Gokrupamrutam-How to Use

గోకృపామృతం

👉 గోకృపామృతం mother culture ఒక లీటర్ ని 200 లీటర్ల నీటీలో కలిపి, ఇందులో 2 kg ల బెల్లం మరియూ 3 లీటర్ల ఆవుపాలతో చేసిన మజ్జిగ ని కలిపి ఆ drum ని ఒక వస్త్రం తో ముసివేయాలి, ప్రతి రోజు ఉదయం సాయంత్రం ఈ మిశ్రమాన్ని ఏడు రోజుల పాటు కలుపుతూ ఉండాలి

👉 7 రోజుల తర్వాత ఈ గోకృపామృతం మనం మొక్కలకి వాడుకోవడానికి తయారవుతుంది

👉 ఇలా తయారైన గోకృపామృతం 45 రోజుల వరకు నిలవ ఉంటుంది, అంటే 45 రోజుల లోపు ఇది వాడుకోవాలి, ఆ తర్వాత దీని నుండి ఒక లీటర్ గోకృపామృతం తీస్కుని మరలా 200 లీటర్ల నీళ్లు, 2kg బెల్లం, 3 లీటర్ల ఆవు మజ్జిగ తో మరలా గోకృపామృతం తయారు చేసుకోవచ్చు

👉 ఈ గోకృపామృతం మొక్కలకి అలాగే ఇచ్చుకోవచ్చు, ఎలాంటి డైల్యూషన్ అవసరం ఉండదు, కాని మొక్కలకు స్ప్రే చేయాలనుకుంటే మాత్రం 1:5 ratio లో అనగా ఒక mug గోకృపామృతానికి 5 mugs నీళ్లు కలిపి స్ప్రే చేస్కుకోవాలి

గోకృపామృతం ఉపయోగాలు
👉 ‘గోకృపామృతం’ (ప్రోబయోటిక్‌ బాక్టీరియల్‌ కల్చర్‌) ద్రావణం భూసారం పెంపుదలకు, చీడపీడల నివారణకూ ఉపయోగపడుతుంది. ఇదొక్కటి ఉంటే చాలు యూరియా, డీఏపీ, విష రసాయనాల అవసరమే ఉండదు.

👉 దేశీ ఆవు పేడ, మూత్రం, పాలు, పెరుగు, నెయ్యిలలోని మేలుచేసే 70 రకాల సూక్ష్మజీవరాశికి మరో 21 రకాల ఓషధులను సమన్వయపరచి గోకృపామృతాన్ని రూపొందించారు. ఇది భూమికి, పంటలకే కాకుండా మనుషులు ఇతర జీవరాశికి కూడా మేలు చేస్తుంది.

Thank you
TEAM CTG

Shopping Cart