🪴 మొక్కలు – నీళ్లు🫗
👉 మొక్కల కు నీళ్లు పోయడం లో పెద్ద విషయం ఏముంటుంది అనుకోవచ్చు, కాని నేల లో అయినా కుండీ లో అయినా ఒక మొక్కని వేసినప్పుడు soil mix అని bio fertilizers అని correct గా use చేస్కుని మొక్కలు నాటుతూ ఉంటాము, అయినా కాని ఒక్కోసారి మొక్కల కి తెగుళ్ళు, చీడపీడలు రావడం, మొక్కలు ఎండిపోవడం, వేర్లు కుళ్ళిపోవడం, మొక్కల్లో ఏలాంటి ఎదుగుదల లేకపోవడం గమనిస్తూ ఉంటాము , పూత, పిందే రాలిపోవడం, ఆకులు పసుపు రంగలో మారిపోవడం ఇలా వీటన్నింటికి ఒక్కోసారి మనం మొక్కలకి నీళ్లు పొసే పద్ధతి కూడా ఒక కారణం కావచ్చు
👉 కుండీలలో మొక్కలు పెట్టుకునే ముందు కుండీ అడుగున రంధ్రాలు సరిగా ఉండేలా చూసుకోవాలి, మట్టి బయటకు పోకుండా కుండీ అడుగున బొగ్గులు, గులక రాళ్లు, కుండ పెంకులు, కొబ్బరి చిప్పలు ఇలా ఏవైనా అడ్డు పెట్టవచ్చు, మొక్కకి ఎప్పుడు నీళ్లు ఇచ్చినా కాని ఆ నీరంతా కిందకి కారిపోయేంతగా ఇవ్వకూడదు, దీని వలన ఆ మొక్కకి మనం ఇచ్చే పోషకాలు అన్నీ బయటకు వెళ్ళిపోతాయి
👉 మొక్క ని కుండీలో నాటు కోవడానికి soil mix prepare చేస్కునేటప్పుడు ఆ soil లో cocopeat, వడ్ల పొట్టు, ఇసుక, చెక్క పొట్టు ఇలా ఏదో ఒకటి సమపాళ్ళలో కచ్చితంగా కలపాలి, దీని వలన మట్టి ఎప్పుడు గుల్లగా ఉండటమే కాకుండా మనం నీళ్లు ఇచ్చాక ఎక్కువ సేపు తేమ నిలిచి ఉంటుంది
👉 మనం ఆహరం ప్రతి రోజు ఒక time ప్రకారం ఒక క్రమ పద్ధతిలో ఎలా తీస్కుంటూ ఉంటామో మొక్కల కి కుడా ఎప్పుడు ఒక క్రమ పద్ధతిలో నీళ్లు ఇస్తూ ఉండాలి
👉 కుండీలో ఒక రెండు ఇంచుల లోతు వరకు మట్టి ఎప్పుడు అయితే పొడి పొడి గా dry అయినట్లు ఉంటుందో అప్పుడు నీళ్లు ఇవ్వాలి, ఒకవేళ మట్టి తడిగా ఉన్నా కాని నీళ్లు మళ్ళీ ఇస్తే ఆ మొక్క చాలా ఒత్తిడి కి గురవుతుంది, పెద్ద containers లో ఉండే పెద్ద మొక్కలకు ప్రతి రోజు నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉండదు
👉 తీగ జాతి కూరగాయలు కు, పళ్ళు తో ఉన్న పళ్ళ మొక్కలకు ఎప్పుడు పూర్తిగా మట్టి ఎండిపోకుండా మట్టి కొంచం తేమ గా ఉండేలా చూసుకోవాలి, అప్పుడే కూరగాయలు, పళ్ళు తాజా గా ఉంటాయి, ఆలా అని చెప్పి మట్టి మరీ తడిగా ఉండకూడదు
👉 పువ్వుల మొక్కలకి, ఆకుకూరలు కి ప్రతి రోజు నీటి ని కొద్ది కొద్దిగా ఇస్తూ ఉండాలి, croton మొక్కలకి రెండు రోజులకి ఒకసారి, ఇంట్లో ఉండే indoor plants కి వారానికి ఒకసారి నీళ్లు ఇవ్వాలి, దుంప జాతి కూరగాయలు, పూల మొక్కల కి ప్రతి రోజు నీళ్లు ఇవ్వకూడదు, లేదంటే దుంప కుళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది, succulent and cactus మొక్కలకు 15 రోజుల కి ఒకసారి నీటి ని ఇవ్వాలి
👉 ఇక గులాబీ, చామంతి ఇలా కొన్ని రకాల పూల మొక్కల కి పువ్వుల పై నీళ్లు పడకుండా మొక్క మొదట్లో నీరు ఇవ్వాలి
👉 ఇక వర్షాకాలం లో మొక్కల కి దాదాపు గా తరచు గా నీళ్లు ఇచ్చే అవసరం ఉండదు, చలికాలం లో కూడా సాయంత్రం సమయం లో మొక్కల కు నీటిని ఇవ్వడం కన్నా ఉదయం ఇవ్వడం మంచిది, సాయంత్రం నీటిని ఇస్తే రాత్రి అంతా నీటి చెమ్మ ఉంటుంది మరియు మంచు వల్ల మొక్కల కి ఫంగస్ వచ్చే ప్రమాదం ఉంటుంది, ఇక ఎండాకాలం లో మాత్రం ప్రతి రోజు సాయంత్రం నీటి ని ఇవ్వాలి దీని వలన రాత్రి అంతా నీటి చెమ్మ నిలిచి ఉండటం వలన మొక్కల వేర్లు నీటిని బాగా తీసుకోగలుగుతాయి
👉 మొక్కల కి మాములు నీళ్లు ఇచ్చే కన్నా, బియ్యం, పప్పులు కడిగిన నీళ్లు, కూరగాయల, పళ్ళ ముక్కలు, తొక్కలు నాన పెట్టిన నీళ్లు తరచుగా ఇస్తుండటం వలన మొక్కలకు సరైన పోషకాలు అందుతూ ఉంటాయి
-Srinivas CTG khammam