గులాబి మొక్క:
గులాబీలు అంటే తెలీని వాళ్ళు వుండరు, ఇష్టపడని వారు ఉండరేమో. దాదాపు అందరి ఇంట్లో వుండే మొక్క, అందరూ
ఇష్టంగా పెంచే మొక్క ఈ గులాబీ మొక్క. గులాబీలు చలికాలంలో ఎక్కువ పూస్తాయి.
Soil Mix: 40% ఎర్ర మట్టి+ 30% ఆవు ఎరువు + 10% వేప పొడి.
Propagation: గులాబీలను cutting ద్వారా, air layering ద్వారా, కొన్ని రకాలు విత్తనాల ద్వారా పెంచవచ్చు.
ఎరువులు: గులాబీ మొక్కలకు ఆకలి ఎక్కువ, వారానికి ఏదో ఒక రకం ఎరువులు ఇస్తూ వుండాలి. అప్పుడే ఎక్కువ పువ్వులు, మంచి రంగు, పెద్ద size లో పూస్తాయి. Vermicompost, bonemeal, మిగిలిన టీ పొడి, అరటి తొక్కల పొడి, గుడ్డు పెచ్చులు, ఆవ పొడి తయారు చేసి పెట్టుకుని వారానికి ఒక సారి ఇస్తూ వుండాలి.
గులాబి మొక్కలకి ఎక్కువగా die back disease, ఆకు ముడత, ఆకు ఎండు తెగులు వస్తాయి.
నివారణ: die back రోగానికి ఎక్కువగా మనం మొక్క pruning చేసినప్పుడు వొస్తుంది. అందుకే మొక్క pruning చేయగానే కొమ్మ చివర aloe vera పేస్ట్ కాని లేక ఏదైనా fungicide కానీ రాయాలి. ఆకు ముడత వచ్చినప్పుడు ఆకులు అన్నీ తీసేయాలి.
బేకింగ్ సోడా + వేప నూనె + కుంకుడు రసం నేలల్లో కలుపుకుని వారానికి ఒకసారి పిచికారి చేయాలి.
ఎండ ఎక్కువ తక్కువ అయినప్పుడు ఆకులు ఎండిపోవడం జరుగుతుంది. చలికాలంలో పూసే ఈ గులాబి మొక్కని చలికాలంలో ఎక్కువ ఎండ పడే చోట పెట్టుకోవాలి. ఎండాకాలంలో semi shade లో పెక్కివలి, ఎక్కువ ఎండ తగిలితే ఆకులు మారిపోతాయి.
CTGain పద్మిని