొక్కలు పెడితే ఎండ కి మొక్కలు పాడు అవ్వవు .
చెరకు పిప్పి నీ తెచ్చి చెట్లకి చుట్టూ మట్టిని కప్పితే అందులో సారం మనం ఇచ్చిన వర్మి కంపోస్ట్ లోని వాన పాములకి ఆహారం గాను ఉపయోగ పడుతుంది , మనం ఇచ్చే నీరు త్వరగా ఆవిరి అవ్వదు . ఎండు ఆకులు , పుచ్చ కాయ తొక్కలు మొక్కల కుండీల్లో మట్టిని కవర్ చేస్తే మొక్కలు హెల్త్య్గా వస్తయి.
ఎండల్లో మనకి వడదెబ్బ కొట్టి నట్లే మొక్కలకి కొడుతుంది దీని కోసం అలోవెరా వాటర్. ఎప్సం సాల్ట్ వాటర్ , పండ్ల తొక్కల జ్యూస్లు, తాటిముంజేలు పైన తొక్కలు నీటిలో వేసి ఆ వాటర్ , పుల్ల మజ్జిగ. ఇలా ఏదో ఒకటి మొక్కలకి ఇస్తూ వుంటే మొక్కలు పచ్చగా వుంటాయి
ఇప్పుడే పాత మొక్కలు తీసి కొత్తవి , కంకంబరం లాంటి వాటికి వెన్నులనీ . గులాబీ కూడా పువ్వులు అయిపోతాయి కాబట్టి ఇప్పుడే prune చేసి పశువుల ఎరువు , నిమ్మ తొక్కలు , కాఫీ , టీ లాంటివి ఇస్తూ గెస్ట్ లని జాగ్రత్త గా చూసుకోవాలి ఎండ ల్లో
ఇవి నేను తీసుకునే జాగ్రత్తలు సమ్మర్ లో మొక్కలని కాపాడు కోవడానికి 🪴🌱🌱
జయ
ఉండవల్లి