⭐NEMATODES లో రకాలు
ఏవి మంచివి- ఏవి మొక్కలకు హాని చేసేవి…
ఈ nematodes అనేవి చాలా చిన్నగా ఉండి కంటికి కనిపించవు మైక్రోస్కోప్ లో మాత్రమే కనిపిస్తాయి.. nematodes లో రెండు రకాలుంటాయి..
1.plant pathogenic nematodes ఇవి మొక్కల పై ఆధారపడి బ్రతుకుతాయి..మొక్క వెళ్ళలోకి పోయి అక్కడ పెరిగిపోయి మొక్కల లోకి ఆహారాన్ని పోనీయవు..ఆవిధంగా ఆ మొక్క చనిపోతుంది..మొక్కల వేళ్ళలో galls ( swellings)ఏర్పరుస్తాయి కాబట్టి వీటిని ROOT KNOT NEMATODES అంటారు.
2.Entemo pathogenic nematodes ( EPN) . ఇవి మొక్కలను నాశనం చేసే పురుగులను నాశనం చేస్తాయి. అంటే మొక్కకు మేలు చేస్తాయి..వీటిని powder రూపం లో లేదా లిక్విడ్ రూపం లో భద్రపరచి మార్కెట్ లో అమ్ముతారు..ఇవి మట్టిలో ఉంటే చాలా హానికారకమైన క్రిములను నిర్మూలిస్థాయి.
మనం ఈ రోజు ROOT KNOT NEMATODES ( BAD NEMATODES) గురించి తెలుసుకుందాం.
1) ఇవి మన గార్డెన్ లోకి ఎలా వస్తాయి..
a) మట్టి ద్వారా, b)బయటినుండి తెచ్చిన మొక్కల వేళ్ల ద్వారా, c) ALREADY అవి ఉన్న మట్టిలో ఉపయోగించిన పరికరాలు, కర్ర పుల్లలు, మన చేతులు ద్వారా మంచి మట్టిలో కూడా ప్రవేశిస్తాయి.
2) ఇవి రాకుండా ఏమీ చేయాలి
బయట కొన్న మొక్కలు, నారు ..వీటిని విడిగా ఉంచి కొంతకాలం అబ్జర్వేషన్ లో పెట్టాలి..వీటిలో ఉపయోగించిన పరికరాలు వేరే మట్టిలో ఉపయోగించేటప్పుడు శుభ్రం గా కడిగి మట్టి రేణువులు లేకుండా చూసి అప్పుడు ఉపయోగించాలి.
మొక్క నాటే ముందు ఆ కుండీలోవేప పిండి కలిపి అలాగే 30 నుండి 50 గ్రాముల పాసిలోమైస్స్ అనే మందును వాడి అప్పుడు మొక్క పెట్టాలి. VAM వా డటం వల్ల కూడా NEMATODES వెళ్ళలోకి పోకుండా నివారించవచ్చు.. LIQUID VAM తో నారుశుద్ది చేసి పాతుకోవాలి…..తరువాత Mulching COMPULSORY చేయాలి.
3) పొరబాటున ఈ nematodes మన garden లో ఒక కుండీలో వస్తె ఏమీ చేయాలి..మట్టి అంతా తడిసేల నీరు వేసి ఆ మట్టిలో మొక్క చుట్టూ కన్నాలు అంగుళం లోతు వేలు దూరెట్టు కన్నాలు చేసి అందులో PARCILOMYCES LILACINUS అనే మందును నీటిలో కలిపి పోయాలి..powder రూపం లో ఉంటే పది గ్రాములు లిక్విడ్ రూపం లో ఉంటే 10 ml. ఒక liter నీటిలో కలిపి వేయాలి.
అలా పదిహేను రోజులకు ఒకసారి చేస్తే slow గా nematodes చనిపోతాయి.
3a ) ఒకవేళ మొక్క చనిపోయినట్టు అయితే ఆ మొక్కను వేళ్ళతో సహా( ఒక్క వేరు ముక్క కూడా మట్టిలో మిగలకూడదు) బైట పారేసి మట్టినీ మండుటెండలో 4,5 రోజులు బాగా ఎండ బెట్టి , కుండీ ని కూడా బాగా కడిగి తరువాత ఆ మట్టిలో వెపపిండీ నీ కలిపి కుండీలో వేయాలి..తరువాత అందులో 50 గ్రాముల paecilomyces lilacinus ను మట్టిలో బాగా కలిసేలా కలపాలి..తరువాత మట్టంత తదిసేలా నీరు వేయాలి. నీరు కన్నం గుండా బయటికి రానంత మాత్రమే వేయాలి..తరువాత ఆ కుండీ పై ఎండ తగలకుండా ఏదైనా కప్పి నీడలో ఉంచాలి..వారం రోజుల పాటు మట్టి తడి ఆరకుండా నీరు స్ప్రే చేస్తూ ఉండాలి..వారము,పది రోజుల తరువాత మొక్కను పెట్టుకోవచ్చు..తరువాత ప్రతి నెలకు ఒకసారి కొంతకాలం పాటు15 గ్రాముల PL( PACILOMYCES) నీటిలో కలిపి ఆ కుండీలో వేస్తూ ఉంటే ఎప్పటికీ మళ్ళీ nematodes రావు..
వాడిన టూల్స్, పుల్ల ముక్కలు, చేతులు శుభ్రం గా కడగకుండ వేరే మట్టిలో పెట్టవద్దు..
4 . పెద్ద మడులలో ఈ సమస్య వస్తె ఆ మడిలో పాడైన మొక్కను తీసేసి దానిలో nanosilver హైడ్రోజన్ పెరాక్సైడ్ ఒక liter నీటిలో 20 ml కలిపి మట్టంతా తడిసెలా water can తో వేయండి..ఒక రెండు రోజుల తరువాత వేప కషాయాన్ని ఇదే పద్దతిలో మట్టిలో వేయండి..మరో రెండు రోజులు ఆగి PARCILOMYCES LILACINUS
20 గ్రాములు ఒక liter చొప్పున నీటిలో కలిపి మట్టిలో అంత తడిసెలా water can తో వేయండి..నీరు లోనికంటూ వెళ్లేలా మట్టిని గుల్లగా చేస్తే మంచిది..ఇలా ప్రతి మొదట్లో పదిహేను రోజులకు ఒకసారి తరువా నెలకు ఒకసారి ఇస్తూ ఉంటే nematodes అన్నీ పోతాయి..
ఇవే కాకుండా ఆ మట్టిలో ఫ్రెంచ్ MARIGOLD banthi మొక్కలను పెంచడం, అవాళ మొక్కలను పెంచడం, mustard cake nu ఎరువుగా వాడటం కూడా nematodes నీ అదుపులో ఉంచుతుంది.
పై పద్దతులు FOLLOW అవుతూ రెగ్యులర్ గా OWDC, VAM మైకొర్రిజా FUNGUS నీ, వాడుతూ ఉంటే ఫలితం మరింత త్వరగా కనిపిస్తుంది.
అన్ని మొక్కలకు అన్ని వేళలా OWDC, VAM ,TRICHODERMA వాడుతూ ఉండండి..
అసలు ఈ NEMATODES ఎఫెక్ట్ అయిన మొక్కను ఎలా గుర్తించాలి.
మొక్క అప్పటివరకూ బానే ఉండి సడెన్గా ఆకులు వాలిపోయి, లేదా రంగుమారిపోయి పూత వాలిపోతుంది
.
ఇదంతా ఒక వారం లో జరిగిపోతుంది..మనం ఇది పోషకాలు లోపం వల్ల వచ్చిందేమో అనిపిస్తుంది..అప్పుడు మట్టిని కొద్దిగా తొలగించి వేళ్లను పరిశీలిస్తే బుదిపెలు వచ్చి వేళ్ళు ఉబ్బిపోయి ఉంటాయి..ఆ విధం గా NEMATODES నీ నిర్ధారించుకోండి..
- PARCILOMYCES LILACINUS అనేది ఒక బయో ఫెంగై..POWDER లేదా లిక్విడ్ రూపం లో దొరుకుతుంది.
** Nano silver hydrogen peroxide ఉపయోగించేటప్పుడు gloves తప్పనిసరిగా .
IVV VARA PRASAD
CTG- RJY.