👉 బోన్ మీల్ మన మొక్కలకి ఎలా ఉపయోగపడుతుందో మన అందరికి తెలుసు , కానీ ఈ ఎండాకాలం లో మన మొక్కలకి ధ్రవ రూపం లో ఉన్న ఎరువులను తప్ప ఘన రూప ఎరువులు ఇవ్వకూడదు
👉 మొక్కలు ఎదుగుదల కు పూత, పిందే రావడానికి, పువ్వులు బాగా పూయడానికి కాల్షియమ్, పొటాషియం, ఫాస్పరస్, ఐరన్, జింక్ ఇలాంటివి అన్ని అవసరం, ఇవన్నీ మనం ఇంట్లో దొరికే వస్తువులతోనే తయారుచేసుకోవచ్చు
👉 ధ్రవరూప బోన్మీల్ తయారీ కి కావలసిన పదార్ధాలు,
:- కలబంద ఆకులు – 3
:- కోడిగుడ్లు – 3
:- వెర్మీ కంపోస్ట్ – 1/4kg
:- కోడిగుడ్లు వాడలేము అనుకున్న వారు కోడిగుడ్ల స్థానం లో శనగపిండి, నల్ల నువ్వుల పొడి తీస్కోవచ్చు
తయారీ విధానం
👉 ముందుగా మూడు కలబంద ఆకులు తీస్కుని వాటి రెండు అంచుల్లో ఉండే ముళ్ల లాంటి భాగం తీసేయాలి, ఈ కలబంద ఆకుల్ని చిన్న ముక్కలు గా కట్ చేస్కుని మిక్సీలో వేసుకోవాలి, ఇందులో 3 కోడిగుడ్ల ను వేసుకోవాలి ( కోడిగుడ్ల లో ఉండే ఎల్లో వరకు అయినా వేసుకోవచ్చు ),ఇప్పుడు వీటిని బాగా మిక్సీ పట్టాలి, కలబంద లో మనకి ఫాస్పరస్, పోటాషియం ఉంటాయి మరియి anti fungal గా కూడా పని చేస్తుంది, కోడిగుడ్ల లో కాల్షియమ్ బాగా ఉంటుంది, వీటితో పాటు మనకి నైట్రోజెన్ కూడా అవసరం కనుక ఒక 1/4kg వెర్మీ కంపోస్ట్ కానీ పశువుల ఎరువు కానీ తీస్కుని ఒకపావు లీటర్ నీటిలో ఒక గంట సేపు నానపెట్టి ఆ తర్వాత ఈ నీటిని వడకట్టి తీస్కోవాలి, ఈ నీటిలో నైట్రోజెన్ ఉంటుంది, ఇప్పుడు ఈ నీటిని కలబంద, కోడిగుడ్లు కలిపి మిక్సీ పట్టిన మీశ్రమం లో పోసుకుని బాగా కలిపి కాసేపు ఉంచి వడకట్టుకోవాలి.
మొక్కలకు ఇచ్చే విధానం
👉 కలబంద,కోడిగుడ్లు, వెర్మీ కంపోస్ట్ నీళ్లు కలిసి ఉన్న ఈ మిశ్రమాన్ని ఒక గ్లాస్ లో తీస్కుని ఒక 20 లీటర్ల నీటిలో కలిపి మొక్కల మొదళ్ళలో ఇవ్వాలి, ఇది ఇచ్చే ముందు కుండీలోని మట్టి పొడి పొడి గా ఎండిపోయినట్లుగా కాకుండా మట్టి లో కొంచం తేమ ఉన్నప్పుడు ఇవ్వాలి
👉 ఈ మీశ్రమాన్ని నిలవ చేసుకోవలసిన అవసరం లేదు,, 15 లేదా 20 రోజులకి ఒకసారి తయారు చేస్కుని అప్పటికప్పుడు మొక్కలకు సాయంత్రం పూట ఇచ్చుకోవాలి
THANK YOU
SRINIVAS KONIDENA KHAMMAM CTG
HOME MADE LIQUID BONE MEAL

SRINIVAS KONIDENA
CTG KHAMMAM