మజ్జిగ ధ్రావణం
👉 ఒక 500ml నాటు ఆవు పాలు తీస్కుని తోడు పెట్టాలి, అవి తోడుకుని పెరుగు తయారయ్యాక దానికి ఒక లీటర్ నీళ్లు కలిపి మజ్జిగ లా చేయాలి
👉 ఈ లీటర్ మజ్జిగ ని ఒక 6 రోజుల పాటు బాగా పులియబెట్టాలి, ఆ తర్వాత ఈ లీటర్ మజ్జిగ ని ఒక 20 లీటర్ల నీటిలో కలిపి మొక్కలకి స్ప్రే చేయాలి
👉 ఏవైనా తెగుళ్ళు మొక్కలకి ఆశించక ముందే ప్రతి వారం పుల్లని మజ్జిగ స్ప్రే చేయడం వలన చక్కటి ఫలితం ఉంటుంది, ఆలా కాకుండా చీడ పీడలు, తెగుళ్ళు ఆశించిన తర్వాత అయితే ఈ పుల్లని మజ్జిగ లో కొంచం పసుపు, కొంచం ముద్ద ఇంగువ కలిపి ఒక రోజంతా ఆలా వదిలేసి ఆ తర్వాత రోజు మొక్కలకి స్ప్రే చేయాలి
👉 ఏవైనా ఆకుకూరలు, కూరగాయలు విత్తనాలు వేసి మొలకలు వచ్చాక మొదటి వారం లో ఆ నారు మొక్కలకి నారు కుళ్ళు తెగులు వస్తుంది, అప్పుడు నారు మొక్క కాండం కుళ్ళిపోయి మొక్క బలహీనపడిపోతుంది, అందుకే నారు దశ నుండే పుల్లటి మజ్జిగ ని ఎక్కువ డైల్యూషన్ చేస్కుని ఇవ్వడం వలన ఆకుకూరలు, కూరగాయల నారు బలం గా పెరుగుతుంది
👉 పుల్లని మజ్జిగ స్ప్రే చేయడం వలన ఆకుముడత బాగా తగ్గుతుంది, ప్రతి వారం మజ్జిగ స్ప్రే చేయడం వలన మొక్కల్లో ఆకు ముడత అసలు రాకుండా ఉంటుంది
👉 ఇక టమాటో,మిరప వంగ తో పాటు అన్ని రకాల పళ్ళ మొక్కలు పూత దశ లో ఉన్నప్పుడు ఈ పుల్లటి మజ్జిగ స్ప్రే చేయడం వలన పూత రాలడం బాగా తగ్గుతుంది పూత నిలుస్తుంది,, పిందెలు బాగా వచ్చి దిగుబడి అధికంగా వస్తుంది
👉 పుల్లటి మజ్జిగ వాడటం వలన మొక్కల్లో చీడ పీడలు, తెగుళ్ళు, వ్యాధుల నుండి తట్టుకోగల రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది, దీని ద్వారా మొక్కలు బలం గా పెరుగుతాయి
గమనిక :-
నాటు ఆవు పాల తో చేసిన మజ్జిగ తో ఫలితం అధికంగా ఉంటుంది
CTG Member:
Srinivas khammam