Control -Rats Bandikoots

ఎలుకలు / పంది కొక్కుల బెడద:

ఎలుకలు, పంది కొక్కులు అనేవి క్షీరదాలు.

ఇవి తమ పిల్లలకు పాలిచ్చి పెంచుతాయి.

ఇవి వాటికి అనుకూల ఆహారం లభ్యమయ్యే ప్రాంతాలలో వాటి కాలనీలను (నివాసాలను) ఏర్పాటు చేసుకుంటాయి.

అలాగే డ్రైనేజీ వ్యవస్థ (మురుగునీరు పారుదల) వున్నచోట ఇవి ఆ పైపు లను వాటి ఆవాసంగా మార్చుకుని వుంటాయి.

ఆ పరిసర ప్రాంతాలను తవ్వి వాటికి అనుకూలం గా చేసుకుంటాయి.

అలా మన ఇంటి పరిసరాలను, ఇంటి చుట్టూ ఉండే ఖాళీ ప్రదేశాలను తవ్వి ఇబ్బందిని కలిగిస్తాయి.

(అవి తవ్విన రంధ్రాల్లో పాములు లాంటి విషజంతువులు చేరే అవకాశం ఉంటుంది.)

ఏ కొంచెం ఆధారం దొరికినా, అవి ఇండ్లలోకి, మన పెరటి తోటలోకి, వీలైతే మిద్దె తోటలోకి కూడా చొచ్చుకు రావడం తో, మనకు చాలా ఇబ్బందిని, నష్టాన్ని కలుగ చేస్తాయి.

అదే విధంగా పంట పొలాలను కూడా పాడు చేస్తాయి.

తద్వారా పంట నష్టం కూడా జరిగి పోతుంది.

పొలాల్లో వీటి వ్యాప్తి తగ్గించడానికి       "తిమ్మెట్" అనే రసాయన గుళికలు చల్లుతారు. 

వాటి వాసన వల్ల , రసాయన పదార్థాల చర్య వల్ల అవి చనిపోతాయి.

ఇదే గృహ పరిసర ప్రాంతాలలో అయితే, “తిమ్మేట్” ను వాడ కూడదు.

అది వాడినట్లైతే పరిసరాల్లో తిరిగే జంతువులు, కోళ్ళు, పందులు, కుక్కలు, మేకలు, గొర్రెలు దాని ప్రభావం వల్ల చనిపోయే అవకాశం ఉంది.

కలరా వుండల/ నాఫ్టలిన్ గోళీల వాసన ను అవి భరించ లేవు. అలాగే వెల్లుల్లి, ఉల్లి పాయల వాసన కూడా వాటికి సహజంగా పడవు. ఆ వాసన వచ్చే ప్రదేశాలకు అవి రావు, పోవు.

అసలు అవి ఎక్కడ నుండి వస్తున్నాయో గమనించి, అవి వచ్చే మార్గం లో పగిలిన గాజు సీసా ముక్కలు వేయండి.

ఎందుకంటే అవి ఏ మార్గం గుండా
వస్తున్నాయో, వస్తాయో, అదే మార్గం గుండా వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాయి.

ఆ ప్రయత్నంలో గాయల పాలై రక్తం కారుతోంది. ఆ వాసనకు అనేక రకాల చీమలు వాటి కాలనీస్ లో చేరి వాటిని బలహీన పరచి చంపుతాయి.

ఇవి నీరు లేకుండా ఎక్కువ కాలం జీవించే వుంటాయి. కారణం అవి తీసుకునే ఆహారం లో ఎక్కువగా పొడి గింజలు వుంటాయి. వాటిని జీర్ణ క్రియ ద్వారా విత్తనాల నుండి కొవ్వులను నీరుగా మార్చడం ద్వారా జీవిస్తాయి.

అవి ఆవాసాలు ఏర్పరుచుకోవడానికి ఉన్న అవకాశాలని మూసి వేయాలి.
….ALLA VENKATESWARA RAO

MEMVER-CITY OF TERRACE GARDENS
—-oOo—-

Shopping Cart