Essential information on Bonemeal , Trichoderma, coposting

Item wise.,. వివరణ
Item No. 1 (Bonemeal)
Bonemeal / ఎముకల పౌడర్
ఇది జంతువుల ఎముకల నుండి తయారు చేస్తారు. దీన్ని తయారుచేసే ప్రక్రియ లో బొక్కలను/ ఎముకలను steam ద్వారా easy గా Powder రూపంలో కి తెస్తారు.
ఇది నైట్రోజన్, ఫాస్పరస్,క్యాలిషియం లాంటి స్థూల, ఉప స్థూల పోషకాలు కలిగి వుంటుంది. కనుక మొక్క యొక్క ప్రతి ఎదుగుదల దశ లో మొక్కకు సహకరిస్తుంది. ఎదుగుదలకు తోడ్పడుతుంది.
ఇది slow releasing fertilizer. అందువల్ల potting mix కలుపుకునే సమయంలోనే soil లో కలుపుకోవడం వుత్తమం.
ఇది మొక్కల ఎదుగుదలకు దోహద పడే పోషకాలు కలిగి వుంటుంది .
ముఖ్యంగా వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి ఎంతో ఉపకరిస్తుంది.
మొక్కలలో జరిగే కిరణ జన్య సంయోగక్రియ కు అవసరమైన ఫాస్పరస్ దీనిలో పుష్కలంగా వుంటుంది.
Bonemeal కి ప్రత్యామ్యంగా ఆవపిండిని, కానుగ పిండిని కూడా వాడుకోవచ్చు.

  1. ఆవాలు పిండి / Musturd* లో వుండే సేంద్రీయ రసాయనాలు
  2. మాంగనీసు, 2. రాగి, 3. జింక్, 4. సోడియం, 5. క్యాల్షియమ్.
  3. కానుగ పిండి / Indian beech* లో వుండే సేంద్రీయ రసాయనాలు/ ఆర్గానిక్ chemicals
  4. నత్రజని, 2. పొటాషియం, 3. బూడిద,
  5. ఫాస్ఫరస్, 5. సల్ఫర్, 5. మెగ్నీషియం
  6. ఐరన్, 7. కాల్షిమ్, 8. జింక్, 9. మాంగనీస్, 10. కాపర్, 11.మేలిబిడినం,
  7. బోరాన్.
    వీటిలో (Macro nutrients) స్థూల పోషకాలే కాక, చాలా (Micro nutrients) సూక్ష్మ పోషకాలు కూడా వున్నాయి..
    —-oOo—-
    BONEMEAL
  8. Organic bone meal consists of high-quality nutrients that can help boost the plant’s growth.
  9. It Contains phosphorus, calcium, nitrogen and essential proteins.
  10. The bone meal slowly releases small and steady amounts of nutrients over a course of time. It also increases soil microbes throughout the growing season, benefitting the soil structure for the root systems of the plants.
  11. Bone meal is especially good for better root development and increased yield.
  12. It is also an excellent source of phosphorus, which is necessary for the photosynthesis process of the plants.
  13. It contains very beneficial nutrients and microbes which boost plant growth at all the stages of their life.
    —-oOo—-
    Item. No. 2 (Animal manure)
    జంతువుల పేడ/ Animal manure
    (ఆవు పేడ, మేక, గొఱ్ఱెల, బర్రెల, గుర్రాల ఎరువులు)
    ఇంటి తోటలకు విలువైన మట్టి మిశ్రమం తయారీ లో ఈ జంతువుల పేడ ను (ANIMAL MANURE) ఎరువు (fertilizer) గా వాడుతారు. ఇది మొక్కల పెరుగుదలకు తోడ్పడే (Macro nutrients) స్థూల పోషకాలైన NPK… నత్రజని, భాస్వరం మరియు పొటాషియం ను కలిగి వుండటమే కాక, సూక్ష్మపోషకాలను (Micro nutrients) కూడా అందిస్తోంది. అందువల్ల నేల సారవంతం గా వుంటుంది. ఇది నేలను సారవంతం గా చేయడమే కాక, నేల యొక్క acidity ని తటస్థంగా వుంచి, భూమి యొక్క నీటి నిల్వ సామర్థ్యం పెంచుతుంది. పేడ నుండి వచ్చే సేంద్రీయ కార్బన్ నేలలో సుక్ష్మ జీవుల వృద్ధికి తోడ్పడుతుంది.
    బాగా మాగిన పేడను మాత్రమే వినియోగించాలి. లేకపోతే చీడ పీడలకు అవకాశం ఉంటుంది.
    ఆవు పేడ, గొఱ్ఱెలు, మేకలు ఎరువులు TG లో వాడటానికి శ్రేష్ట మైనవి.
    కోడిపెంట లాంటివి నేల లో/ పొలాల్లో వాడటానికి అనుకూలం.
    మేక, గొర్రె పెంట ను తక్కువ మోతాదులో మన TG ల లోని కుండీలలో వాడవచ్చు.

ఆవు పేడ అన్నిటిలో వాడవచ్చు.
కంపోస్టు లో ఆవు పేడ కలప వచ్చు.
—-o0o—-
Item No. 3 (ఆవు మజ్జిగ / Butter milk)
పోషకాలు గా ఆవు మజ్జిగ / Butter milk: (Fertilizer)
ఆవు మజ్జిగలో (NPK) కాల్షియం, నైట్రోజన్ మరియు ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. కనుక ఆవు మజ్జిగ తో తయారు చేసిన ఏదైనా ద్రావణం మొక్కలకు కావలసిన మంచి పోషకాలను అందించి, మొక్క పెరుగుదలకు సహాయపడుతుంది.
క్రిమి సంహారిణి గా ఆవు మజ్జిగ / Butter milk: (Pestiside)
ఆవు మజ్జిగ ఒక గొప్ప సేంద్రీయ శిలీంద్ర సంహారిణి. ఇది బూజు తెగులు, పసుపు తుప్పు మరియు తెల్ల తుప్పు వంటి శిలీంధ్ర వ్యాధుల నుండి మొక్కలను. కాపాడుతుంది.
పుల్లని మజ్జిగ (బాగా fermentation అయినది) దీన్ని పిండి నల్లి పై చల్లితే, wax పోతుంది.
ఇప్పుడు లీటరు నీటికి 5 ml Neem oil, కొద్దిగా soap oil / కుంకుడు రసంతో కలిపి చల్లితే పిండినల్లి చస్తుంది.
—-o0o—-
Item No. 4 (గోరింట)
గోరింట/ గోరింత*
పండుగలకు, పెళ్ళిళ్ళకు గోరింటాకు పెట్టుకోవడం మన ఆడవారికి చాలా ఇష్టమైన విషయం.
అయితే మన ఆయుర్వేద విధానం లో , అది చేతిలో పండిన తీరును బట్టి వారి వారి శరీర తత్వాన్ని గుర్తిస్తారట.
ఎర్రగా పండి నల్లగా మారితే, వాత ( వాయు తత్వం) శరీరం గాను,
లేత ఎర్రుపు రంగులో పండితే, శ్లేష్మ/ కఫం ( జల తత్వం) శరీరం గాను,
ఈ రెంటికీ మధ్యయస్తంగా పండితే, పిత్త ( అగ్ని తత్వం) శరీరం గాను గుర్తిస్తారు.
“గోరింట పువ్వులు”
గోరింట పువ్వులను ఒక ఖర్చీఫ్ లాంటి దానిలో చుట్టి రాత్రుళ్ళు పడుకునే ముందు మనం ఉపయోగించే దిండు/ మెత్త/ పిల్లో క్రింద వుంచి దానిపై పండుకుంటే వెంటనే మాంచి సుఖ నిద్రలోకి జారిపోవచ్చు. ( నిద్ర లేమి నుండి బయటపడవచ్చు)
—-oOo—-
Item No.5.
వేరు వ్యవస్థ- కుండీల ఎంపిక*
మొక్కల్లో ముందు దాని వేరు వ్యవస్థ ఎలావుంటుంది అనే అవగాహన అవసరం.

  1. తల్లి వేరు కల్గివుండే మొక్కలకు బాగా లోతైన కుండీలు అవసరం. అలాగే దాని కాండం ఎంత లావు ఔతుందో? అవగాహన తో కుండీ వెడల్పు ను నిర్ణయించుకోవాలి. ( ఉదాహరణకు: మిరప, వంగ, కాప్సికం, జామ, నేరేడు, మామిడి లాంటివి)
  2. గుత్తులు గుత్తులుగా పై పైన వ్యాపించే వేరు వ్యవస్థ కలిగిన మొక్కలకు ఎక్కువ లోతు లేకున్నా, ఎక్కువ వెడల్పైన కుండీలు అవసరం. ( ఉదాహరణకు: బంతి, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, టమోటో లాంటి మొక్కల వేర్లు)
    పైన మొక్క వేర్లను బట్టి, కుండీ లోతు, వెడల్పు ఇలా ఉండవచ్చు అని చెప్పడం జరిగింది.
    గమనిక: మీరు తీసుకునే కుండీ size ను బట్టి, దిగుబడి వుంటుందని గమనించ గలరు. ఇక్కడ లోతైన కుండీలు వేటికి, వెడల్పైన కుండీలు వేటికి వాడాలో మాత్రమే చెప్పడం జరిగింది.
    Sizes are depending upon the plants, which you are going to plant in it.
    —-oOo—-
    Item No. 6
    వంటగది వ్యర్థాల నుండి కంపోస్ట్ తయారీ విధానం:
    కూరగాయలు తరిగిన తరువాత, మిగిలిన వ్యర్థాలను (waste ను) ఉపయోగించి, ద్రవ రూపంలో కంపోస్టు తయారు చేసుకోవచ్చు.
    వంటగది లో వ్యర్ధాలు అంటే, తరిగిన పచ్చి కూరగాయల వ్యర్థం, కూరగాయల తొక్కలు, పండ్ల తొక్కలు, ఆకు కూరల వేస్ట్ (సిట్రస్ జాతి కి చెందిన పండ్ల వేస్ట్, వుడికించిన పదార్థాలు తప్ప) అన్నీ కిచెన్ కంపోస్ట్ తయారీ కి పనికి వస్తాయి.
  3. బోకాషి బిన్ ద్వారా ద్రవ రూపంలో కంపోస్టు తయారు చేసుకోవచ్చు.
  4. ఎందుటాకులు, గార్డెన్ లోని రాలిన పచ్చి ఆకులు, ప్రూనింగ్ చేయగా వచ్చిన పచ్చి ఆకులు, పచ్చి కిచెన్ వేస్ట్ తో
    ఘన రూపంలో మంచి కంపోస్ట్
    తయారీ చేసుకోవచ్చు.
  5. కిచెన్ వేస్ట్ ని ఆరబెట్టి ( ఎండ తగలకుండా) ఘన రూపంలో మంచి కంపోస్ట్ ని త్వరగా తయారు చేసుకోవచ్చు.
  6. పూజకు వాడిన, వాడిన పూలు, మనకున్న అవకాశాలను బట్టి మనం సేకరించిన పూలను ఉపయోగించి ద్రవ రూపంలో కంపోస్టు తయారు చేసుకోవచ్చు.
  7. బోకాషి బిన్ ద్వారా ద్రవ రూపంలో కంపోస్టు తయారు చేసే విధానం:
    ఈ విధానంలో రెండు అరలు వుంటాయి. ఒక బకెట్ లో ఇంకో బకెట్ అమర్చి ఉంటాయి.
    మొదటి అర పై భాగంలో, lid ( మూతకి చుట్టూ) రెండు అంగుళాల క్రింద ఆ బకెట్ చుట్టూ రంధ్రాలు ఉంటాయి. (గాలి జొరబడటానికి)
    అలానే ఆ బకెట్ క్రింది భాగం జల్లెడ లావుంటుంది. (చేసుకొవాలి) దానిద్వారా పై భాగం
    అంటే పైన వున్న బకెట్ లో వేసిన
    వంటగది వ్యర్థాల నుండి స్రవించిన ద్రావణం క్రింది బకెట్ లోకి చేరుతుంది. క్రింది బకెట్ కి ఒక tap అమర్చుకుని దాని నుండి ద్రవాన్ని తీసికో వచ్చు.
    ఏరోజుకారోజు కిచెన్ వేస్ట్ పై బకెట్ లో వేస్తూ వుండాలి. అలా మనకు liquid రూపంలో వస్తూనే వుంటుంది.
    ఈ liquid ని 1: 10 ratio లో వాటర్ కలిపి , కొద్దిగా బెల్లం కలిపి మొక్కలకు
    ఎరువుగా ఇవ్వవచ్చు. ( బెల్లం ఎప్పటి కప్పుడు కలుపుకోవాలి)
    పై బకెట్ లో మురిగి పోయి, తడియారిన వేస్ట్ ని ఇంకో పద్ధతి ద్వారా ఘన రూపంలో కంపోస్టు తయారు చేసుకోవచ్చు.
    గమనిక: ఈ బిన్ ఎండలో ఉంచరాదు.
    దీనిలో నీరు పోయరాదు, వానకు తడవ నీయ కుండ చూడాలి.
    2. ఎందుటాకులు, గార్డెన్ లోని రాలిన పచ్చి ఆకులు, ప్రూనింగ్ చేయగా వచ్చిన పచ్చి ఆకులు, పచ్చి కిచెన్ వేస్ట్ తో ఘన రూపంలో మంచి కంపోస్ట్ తయారీ విధానం:
    దాదాపు అందరికీ తెలిసిందే. ఒక బకెట్ లో ఒక లేయర్ మట్టి చల్లి, మరొ లేయర్ పచ్చి ఆకులు, మరొ లేయర్ ఎండుటాకులు వేసి, మరల మట్టి చల్లి, దానిపై OWDC ద్రావణం గాని, ఆవుపేడ నీళ్ళు గాని చల్లాలి. అలా బకెట్ నిండే వరకూ ఇదే ప్రాసెస్ చేయాలి. ఫైనల్ గా పై భాగాన్ని మట్టి తో మూసేయాలి.
    నెల రోజుల్లో, లేదా రెండు నెలలో కంపోస్ట్ తయారు ఔతుంది.
    ఈలోగా దీనిపై ఏదైనా ఆకుకూరలు పండించుకోవచ్చు.
    నీరు ఎక్కువగా పోయరాదు. నీళ్లు చల్ల వచ్చు (స్ప్రే మాత్రమే).
  8. కిచెన్ వేస్ట్ ని ఆరబెట్టి ( ఎండ తగలకుండా) ఘన రూపంలో మంచి కంపోస్ట్ ని త్వరగా తయారు చేసే విధానం:
    దాదాపు ఇది కూడా అందరికీ తెలిసిందే. ఒక బకెట్ లో ఒక లేయర్ మట్టి చల్లి, మరో లేయర్ పచ్చి ఆకులు, మరో లేయర్ ఎండుటాకులు వేసి, మరో లేయర్ నీడలో బాగా ఆర బెట్టిన కిచెన్ వేస్ట్ ను వేసి గాని, అలాగే బొకాషి బిన్ నుండి సేకరించిన sludge ని కూడా ఒక లేయర్ గా వేసుకోవచ్చు.దాని పై మరల మట్టి చల్లి, దానిపై OWDC ద్రావణం గాని, ఆవుపేడ నీళ్ళు గాని చల్లాలి. అలా బకెట్ నిండే వరకూ ఇదే ప్రాసెస్ చేయాలి. ఫైనల్ గా పై భాగాన్ని మట్టి మట్టి తో మూసేయాలి.
    నెల రోజుల్లో, లేదా రెండు నెలలో కంపోస్ట్ తయారు ఔతుంది.
    ఈలోగా దీనిపై ఏదైనా ఆకుకూరలు పండించుకోవచ్చు.
    నీరు ఎక్కువగా పోయరాదు. చల్ల వచ్చు (స్ప్రే మాత్రమే).
  9. పూజకు వాడిన, వాడిన పూలు, మనకున్న అవకాశాలను బట్టి మనం సేకరించిన పూలను ఉపయోగించి ద్రవ రూపంలో కంపోస్టు తయారు చేసే విధానం:
    ఒక 🛢 డ్రం లో నీరు పోసి దానిలో మనం సేకరించిన పూలను ఉల్లిగడ్డల సంచి లాంటి సంచి లో వేసి, డ్రం లోని నీటిలో మునిగి వుండేలా చూసుకోవాలి.
    4 రోజుల పాటు నాననివ్వాలి . ఆ తరువాత , ఆ నీటిని డైరెక్ట్ గా కాని dilute చేసి గాని మొక్కలకుఇవ్వవచ్చు.
    —-oOo—-
    Item No. 7
    మిత్ర పురుగులు, శత్రు పురుగులు ఉంటాయని చెప్పుకుంటాం కదా!
    అంటే
    మొక్కలకు హాని చేసేవి… శత్రు పురుగులు.
    మొక్కలకు మేలు చేసేవి… మిత్ర పురుగులు.
    మేలు చేసే మిత్ర పురుగులు దాదాపు పగలు మన గార్డన్లో తిరుగుతాయి.
    కీడు చేసే శత్రు పురుగులు రాత్రుళ్ళు విజృంభిస్తాయి.
    అందుకే మనపెద్దలు చీకటి పడుతున్న సమయం లో మొక్కల జోలికి పోవద్దు అంటారు. (అవి మనల్ని కుడుతాయని)
    ఎవరైనా ఆ సమయం లో వచ్చి, ఆకులో, పూవులో అడిగితే చీకటి
    పడుతుంది ఉదయం వచ్చి కోసుకోండి అని అంటారు.
    అంటే సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం దాదాపు 5 గంటల వరకు శత్రు పురుగులు గార్డెన్ లో ఉంటాయని అర్థం. ఉదయం పరిశీలనగా చూస్తే, కొన్ని మొక్కల చిగుర్లు కొరికేసి వుంటాయి. అలానే అవి మరలా రాత్రి వరకు ఆ మొక్కల లోనే కదలకుండా దాగి వుంటాయి. మిత్ర పురుగులు కీడు చేసే ఈ పురుగులను తినడానికి వస్తాయి.
    —-oOo—-
    Item No.8
    పండు ఈగ నివారణోపాయాలు:
    పండు ఈగ కాయల పై వ్రాలి, గుడ్లు పెడతాయి. అక్కడ నల్లని మచ్చలు ఏర్పడుతాయి. తరవాత లోపలి భాగంలో బంక లాంటి పదార్థం గా తయారై, కాయల పెరుగుదలను అడ్డుకుంటుంది. తద్వారా కాయలు వంకర తిరగడం, సరిగా పెరగక పోవడం, పుచ్చి పోవడం జరుగుతుంది.
    మన TG/ Garden లో ఇది గమనించిన వెంటనే గార్డెన్ మొత్తం, వేప కషాయం గాని, వేప నూనె గాని స్ప్రే చేయాలి.
    ఇవే కాకుండా లింగాకర్షక బుట్టలు కూడా వాడుకో వచ్చు.వీటి ద్వారా గొంగళి పురుగులను నివారించ వచ్చు.
    Fruit fly traps ని కూడా ఏర్పాటు చేసి కోవచ్చు. వీటి ద్వారా పండు ఈగ ను సమగ్రంగా ఎదుర్కొనే సత్తా వుంటుంది.
    Blue sticky traps ని కూడ వాడుకో వచ్చు. తామర పురుగు ను అదుపు చేయడానికి ఉపయోగపడుతుంది.
    Yellow sticky traps ద్వారా తెల్ల దోమ, పచ్చ దోమ ను సమగ్రంగా ఎదుర్కోవచ్చు.
    పక్వానికి వస్తున్న పండ్లను పాలిథిన్ కవరు ద్వారా మూసి వుంచాలి.
    ఈ మధ్య కాలంలో చాలా రకాల (all in one) లాగా Solar system లో కూడా pest control/ repellent equipment అతి తక్కువ ధరలకు లభిస్తున్నాయి. (Roughly ₹. 2500/-)
    వాటిని కూడా ప్రయత్నించ వచ్చు.
    —–o0o—–
    Item No.9
    గోమూత్రం (Cow urine)/ ఆవు మూత్రం:
    ఆవు అంటే దేశీ ఆవు. మన దేశీ ఆవులకు పెద్ద మోపురాలు వుంటాయి, గమనించ వచ్చు.
    ఆవు/గోమూత్రాని కి ప్రకృతి వ్యవసాయం లో ప్రత్యేక ప్రాముఖ్యత వుంది.
    ఆవు/గోమూత్రం (Cowurine) మొక్కలకు పోషకం (Fertilizer) గా, కీటక నాశిని (Pesticide) గా పని చేస్తుంది.
    ఆవు మూత్రం లో నీరు, యూరియా, లవణాలు, హార్మోన్లు, ఎంజైమ్లు మరియు ఖనిజాలు వున్నాయి.
    కీటక నాశిని గా (Pesticide): ఇందులో వ్యాధికారక వివిధ రకాల సూక్ష్మ క్రిములను, వైరస్లను, శిలీంధ్రాలను ఎదుర్కునే/ నిరోధించే శక్తి వుంది. అందుకే గోమూత్రాన్ని కీటక నాశిని (Pesticide)గా వాడుతారు.
    “ఇది అద్భుతమైన కీటక నాశిని.”
    గమనిక:
    గోమూత్రం ratio ఎక్కువైతే, కొన్ని సందర్భాల్లో మొక్క చనిపోయే అవకాశం వుంది.
    (మొక్క ఎండి పోవచ్చు)
    అందువల్ల తక్కువ మోతాదు లో నీటితో కలిపి మొక్కలకు స్ప్రే చేయాలి.
    లేత ఆకులు, చిగుర్లకు గాఢత ఎక్కువైతే, మాడి పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
    Cow urine/గోమూత్రం ఎక్కువ నిల్వవుంటే గాఢత పెరుగుతుంది.
    అందువల్ల దాన్ని డైల్యూట్ చేసి (తక్కువ మోతాదులో) వాడుకోవాలి.
    పోషకం గా (Fertilizer):
    ఆవు మూత్రం (Cow urine), ఆవుపేడ (Cow dung)తో పంచగవ్య, ఘన జీవామృతం, ద్రవ జీవామృతం లాంటివి
    తయారు చేస్తారు. వీటిలో సూక్ష్మ పోషకాలు/ micronutrients అధికంగా వుంటాయి. అందువల్ల మొక్కల ఎదుగుదల బాగుంటుంది. వేరు వ్యవస్థ, శాఖలు/ కొమ్మలు/ కాండం బలంగా పెరుగుతాయి. ఆకులు పచ్చగా వుంటాయి. కారణం (క్లోరోఫిల్) పత్ర హరితం. తద్వారా కిరణజన్య సంయోగక్రియ/ Photosynthesis
    కు ఇది తోడ్పడుతుంది.
    “Micronutrients play an important role in photosynthesis.”
    కాబట్టి మొక్కలు తమకు కావాల్సిన పిండి పదార్థాన్ని తామే స్వయంగా (కిరణ జన్య సంయోగక్రియ/ Photosynthesis ద్వారా) తయారు చేసుకోగలుగుతాయి.
    అందుకే మొక్కలు పచ్చగా వుంటాయి. అంటే, macro nutrients/ స్థూల పోషకాల (NPK) లభ్యత కూడా కలిగివుంటుందని భావించ వచ్చు.
    కాబట్టి గోమూత్రాన్ని కృత్రిమ
    రసాయనాలకు మెరుగైన ప్రత్యామ్నాయం గా భావించ వచ్చు.
    —-o0o—-
    Item No. 10
    Garden లో చీమల సమస్య – నివారణ చర్యలు
  10. చీమలు గుంపులు గుంపులుగా, ఒకదాని వెనుక మరోకటి వరుసగా వెళ్తాయి. అవి వెళ్లే దారిలో ఒకరకమైన ఎంజైమ్ ను విడుదల చేస్తూ వెళ్తాయట వచ్చిన దారి మర్చిపోకుండా. కాబట్టి ఆ దారిలో అవి విడిచిన ఎంజైమ్ వాసనను మనం మార్చగలిగే, అవి దారి మర్చిపోయి వేరే చోటుకు వెళ్ళిపోతాయట. అలా చీమల దారి మళ్ళించవచ్చు
    నివారణ చర్యలు:
    అవి వెళ్లే దారుల్లో ఘాటైన వాసన కల్గిన ఏదైనా పదార్థాలను powders or liquids రూపంలో తయారు చేసి చల్లితే, చీమలు ఆ దిశగా రాలేక దారి మళ్లించుకుంటాయి.
    Powders:
    (a) దాల్చిన చెక్క, మిరియాలు, పసుపు, అవసరమైతే చీమల ఉదృతి బట్టి కారం కూడా కలిపి పొడి చేసి కుండీ లోని మట్టి లో చల్లాలి.
    (b) పంచదార/ చెక్కెర ను Powder చేసి, దానిలో బేకింగ్ సోడా ను కలిపి చల్లాలి.
    Liquids:
    (a) వెనిగర్ ను కూడా వాడవచ్చు, కానీ సరియైన విధంగా వాడకపోతే మొక్కకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ( వద్దు)
  11. ఇవి మీల్లీ బూర్గ్స్ విడుదలచేసే, sugar లాంటి పదార్థం కోసం మొక్క యొక్క కొమ్మల చివరి భాగానికి వీటిని చేరుస్తాయి. మొక్కల పై చీమలు కనిపిస్తే, అక్కడ మీల్లి బుర్గ్స్ ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. తగిన రక్షణ చర్యలు తీసుకోవాలి
    నివారణ చర్యలు:
    ‘వంటాముదం’ ను ఒక బ్రష్ తో మొక్క క్రింది భాగం నుండి ఒక అడుగు పై వరకు కాండనికి దట్టంగా పూయాలి. అప్పుడు చీమలదారి మళ్లింప బడుతుంది. అయినా ముందుకి సాగితే ఆముదం యొక్క జిగటదనానికి అందులోచిక్కుకొని బయటకు రాలేక చనిపోతాయి. అలా చీమల ద్వారా వృద్ధి చెందే మిల్లీ బెర్గ్స్ నీ కంట్రోల్ చేయవచ్చు.

—-oOo—-
Item No. 11

ట్రైకోడేర్మా

ట్రైకోడెర్మా అనేది మొక్కల పెరుగుదలను ప్రోత్సహించడానికి మరియు మొక్కల వ్యాధులను అణిచివేసే సామర్థ్యం కోసం తోటపని మరియు వ్యవసాయంలో ఉపయోగించే ప్రయోజనకరమైన ఫంగస్. ఇక్కడ ముఖ్య లక్షణాలు, ప్రయోజనాలు మరియు ట్రైకోడెర్మాను ఇంటి తోట మరియు కుండీలలో ఎలా ఉపయోగించాలి:

విశిష్ట లక్షణాలు:

బయోకంట్రోల్ ఏజెంట్: ట్రైకోడెర్మా అనేది శిలీంధ్రాలు మరియు నెమటోడ్‌లు వంటి వివిధ రకాల మట్టి ద్వారా సంక్రమించే మొక్కల వ్యాధికారక క్రిములకు వ్యతిరేకంగా సహజ జీవనియంత్రణ ఏజెంట్‌గా పనిచేస్తుంది.

మొక్కల పెరుగుదల ప్రమోషన్:
ఇది మొక్కల పెరుగుదలను పెంచడం ద్వారా పోషకాలను తీసుకోవడం మరియు వేరు వ్యవస్థ అభివృద్ధిని మెరుగుపరుస్తుంది.

బయోడిగ్రేడబుల్:
ట్రైకోడెర్మా పర్యావరణ అనుకూలమైనది మరియు మానవులకు, జంతువులకు లేదా పర్యావరణ వ్యవస్థకు ఎటువంటి హాని కలిగించదు.

లాభాలు:
వ్యాధి అణిచివేత: ట్రైకోడెర్మా హానికరమైన వ్యాధికారక క్రిములతో పోటీపడుతుంది మరియు
వాటిని వ్యతిరేకిస్తుంది, మన తోటలో మొక్కలకు సోకే వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

మెరుగైన పోషకాల తీసుకోవడం:
ఇది మొక్కలు పోషకాలను మరింత సమర్థవంతంగా గ్రహించడంలో సహాయపడుతుంది, ఇదిఆరోగ్యకరమైన మరియు మరింత దృఢమైన పెరుగుదలకు దారితీస్తుంది.

మెరుగైన ఆరోగ్య కరమైన వేరు వ్యవస్థ :
ట్రైకోడెర్మా మొక్కల అభివృద్ధికి (పెరుగుదలకు) అవసరమైన, బలమైన మరియు ఆరోగ్యకరమైన వేరు వ్యవస్థలను ప్రోత్సహిస్తుంది.

సస్టైనబుల్ గార్డెనింగ్:
ట్రైకోడెర్మాను ఉపయోగించడం వల్ల రసాయనిక పురుగుమందులు మరియు ఎరువుల అవసరాన్ని తగ్గిస్తుంది, పర్యావరణపరంగా స్థిరమైన తోటపని పద్ధతులను ప్రోత్సహిస్తుంది.

ట్రైకోడెర్మాను ఎలా ఉపయోగించాలి:

సరైన ఉత్పత్తిని ఎంచుకోండి:
తోటపని కోసం ప్రత్యేకంగా రూపొందించిన ట్రైకోడెర్మా ఉత్పత్తిని కొనుగోలు చేయండి. ఇది కణికలు, పొడి మరియు ద్రవంతో సహా వివిధ రూపాల్లో అందుబాటులో ఉంది.

మట్టిని సిద్ధం చేయండి:
నాటడానికి ముందు, ట్రైకోడెర్మా ఉత్పత్తిని మీ పాటింగ్ మట్టి లేదా తోట మట్టితో కలపండి. తయారీదారు సిఫార్సు చేసిన మోతాదును అనుసరించండి.

విత్తన శుద్ధి:
మీరు విత్తనాలను విత్తడానికి ముందు ట్రైకోడెర్మాతో పూత పూయవచ్చు, తద్వారా నేల ద్వారా వచ్చే వ్యాధుల నుండి మొలకలను రక్షించవచ్చు.

అప్లికేషన్ ఫ్రీక్వెన్సీ:
ఉత్పత్తి బ్రోచెర్ సూచనలలో పేర్కొన్న విధంగా, క్రమానుగతంగా ట్రైకోడెర్మాను
వాడండి (Apply చేయండి) ఇది నిరంతర వ్యాధి రక్షణ మరియు పెరుగుదల ప్రోత్సాహాన్ని నిర్ధారిస్తుంది.
నీరు త్రాగుట:
ట్రైకోడెర్మా వృద్ధి చెందడానికి మరియు సమర్థవంతంగా పనిచేయడానికి తేమ అవసరం కాబట్టి మీ మొక్కలకు క్రమం తప్పకుండా నీరు పెట్టండి.

మొక్కల ఆరోగ్యాన్ని పర్యవేక్షించండి:
వ్యాధి సంకేతాల కోసం మీ మొక్కలను
ఎప్పుడూ గమనిస్తూ ఉండండి. మరియు వాటి మొత్తం ఆరోగ్యాన్ని అంచనా వేయండి.
ట్రైకోడెర్మా వ్యాధి నివారణకు తోడ్పడుతుంది.
నిల్వ:
ట్రైకోడెర్మా ఉత్పత్తులను చల్లని, పొడి ప్రదేశంలో, ప్రత్యక్ష సూర్యకాంతి నుండి దూరంగా వుంచండి.

మీ ఇంటి తోట మరియు కుండీలలో ట్రైకోడెర్మాను వాడడం ద్వారా, మొక్కలను ఆరోగ్యకరంగా పెంచవచ్చు మరియు రసాయనాల జోక్యాల అవసరాన్ని తగ్గించ వచ్చు.

సేకరణ
అందు బాటలో వున్న ఇతర మిత్ర బృందాల నుండి సేకరించిన సమాచారం ఇది. దాన్నే యధాతధంగా ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది గమనించ గలరు 🙏🏻
Item No. 12
Importance of mulching
Mulching (కప్పి ఉంచటం) అనేది మన మొక్కల పెంపకం లో వాడే పదం.
వేసవికాలం లో ఈ పదం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది.
వేసవిలో వాతావరణం లో పెరిగే ఉష్ణోగ్రతలు ( వేడిమి) వల్ల భూమిలోని నీరు ఇంకిపోతుంది/ఆవిరై పోతుంది. (evaporation) .
అందువల్ల మన Terrace garden లో మనం వినియోగించే కుండీలలో ఉన్న potting mix/ మట్టి మిశ్రమం పై ప్రత్యక్ష సూర్య కిరణాలు పడటం వల్ల బాగా తేమని కోల్పోతాయి ( ఎండ వేడిమికి నీరు ఆవిరై పోవడం వల్ల).
ఈ సందర్భంగా మన నేలలో/ కుండీలలోని మట్టి మిశ్రమంలో నీరు అందులోని మినరల్స్ పూర్తిగా ఎండ వేడిమికి ఆవిరి కాకుండా కాపాడుకునే ప్రయత్నమే ఈ కప్పివుంచటం. (Mulching). తద్వారా మన TG లోని మొక్కలని కాపాడుకోవడం కోసం చేసే ప్రయత్నం/ విధానమే ఈ mulching.
ఈ పద్ధతి వల్ల నేలలో/ మట్టి మిశ్రమం లోని తేమ శాతం తగ్గకుండా ఉండేందుకు సహాయపడుతుంది.
Mulching/ కప్పివుంచడం అనేది అనేక రకాలుగా/ఎన్నో విధాలుగా చేసుకోవచ్చు.
ఇందులో భాగంగా ఎండుటాకులు, వరి పొట్టు (ఊక), వరి గడ్డి, అట్టలు (Cargoted board) లాంటి వాటిని మట్టిపై కప్పివుంచుతారు. తద్వారా సూర్య కిరణాలు ప్రత్యక్షంగా నేలపై / మట్టిపై పడదు. కనుక నేల లోని / మట్టి లోని తేమ శాతం తగ్గకుండా ఉండేందుకు దోహదపడుతుంది.
Mulching / కప్పివుంచడం అనేదాని ముఖ్య ఉద్దేశ్యం ఇదే.
—-oOo—-
Item No.13

OWDC.. Original Waste De Composer …. ✍
ఇది ద్రవ (liquid )రూపంలో / జెల్లీ రూపంలోను దొరుకుతుంది . ఇది ఉత్తర ప్రదేశ్ కు చెందిన NCOF ( నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ & నేచురల్ ఫార్మింగ్) సంస్థ తయారు చేసింది

  1. ఇది ఒక జీవనఎరువు (Bio fertilizer) ఇది సూక్ష్మ జీవులను కలిగి వుంటుంది. ఇది మట్టి లో కలిసిన వెంటనే అనేక సూక్ష్మ జీవులు గా అభివృద్ధి చెంది, మొక్కల పెరుగదలను ప్రోత్సహిస్తాయి.
    దీని లో ముఖ్యంగా రైజోబియం, అజోటో బ్యాక్టర్, అజోస్పిరిలియం లాంటి సూక్ష్మ జీవులు ప్రధానంగా వుంటాయి.
    అందువల్ల చీడ పీడలు ను సమగ్రంగా ఎదుర్కొనే శక్తి కలిగి, మొక్కల ఎదుగుదలకు తోడ్పడుతుంది.
  2. ఇది మొక్కలని అన్ని రకాల క్రీములను, ఫంగిసైట్స్ ని, వైరల్ డిసీజ్స్ ను, మట్టి నుండి సంక్రమించే వ్యాధుల నుండి సమగ్ర వంతంగా కాపాడుతుంది.
  3. యూరియా, DAP లాంటి రసాయన ఎరువులు వాడకం లేకుండా వాటి స్థానం లో దీన్ని వాడి, పుష్కలంగా దిగుబడి సాధించ వచ్చు.
  4. పిడస బారిన/ గట్టిగా వున్న నేలను/ మట్టిని గుల్లగా (porous) చేస్తుంది. తద్వారా ఎర్రలు / వానపాములు వృద్ది చెందుతాయి.
  5. దీన్ని మొక్కల పై పిచ్చికారీ చేయడం ద్వారా pest control ఔతుంది.
    Pest control చేయడమే కాక మొక్కకు కావల్సిన పోషకాలను కూడా అందిస్తుంది.
  6. విత్తనశుద్ధి కి విత్తనాలను దీనిలో 3 నుండి 4 గంటల పాటు నానబెడితే, ఎటువంటివ్యాధులు సంక్రమించ కుండా ఆరోగ్యంగా, మంచిగా మొలకెత్తుతాయి.
  7. తయారు చేసే విధానం….ఒక ప్లాస్టిక్ బేరల్ (plastic drum) లో 200 లీటర్ల నీరు పోసి, 2 లేదా 3 కేజీల బెల్లం (jaggery) కలపాలి. కరిగిన తరువాత దానిలో మీరు తెచ్చిన OWDC బాటిల్ లోని ద్రవాన్ని అందులో కలిపి ఉదయం ఒకసారి, సాయంత్రం ఒక సారి మొత్తం కలియ బెట్టాలి. (ప్రతి రోజూ)
    దాదాపు 5 రోజులకు ఆ ద్రావణం చిక్క బడుతుంది. మంచి కల్లు/ సారాయి వాసన మొదలౌతుంది. ( ready to use)
  8. వాడుకునే విధానం….1:10 నిష్పత్తిలో
    OWDC (డికంపొజ్ ద్రావణం) 1 : WATER (నీళ్ళు) 10.
    పెద్ద మొక్కలకు 1:10
    చిన్న/ లేత మొక్కలకు. 1:15
    మొక్కలు వున్న కుండీలలో వున్న మట్టిలో కూడా పోయాలి. ( మట్టి porousive గుల్లగా తయారు కావడానికి) మొక్కల పై కూడా పిచ్చికారీ చేయాలి. ( pest control కావటానికి).
    ఒక విధంగా చెప్పాలంటే … ఇది All in One bio fertilizers cum pest controler.
    —-oOo—-
    Item No. 14
    సహచర మొక్కలు అంటే ఒకదానికొకటి సహాయ పడుతు, రెండు healthy గా రావటానికి అవకాశం వున్న మొక్కలు.
    సహచర మొక్కల వల్ల మన మిద్దె తోటలోని ప్రధాన మొక్కలకు కలిగే లాభాలు.
  9. మొదటిది pest ని కంట్రోల్ చేసుకోవచ్చు.
  10. రెండవది సహచర మొక్కల నుండి ప్రధాన మొక్కకు కావలసిన పోషకాల్ని తీసుకోవచ్చు.
    Pest control :
    తులసి, వెల్లుల్లి, పుదీనా, మాచిపత్రి, మరువం, దవనం, లెమన్ గ్రాస్ ఈ మొక్కల నుండి వచ్చేటటువంటి ఘాటైన వాసన వల్ల కొన్ని రకాలైన దోమలు మరియు ఇతర పురుగులు కంట్రోల్ అయ్యే అవకాశం వుంది.
    మొక్కల మధ్యలో అక్కడ అక్కడ తులసి, లెమన్ గ్రాస్ పెట్టడం వల్ల దోమల ఉధృతి తగ్గుతుంది.
    గడ్డి చామంతి మొక్కలు మన గార్డెన్లో ఉండడం వల్ల లీఫ్ మైనర్ కంట్రోల్ అవుతుంది.
    మిర్చి, వంగ ,టమాటో కుండీ లో బంతి మొక్కలు వేయటం వల్ల నేమటోడ్స్ ని కంట్రోల్ చేయ వచ్చు .
    మినుములు, చిక్కుడు జాతి మొక్కలు ప్రధాన మొక్కల్లో ఉండడం వల్ల నైట్రోజన్ అనేది ప్రధాన మొక్కలు లభిస్తుంది.
    అలాగే దేశవాళీ బంతి పూల మొక్కలు ఉండడం వల్ల మొదటిగా ఆకుముడత తెగులు వీటిని ఆశిస్తుంది. అప్పుడు మనం ఆ తెగులు మిగతా మొక్కలకు ఆశించకుండా కంట్రోల్ చేసుకోవచ్చు.
    అలాగే బంతి , casmos మొక్కలు వుండటం వల్ల పాలినేషన్ అవసరాలు కూడా ఫుల్ఫిల్ ఔతాయి.
    —-oOo—
    Item No. 14
    NATURAL ROOTING HORMONES
    ఒక మొక్క cutting కి సహజంగా వేర్లు వృద్ధి చెందడానికి దోహదపడే హార్మోన్లు.
    స్వచ్ఛమైన నీరు
    తరువాత …..
  11. Aloe vera ( కలబంద)
  12. Banana (అరటి పండు)
  13. దాల్చిన చెక్క (Cinnamon)
  14. Venigar ( apple cider )
  15. Honey / తేనె (pure honey)
  16. Spit/ ఉమ్మి
  17. Aspirin 325 / 350 mg.
    పైవాటిని natural rooting agents గా వాడుతారు.
    ఇవి అన్నీ కూడా కత్తిరించిన కొమ్మ చివరి భాగం ఫంగస్ & రోగాలబారిన పడకుండా రక్షించేందుకు cutting కి అప్లయ్ చేస్తారు.
    అలాగే కొన్ని సందర్భాల్లో చక్కగా, త్వరగా propagate కావాలని అలోవెరా కు, బనానా కు, దాల్చిన చెక్కకు తేనెను కూడా add చేస్తారు.
    Rooting agents/ hormones పని ఏమిటంటే cuttings చివరి భాగం లో కొత్త గా వేరు వ్యవస్థ ను పునరుద్ధరణ/ propagation చేయడం లో సహకరిస్తాయి.
    &
    కత్తిరించిన కొమ్మ చివరి భాగం యే ఫంగస్ & రోగాల బారిన పడకుండా రక్షించేందుకు ఈ హార్మోన్స్ సహకరిస్తాయి .
    ఇవే కాకుండా మార్కెట్ లో readymade rooting agents/ hormones పేస్టు/ gel, ద్రవ (liquid) & పౌడరు రూపాల్లో దొరుకుతాయి.
  18. ఆరోగ్యంగా వున్న కొమ్మలు cuttings ని గాజు గ్లాస్ లో వుంచి ప్రతి రోజూ ఉదయం దానిలో నీరు మార్చుతూ మంచి propagation చేయవచ్చు.
  19. ఒక table spoon Aloevera gel ను ఒక కప్పు నీటిలో కలిపి అరగంట తరువాత వాడుకోవచ్చు.
    దీనికి ఒక table spoon తేనె ను కూడా add చేసుకోవచ్చు.
  20. ఒక table spoon పౌడర్ చేసిన దాల్చిన చెక్కను ఒక కప్పు నీటిలో కలిపి అరగంట తరువాత వాడుకోవచ్చు.
    దీనికి ఒక table spoon తేనె ను కూడా add చేసుకోవచ్చు.
  21. ఒక కప్పు నీళ్లు లో తేనె కలిపి గాని,
    ఒక కప్పు నీళ్లు లో apple cider vinegar కలిపి గాని
    ఒక కప్పు నీళ్లు లో పౌడర్ చేసి Asprin 325/350 mg tablet ని కలిపి గాని, అరగంట తరువాత వాడుకోవచ్చు.
  22. Banana / అరటి అయితే నేరుగా దాని ముక్క లో మొక్క కొమ్మను గుచ్చి
    పెట్టినా propagation ఔతుంది.
    పైన చెప్పిన వాటిలో ఏదైనా ఒక పద్ధతి ప్రకారం చేసుకుని, ఆ నీటి లో cuttings ని అర్థ గంట సేపు నానబెట్టాలి. ఆ తరువాత నాటుకోవచ్చు.
    సలైవా/ ఉమ్మిని cuttings చివరి భాగం లో రాసికూడ propagate చేసుకోవచ్చు.
    ఏదైనా 100% successful అని చెప్పలేం..
    —-oOo—
    Item No. 15
    Wood Ash
    బూడిద Pesticide గానే కాక fertilizer గా కూడా పని చేస్తుందట.
    దీని లో (Macro) స్థూల, (Micro) సూక్ష్మ పోషకాలు వుంటాయట. అలానే Trace elements/ మూలకాలు/సహజ ఖనిజాలు కూడా ఉన్నాయట. ఇవి అన్నీ తక్కువ మోతాదులో వుంటాయట.
  23. potash (K) స్థూల పోషకం
  24. phashate (p) స్థూల పోషకం
  25. Nitrogen (N) ఉండదు.
    Micronutrients such as (like trace elements/ మూలకాలు/ సహజ ఖనిజాలు)
  26. iron సహజ ఖనిజం
  27. manganese సహజ ఖనిజం
  28. boran సహజ ఖనిజం
  29. copper సహజ ఖనిజం
  30. Zink సహజ ఖనిజం
    పైన చెప్పబడిన పోషకాలు ” wood Ash” లో అతి తక్కువ మోతాదులో వుంటా యట. కనుక తెగుళ్ళ వచ్చినపుడు మొక్కలపై బూడిద చల్లి నప్పుడు అది మట్టి లో పడుతుంది కాబట్టి ప్రత్యేకంగా Fertilizer గా వాడాల్సిన పనిలేదు..
    —-oOo—-
    Item No.16
    “బెల్లం/ Jaggery”
    ఆర్గానిక్/ సహజ సిద్ధమైన (Natural) పద్దతులతో ప్రకృతి వ్యవసాయం చేయడం లో Jaggery/ బెల్లం పాత్ర చాలా ముఖ్యమైంది.
    దీని లో సహజ ఖనిజమైన ఐరన్ , మెగ్నీషియం ( ఉప స్థూల పోషకం), పొటాషియం ( స్థూల పోషకం), క్యాల్షియమ్ (ఉప స్థూల పోషకం)
    వుంటాయి.
    అందువల్ల Microbes/ సూక్ష్మ జీవులను పదింతలు గా అభివృద్ధి చేసే సహజ గుణం Jaggery/ బెల్లానికి వుంది. దీని వల్ల మొక్కలకు సంబంధించినంత వరకు ఇది ఎంతో మేలు చేకూర్చుతుందని
    చెప్పవచ్చు.
    దీనిలో వుండే సూక్ష్మ పోషకాలు/ micronutrients వల్ల మొక్కల ఎదుగుదల బాగుంటుంది. వేరు వ్యవస్థ, శాఖలు/ కొమ్మలు/ కాండం బలంగా పెరుగుతాయి. కారణం (క్లోరోఫిల్) పత్ర హరితం. తద్వారా *కిరణజన్య సంయోగక్రియ/ Photosynthesis
    కు ఇది తోడ్పడుతుంది.
    అందువల్లనే మనం తయారు చేసుకునే ప్రతి పోషక ద్రావణాల లో బెల్లం కలుపుకోవడం విశేషం.
    ఉదాహరణకు:
  31. OWDC లో బెల్లం కలుపుకోవడం జరుగుతుంది. MICROBES / సూక్ష్మ జీవులను వృద్ధిని వుత్తేజ పరచడం కోసం.
  32. మనందరికీ తెలిసిన “అప్పా రావు గారి మేజిక్ ఫార్ములా” లో కూడా బెల్లం కలుపుకోవడం జరుగుతుంది.
    అలా సూక్ష్మ జీవుల వృద్ధిని multiply/ రెట్టింపు చేసుకోవడానికి మనం తయారు చేసుకునే ప్రతి పోషక ద్రావణం లో బెల్లం కలుపుకోవడం విశేషం.
    —-oOo—-
    బెల్లం మూడు విధాలు గా వుంటుంది.
  33. చెరకు రసం తో చేస్తారు. (సహజ ఖనిజమైన ఐరన్ పుష్కలంగా వుంటుంది)
  34. తాటి బెల్లం (సహజ ఖనిజాలు వుంటాయి)
    3 కొబ్బరి బెల్లం ( మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి)
    ఏది ఏమైనప్పటికి బెల్లం స్థూల(Macro)
    ఉప స్థూల, సూక్ష్మ (Micro) పోషకాలు కలిగి వుంటుంది.
    కాబట్టి స్థూల, ఉప స్థూల పోషకాల వల్ల మరియు సూక్ష్మ పోషకాల వల్ల మొక్కలు, ఎదుగుదల లోనూ, కిరణ జన్య సంయోగక్రియ ద్వారా తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసికుని దృఢంగా తయారవుతాయి
    —-oOo—-
    Venkateswara Rao Alla garu… CTG member 🙏🙏
Shopping Cart