మనము మిద్ధి తోటలో గాని పెరటి తోటలో గాని మొక్కలు పెట్టుకొని పెంచుకొguనుచున్నము
ఈ మొక్కలు అనేక పోషకాలు ఇస్తేనే గాని మన మొక్కలు బాగుంటాయి ఆరోగ్యంగా ఉంటాయి వాటికి గ్రౌండ్నట్ కేక్ గాని ద్రవ జీవామృతం లేదా పంచగవ్య గాని పశువుల ఎరువు కానీ మేకల ఎరువు కానీ పోషకాలు ఇస్తూ ఉండాలి
వాటిలో భాగంగా ఈరోజు ఆవపిండి మస్టర్డ్ కేక్ గురించి మాట్లాడుకుందాం ఆవపిండి మొక్కలకు కావలసిన నైట్రోజన్ కాల్షియం పొటాషియం మొక్కలకి ప్రధమ పోషకాలుగా ఉపయోగపడతాయి
ఇది NPK ఫర్టిలైజర్ గా పనిచేయును అన్ని మొక్కలకు ఇవ్వవచ్చు
ఆవు పిండి ఎక్కువ వేస్తే మొక్కలకు ఎక్కువ వేడి పుట్టును కాబట్టి తక్కువ గా కొన్ని చెంచాల పిండి వాడాలి
ఫెర్టిలైజర్ గాను పెస్టిసైడ్ గాను పనిచేయను ఇది మొక్కలకు బలము ఇచ్చును మొక్కల వెర్లకు ఉన్న పురుగు కూడా చంపును
పెరిగే దశలో ఇస్తే నత్రజని పూత దశలో ఇస్తే పాస్పరస్ పిందెల దశలో ఇస్తే పొటాషియం ఉండి బాగా పెరుగును పూత బాగా ఉండును ఒక లిటర్ నీటికి 10 గ్రాములు కలిపి వాడాలి 20 రోజులకి ఒకసారి ఇవ్వాలి
ఆవపిండినానబెట్టి మూడు రోజులు నీటిలో వేసి ఉంచాలి. ఒక లీటర్ల ద్రావణం కి రెండు లీటర్ల నీరు కలిపి మొక్కలకు ఇవ్వాలి
కానీ ఎక్కువ ద్రావణం మొక్కలకు ఇవ్వకూడదు ఇది వాడితే పూతరాలదు కాయలు బాగా పెరుగును ఈ ఆవపిండిలో మెగ్నీషియం ఉండి మొక్కలకు బాగా పనిచేస్తుంది
మన మొక్కలకు మెగ్నీషియం కావాలంటే ఎప్సన్ సాల్ట్ వాడాలి అంటే ఒక లీటర్ నీటికి ఒక హాఫ్ స్పూన్ కలిపి మొక్కలకి మట్టిలో పోయవచ్చును లేదా స్ప్రే చేయవచ్చు
అలాగే బోన్ మీల్ ఈ బోన్ మిల్ మొక్కలకు వేసిన వెంటనే పనిచేయదు ఇది వేసినా రెండు నెలలకు పని చేయును
మట్టిలో మూడు స్పూన్లు కలపవలెను ఇలా కలిపితే సాయిల్లో పిహెచ్కే లెవెల్ సరిగా అట్టి పెట్టును
రెండు నెలలకు పూత వచ్చును కాబట్టి పూత వచ్చినపుడు పాస్పరస్ కావాలి కాబట్టి రెండు నెలల ముందు బోన్మెయిల్ మన మొక్కలకి వాడు వాలేను
కాల్షియం తక్కువ అయినా పూత రాలిపోతుంది పూత పిందే కావాలి అంటేకాల్షియం కావాలి
కిళ్లీ లో వేసేసున్నం నీటిలో కలిపి మన మొక్కలు కి స్ప్రే చేయాలి పూత వచ్చినప్పుడు మంచి ఆహారం మన మొక్కలకి ఇవ్వాలి అప్పుడే పూత నిలబడింది బాగా పెరుగుతుంది
అలాగే పిందలు ఎదగాలంటే మొక్కలకి నత్రజని కావాలి మొక్కలకు అన్ని రకాల పాషకాలు కావాలి మొక్కలకు మనం 15 రోజులకు ఒకసారి ఆహారం ఇవ్వాలి
మొదటి కాపువచ్చిన తరువాత రెండో కాపు రాకపోతే బలం లేక రెండో కాపు రాదు కాబట్టి మనము ఆయిల్ తీసిన చెక్కకానీ ద్రవజీవామృతం గాని ఇస్తూఉండాలి
మన మొక్కలకు మంచి ఎరువులు ఇస్తే మంచి దిగుబడులు వస్తాయి
తర్వాత owdc ఎలా వాడాలి 20 లీటర్లు ద్రావణం తయారైన తర్వాత ఒక లీటరు ద్రావణం మనకు మూడు లీటర్ల నీరు కలిపి మట్టికి ఇవ్వవచ్చు
లేదా మొక్కల పైన స్ప్రే చేయాలంటే ఒక లీటర్ ద్రావణం మనకు ఐదు లీటర్ల నీరు కలిపి మొక్కలపై పిచికారి చేయాలి
దీనిలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఏస్తే మొక్కలు ఎక్కువగా పెరుగును కానీ కాపుకాయదు ఎంజైమ్స్ ఆల్కలైజ్ ఉంటాయి కాబట్టి నారు మొక్కలకి ఇవ్వకూడదు
జూన్ లో బీర బెండ పోట్ల ఆకుకూరలు గోంగూర వంగ ఇలాంటివి వేసుకోవాలి
సొర,కణుపు చిక్కుడు టమాట, మునగా గుమ్మడి ఇవన్నీ సెప్టెంబర్ నెలలో వేసుకోవాలి
అలాగే వంగ లో కాయ తొలుచు పురుగు వస్తుంది దీనికి వేప నూనె చల్లుకోవాలి వంగలో వచ్చే బూజు తెగులు కి ఇంగువ నీరు స్ప్రే చేయాలి
ఇంగువ ద్రావణం మొక్కలపై వాడితే దానిలో ఉన్న సల్ఫర్ మొక్కలు గ్రహించి మొక్కలు పచ్చగా ఉంటాయి కాబట్టి మొక్కలపై తప్పనిసరిగా ఇంగువ ద్రావణం వాడుకోవాలి
కొన్ని రకాల సిలింద్ర తెగుళ్లను ఇంగువ ద్రావణం అరికట్టును ఉడతలు ఎలుకలు ఇంగువ వాడటం వలన మొక్కలు దగ్గరికి రావు
Rajagopal Rao garu
❤ CTG❤