ఈ రోజు బచ్చలి చెట్టు గురించి చర్చించుకుందామా
ఎన్ని రకాల బచ్చలికూర మొక్కలు మీ తోటలో పెంచుతున్నారు?
మీ తోటలోని బచ్చలి చెట్ల పిక్చర్స్ రేపు group లో పోస్ట్ చెయండి
మనకు అందుబాటులో ఉండే అనేక రకాల ఆకుకూరల్లో బచ్చలి కూర ఒకటి. ప్రతి తోటలో తప్పకుండా పెంచవలసిన మొక్క.
బచ్చలి మొక్క విత్తనాలతో, లేదా కొమ్మలతో కంటైనర్లో (12X12 లేదా 15X15 లేదా 12X15 ) పెంచవచ్చు. మొక్క పెరుగుదలకు పోషకాహారం అవసరం కాబట్టి సరైన రకమైన నేల చాలా ముఖ్యం. మట్టి మిశ్రమానికి ఎర్ర మట్టి, వర్మి కంపోస్ట్ మరియు కొంచంగా ఇసుక వాడాలి. అలాగే, మట్టిలో చీడలు లేకుండా ఉంచడానికి వేప పిండి లేక వేప ఆకులు జోడించండి.
బచ్చలి చెట్టుకి ప్రతిరోజూ కనీసం 4 నుండి 6 గంటల సూర్యుడు అవసరం. పూర్తి సూర్యకాంతిలో మొక్క బాగా పెరుగుతుంది.
US డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రకారం, 100 గ్రాముల బచ్చలికూరలో 23k cal, 99mg కాల్షియం, 79mg మెగ్నీషియం, 558mg పొటాషియం, 28.1mg విటమిన్ సి, 79mg సోడియం మరియు 49mg భాస్వరం వుంటాయి.
బచ్చలికూరను నేరుగా కూర, పులుసు కూర, మజ్జిగ పులుసు, బజ్జీలు లేదా పప్పులా చేసుకు తినవచ్చు.
𝗖𝗼𝘂𝗿𝘁𝗲𝘀𝘆 :
𝗠𝗼𝘂𝗻𝗶𝗸𝗮 𝘀𝘂𝗺𝗿𝗲𝗱𝗱𝘆.