బీర మొక్కలు పెంచడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు / మెళుకువలు/అనుకూల వాతావరణం/ సస్య రక్షణ విధానం
ఇది అసలు 70/ 80 రోజుల పంట.
మార్కెట్ లో వస్తున్న వివిధ రకాల విత్తనాలు 60 రోజులకే కాపు కు వస్తున్నాయి.
బీరలో వివిధ రకాలు ఉన్నాయి.
దీన్ని సంవత్సరం లో రెండు సార్లు వేసుకోవచ్చు.
- June, July.
- December , January.
తేమ తో కూడిన వేడి వాతావరణం అవసరం. వేడి ఎక్కువైతే, తట్టుకోలేదు. దిగుబడి తగ్గిపోతుంది. కుండీలలో నీరు ఎక్కువ నిలువ వుండకూడదు.
మట్టి మిశ్రమం విషయంలో యూనివర్సల్ potting mix సరిపోతుంది.
వేరు కుళ్ళు రాకుండా అందులో ట్రైకో డెర్మా విరిడి, సూడోమోనాస్, వేపపిండి కలుపు కోవాలి.
వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి కొంచెం జింక్ అందించే ఏదైనా పోషకాన్ని కూడా కలిపితే మంచిది. అది వేప పిండి లో సహజంగానే వుంటుంది.
వీటి ఆశించే పురుగులు…..
- గుమ్మడి పెంకు పురుగు,
- పాము పొడ పురుగు,
- Fruit fly.
వీటిని ఆశించే తెగుళ్ళు……..
- బూజు తెగులు,
- ఆకు మచ్చ తెగులు,
- బూడిద తెగులు,
- వైరస్ ( మొజాయిక్) తెగుళ్ళు.
ఇవి తీగ జాతి మొక్కలు. ఇవి ప్రాకటానికి అనువైన పందిళ్ళు కావాలి.
పందిళ్ళు
- Horizontal System,
- Vertical System.
తీగ జాతి మొక్కల కొరకు ఎన్ని విధాలుగా పందిళ్లు/ తడకలు ఏర్పాటు చేసికో వచ్చో చూద్దాం.
మన TG/ garden లో ఉన్న space ని బట్టి, Vertical/ నిలువు పందిళ్లు లేదా Horizontal / అడ్డు పందిళ్లు వేసుకోవచ్చు.
ఇవి కూరగాయలు, పండ్ల మొక్కలకు అనుకూలం.
వీటిని సుతిలి/ పురికొసతో గాని, కొబ్బరి తాడుతో గాని అల్లుకుంటే మొక్కలకు safe గా వుంటుంది. నైలాన్ తాడును కూడా ఉపయోగించ వచ్చును.
Iron తీగ కంటే ఒకసారి వాడి తీసిన house wiring వైర్లను కూడా వాడుకోవచ్చు.
వీటి ప్రయోజనాల విషయానికి వచ్చేసరికి వేటికి అవే .
Vertical పందిళ్లు వల్ల గాలి, వెలుతురు బాగా వుంటుంది. Horizontal / అడ్డు పందిళ్లు వల్ల ఒక్కొక సారి తగినంత సూర్య రశ్మి క్రింద కుండీలలో పెరిగే మొక్కలకు దొరకక పోవచ్చు.
అప్పుడు వున్న వాతావరణ పరిస్తితిని బట్టి మల్చింగ్ లాంటివి కూడా చూసుకోవాలి.
ఎందుకంటే ఇది రెండు సార్ల పంట కాబట్టి..
దీని విత్తనం గట్టిగా వుంటుంది కనుక డైరెక్ట్ గా నాటుకో వచ్చు.
బీర మొలకెత్తి, మూడు ఫీట్లు పెరిగాక, 3G cuttings మొదలు పెట్టాలి.
3G cutting వల్ల ఆడపూవులు ఎక్కువగా వచ్చి, దిగుబడి ఎక్కువ వస్తుంది. పోలినేషన్ కూడా సహజసిద్దంగా జరుగుతుంది
Beera 3 G cutting
బీర ఎప్పుడూ వుండే పంటే, కాని దీన్ని పెంచడం కొంచం కష్టమేనని చెప్పొచ్చు..
- బీర తీగ రెండు, మూడు అడుగులు పెరిగేవరకు ఆగి, దాన్ని క్రింది నుండి పైకి ఒక అడుగు /ఫీట్ వరకు ఉండే ఆకులను తొలగించాలి.
- ఈ మూడు అడుగుల తీగెకు పైన నెత్తిన చిగురును తుంచాలి. లేకపోతే, male flowers/ మగ పువ్వులే ఎక్కువ వుంటాయి. (ఇది 1st Generation)
- ఇప్పుడు 1st Generation కి నెత్తిన చిగురుని తుంచిన చోట ఆ తీగె రెండు శాఖలు గా మళ్ళీ పెరుగుతుంది. ఈ రెండు శాఖలు 1 లేదా 2 అడుగులు పెరిగాక, మరల రెండు శాఖల నెత్తిన చిగురును తుంచాలి. ఇప్పుడు ఈ రెండు శాఖల నుండి female flowers/ ఆడ పువ్వులు పూయడం మొదలౌతుంది.
(ఇది 2nd Generation) - ఇప్పుడు మళ్లీ 2nd Generation కి నెత్తిన చిగురుని తుంచిన చోట్ల మళ్లీ రెండు శాఖలు గా, ఇంకో శాఖ వద్ద మళ్లీ రెండు శాఖలు గా, పెరుగుతుంది. ఇలా 2 x 2= 4 శాఖలు గా పెరుగుతుంది. ఇప్పుడు ఈ 4 శాఖల నుండి కూడా female flowers/ ఆడ పువ్వులు పూయడం మొదలౌతుంది. (3G)
(ఇది 3rd Generation)
పూత – కాత
పూత, కాత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
ఏపుగా పెరిగే కొద్దీ, వాటికి పోషకాల అవసరం వుంది. (పూత- కాత సమయంలో ‘పొటాష్’ బాగా అందేలా చూడాలి) అలాగే పరాగ సంపర్కం
/ pollination కోసం కొంత జాగ్రత్త అవసరం.
- 3G cutting పూర్తి అయ్యేసరికి, ఇవ్వాల్సిన పోషకాలను ఎలాగూ ఇస్తాం.
- Female/ ఆడ పువ్వులు రావటం మొదలైన వెంటనే ఉదయం పూట మొక్కలకి నీళ్ళు పోసేటప్పుడు, 1 లీటరు నీటికి 10/15 మి. లీ తేనె కలిపి బీర తీగలపై పిచికారీ చేయాలి. అలా చేయడం వల్ల ఆ వాసనకు కీటకాలు వస్తాయి. అందువల్ల “ప్రకృతి సిద్ధం”గా పోలినేషన్ /pollination జరుగుతుంది. లేదా Hand pollination చేయాల్సిన అవసరం వుంటుంది.
Hand pollination: ఈ process లో ..మొదటి cutting లో అన్నీ మగ పూవులే వుంటాయి.ఇవి గుత్తులు గుత్తులుగా వుంటాయి. కానీ తరువాత 2nd & 3rd generation (3G) లో అన్నీ ఆడపువ్వులే వస్తాయి. ఇక్కడ గుత్తులుగా వచ్చిన మగ పూవులను తుంచి, కాయలావుండే ( female), దానిచివర ఉండే పూవే ఆడ (female). దానికి మగపువ్వును త్రుంచి, దాని పుప్పొడిని, అడపువ్వు పుప్పొడి కి అతికేలా రెంటినీ కలపాలి..
ఇది బీర hand pollination..
Note: బీర కాకుండ వేరే మొక్కలకి male & female రెండూ ఒకే పువ్వులో ఉంటాయి, కాబట్టి వాటికి hand pollination చేసే సమయంలో ఒక బ్రెష్ లాంటి దానితో దానిపై రుద్దితే, సరిపోతుంది
- Pollination/పరాగ సంపర్కం జరిగిన తరువాత, ఆ పువ్వు క్రింద పెరిగే కాయను గమనిస్తూ ఉండాలి.. అది కాయ గా పెరుగుతున్నది, లేనిది, గమనించాలి. ఈ సమయము లో ‘బనానా 🍌 పీల్ ఫెర్మెంటెడ్ juice’ వాడాలి.. పూత కాత నిలబడుతుంది.
పంట రక్షణ కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు ఎలాగూ పాటిస్తాం
(ఆర్గానిక్ పెస్టిసైడ్స్ వాడకం)
“సర్వే జనాః సుఖినోభవంతు”
వేంకటేశ్వర రావు ఆళ్ళ, వికారాబాద్.
(CITY OF TERRACE GARDENS GROUPS)
—-oOo—-