CHOUHAN Q METHODS
FPJ – Fermented Plant Juice
👉 మన తోట లో కాని మన చుట్టు పక్కల కాని బాగా వేగం గా పెరిగే మొక్కల ఆకులు, కాండం దీని తయారీ కి ఉపయోగించవచ్చు, వీటిలో growth harmone చాలా ఎక్కువ గా ఉంటుంది
- మల్బరీ మొక్క ఆకులు
- తోటకూర ఆకులు , కాడలు.
- వెదురు ఆకులు.
- అరటి ఆకులు, కాండం.
- ములగ ఆకులు.
- కలుపు మొక్కలు.
👉 ఇలా ఈ ఐదు రకాలలో ఏవైనా తీస్కోవచ్చు, లేత పిందెలు, పూత కూడా తీస్కోవచ్చు
👉 ముందుగా సూర్యోదయం అవకముందు ఉదయాన్నే ఈ ఆకులు, కాడలతో కలిపి తీస్కుంటూ మట్టి లాంటిది లేకుండా శుభ్రంగా దూలపాలి, కడగకూడదు, నీరు అనేది వీటికి తగలకూడదు
👉 ఈ కాడలు, ఆకులు చిన్న చిన్న ముక్కలు గా కోసి అవి ఎంత పరిమాణం లో ఉంటే అంతే పరిమాణం లో బెల్లం తీస్కుని దీనిలో కలిపి చేతులతో బాగా పిసుకుతూ ఉండాలి, దీని వల్ల ఆకులు, కాడలలో ఉన్న రసం, సారం బయటకు వస్తుంది, ఇప్పుడు దీన్ని ఇలానే ఒక రెండు గంటలు వదిలేసి ఆ తర్వాత ఈ మీశ్రమాన్ని ఒక ప్లాస్టిక్ డబ్బా లో బాగా వత్తుతూ పెట్టాలి, దీని వలన air bubbles రాకుండా ఉంటాయి, మొత్తం పెట్టాక పై లేయర్ లా బెల్లం చల్లేసి ఒక cloth తో ఆ ప్లాస్టిక్ డబ్బా ను మూయాలి, ఒక రెండు మూడు వారాలు ఇలానే ఉంచాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒక మూడు వారాల తర్వాత మనం వేసిన ఆకులలోని క్లోరోఫిల్, కాడలలోని గ్రోత్ హార్మోన్స్ అన్ని కరిగి ఈ మీశ్రమం లో ఉంటాయి.. ఇప్పుడు దీన్ని బాగా వడకట్టి, ఒక గాజు సీసా లో పోసుకుని ఉంచుకోవాలి, ఇది రూమ్ టెంపరేచర్ లో 30 రోజుల వరకు తాజా గా ఉంటుంది, ఆ తర్వాత కూడా ఉండాలి అనుకుంటే దీనిలో కొంచం బెల్లం కలిపి fridge లో పెట్టచ్చు, ఇలా చేస్తే ఒక 6 నెలలు వరకు ఉంటుంది.
👉 వాడుకునే విధానం :-
1 ml fermented plant juice తీస్కుని 1000 ml నీళ్లలో కలిపి ప్రతీ వారం మొక్కలకి ఇవ్వచ్చు.
👉 ఉపయోగాలు:-
Fermented plant juice లో గ్రోత్ హార్మోన్స్ అధికంగా ఉంటాయి, ఇది మొక్కల కి ఇవ్వడం వలన మొక్కలలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, మొక్కలలో ఎదుగుదల బాగుంటుంది, పూత పిందే త్వరగా వస్తుంది, మొక్కలు చీడ పీడల బారిన పడకుండా ఉంటాయి
👉 *Fermented plant juice ని విత్తనం మొలకత్తిన దశ నుండి పూత పిందే దశ వరకు మొక్కలకి ఇవ్వచ్చు, కాపు బాగా వస్తుంది మరియి రుచి పెరుగుతుంది.
👉 ఎప్పుడు ఇవ్వకూడదు:-
మొక్కల కి కూరగాయలు, పళ్ళు కాసి అవి కోసే సమయం దగ్గరికి వచ్చినప్పుడు ఈ FPJ ఇవ్వకూడదు
వాతావరణం మబ్బులు గా ఉన్నప్పుడు, వర్షం వచ్చే ముందు ఇవ్వకూడదు
SRINIVAS
CTG KHAMMAM