Charging Biochar – Procedure
Biochar ని Soil amendment గా వాడుకునే ముందు దానిని బ్యాక్టీరియా ఇంకా Nutrients and Micronutrients తో charge చేయాలి. 15 రోజులలో charge అవుతుంది. ఇలా ఎందుకంటే Biochar is like a Rechargeable Battery. ఆ తరువాత దీనిని Potting soil లో కలుపుకోవచ్చు. మనం periodical గా వేసే ఎరువులతో Biochar మళ్ళీ మళ్ళీ ఛార్జ్ అవుతుంది.
Items required for Charging:
1. బొగ్గులు (చిన్న చిన్న ముక్కలు తో కూడిన పొడి) 2.ఒక దోసెడు ఏదయినా పెద్దవృక్షం కింద మట్టి.ఇందులో అనేక రకాల బ్యాక్టీరియా వుంటుంది. |
Items required for Charging:
1. బొగ్గులు (చిన్న చిన్న ముక్కలు తో కూడిన పొడి) 2.ఒక దోసెడు ఏదయినా పెద్దవృక్షం కింద మట్టి.ఇందులో అనేక రకాల బ్యాక్టీరియా వుంటుంది. |
3. ఏదయినా ఆర్గానిక్ NPK Fertilizer (Chemical కాదు) అంటే బాగా decompose అయిన Cow Dung or మనం Kitchen waste తో చేసుకున్న కంపోస్ట్ or Vermi Compost
4. బెల్లం నీళ్ళు కొంచం-ఎందుకంటే ఒక టన్ను బయోచార్ ని చార్జింగ్ చేయటానికి ఒక కేజీ బెల్లం సరిపోతుంది.
తయారు చేసుకునే పద్ధతి: Biochar, NPK ఎరువు ను సమాన పాళ్ళ లో తీసుకుని, ముందుగా బయోచార్ ని water తో తడిచేసి. Next, బయట వున్న ఒక పెద్ద వృక్షం కింద మట్టి (కొద్దిగా మాత్రం), ఈ మూడింటిని బాగా కలపాలి. తరువాత అందులో తడి పొడిగా వుండేటట్లు గా బెల్లం నీళ్ళు (లీటర్ కి 5 గ్రాముల బెల్లం) ఇంకా మామూలు నీళ్ళు వేసి కలుపుకోవాలి. ఈ కలిపిన mixture మనం లడ్డు తయారయ్యే Consistency లో వుండాలి. ఈ mixture ని ఒక bucket లో గానీ Tub లో గానీ వేసుకుని, రోజుకి ఒకసారి మళ్ళీ బెల్లం కలిపిన నీళ్ళు, మామూలు వాటర్ పోసి 15 రోజుల పాటు రోజూ కలపాలి. ఇది చాలా శ్రమతో కూడుకున్న పని. ఈ mixture నీరు కారిపోకూడదు. 15 రోజుల తరువాత వచ్చేదే Charged Biochar. దీనిని soil mix లో కలుపుకోవచ్చు. మన soil Mix లో ఎంత కలపాలి అన్నది ఒక ప్రయోగం చేసి నిర్ధారించు కోవాలి. ఆ విషయం ఇంకో మెసేజ్ లో చూద్దాం.
-వేణుగోపాల్ రాప్ , CTG 8