వేసవిలో TERRACE GARDEN లోని మన మొక్కలను సంరక్షించుకోవడానికి చేయవలసిన కొన్ని పనులు/ తీసుకోవలసిన జాగ్రత్తలు.
- Shade net ఏర్పాటు చేసుకోవడం.
- Pots లో potting mix తడి ఆరిపోకుండా mulching చేసుకోవడం.
- ఉదయం, సాయంత్రం మొక్కలకి నీళ్ళు పోయడం.
- రెండు పూటలా నీటిని మొక్కల పై spray చేయడం.
- వేసవిలో liquid fertilizers నే మొక్కలకి వాడడం మంచిది.
- మొక్కలకి ఎక్కువ pruning చేయరాదు.
- మొక్కలకు ఎక్కువగా pesticides ని వాడవద్దు.
- మొక్కల Surrounding area చల్లగా ఉండేవిధంగా చూసుకోవాలి.
- క్రొత్తగా మొక్కలను నాటుకో రాదు.
- ప్రతి పనికి ఒక నిర్ధిష్టమైన సమయాన్ని ఎంచుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు చేయరాదు.
- అధిక వేడిమి ఉన్న సమయం లో watering/liquid fertilizers/ pesticides/ అన్నీ నిష్టిదం. ఇవీ ఏవి చేయరాదు.
- ఘాటైన కషాయాలు, ఎక్కువ మోతాదులో క్రిమిసంహారక ద్రవాలు వాడటం మంచిది కాదు.
- మొక్కలు వాడిపోకుండ కొద్దిగా epsum salt ను instant booster గా వాడితే, మంచిది.
- కుండీలో మట్టి గుల్లగా ఉండేవిధంగా చూసుకోండి. తడి/ తేమ క్రింది వరకు చేరుతుంది.
- చేమంతి, strawberry లాంటి మొక్కలను, ఆకు కూరలు లాంటి వాటిని సాధ్యమైనంత వరకు semi shade లోకి చేర్చండి. మీకు మంచిదనిపిస్తే, పై వాటిని ఆచరించి,తమ TG లోని మొక్కలని ఈ వేసవి ముగిసే వరకు కాపాడుకోగలరు.
.…వేంకటేశ్వర రావు ఆళ్ల,
వికారాబాద్.