3 G Cutting in creeper veg plants

తీగ జాతి లో 3G cutting*
టెర్రస్ గార్డెన్స్‌పై స్థలాభావం కారణంగా, లతల నుండి ఎక్కువ దిగుబడిని పొందడానికి 3G cutting ప్రక్రియ ఉపయోగిస్తారు.

  1. బీర తీగ రెండు, మూడు అడుగులు పెరిగేవరకు ఆగి, దాన్ని క్రింది నుండి పైకి ఒక అడుగు /ఫీట్ వరకు ఉండే ఆకులను తొలగించాలి.
  2. ఈ మూడు అడుగుల తీగెకు పైన నెత్తిన చిగురును తుంచాలి. లేకపోతే, male flowers/ మగ పువ్వులే ఎక్కువ వుంటాయి. (ఇది 1st Generation)
  3. ఇప్పుడు 1st Generation కి నెత్తిన చిగురుని తుంచిన చోట ఆ తీగె రెండు శాఖలు గా మళ్ళీ పెరుగుతుంది. ఈ రెండు శాఖలు 1 లేదా 2 అడుగులు పెరిగాక, మరల రెండు శాఖల నెత్తిన చిగురును తుంచాలి. ఇప్పుడు ఈ రెండు శాఖల నుండి female flowers/ ఆడ పువ్వులు పూయడం మొదలౌతుంది. (ఇది 2nd Generation)
  4. ఇప్పుడు మళ్లీ 2nd Generation కి నెత్తిన చిగురుని తుంచిన చోట్ల మళ్లీ రెండు శాఖలు గా, ఇంకో శాఖ వద్ద మళ్లీ రెండు శాఖలు గా, పెరుగుతుంది. ఇలా 2 x 2= 4 శాఖలు గా పెరుగుతుంది. ఇప్పుడు ఈ 4 శాఖల నుండి కూడా female flowers/ ఆడ పువ్వులు పూయడం మొదలౌతుంది. (3G)(ఇది 3rd Generation)*

పూత – కాత
పూత, కాత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఏపుగా పెరిగే కొద్దీ, వాటికి పోషకాల అవసరం వుంది.

(పూత- కాత సమయంలో ‘పొటాష్’ బాగా అందేలా చూడాలి) అలాగే పరాగ సంపర్కం
/ pollination కోసం కొంత జాగ్రత్త అవసరం.

  1. 3G cutting పూర్తి అయ్యేసరికి, ఇవ్వాల్సిన పోషకాలను ఎలాగూ ఇస్తాం.
  2. Female/ ఆడ పువ్వులు రావటం మొదలైన వెంటనే ఉదయం పూట మొక్కలకి నీళ్ళు పోసేటప్పుడు, 1 లీటరు నీటికి 10/15 మి. లీ తేనె/ bellam neeru కలిపి తీగలపై పిచికారీ చేయాలి.

అలా చేయడం వల్ల ఆ వాసనకు కీటకాలు వస్తాయి. అందువల్ల “ప్రకృతి సిద్ధం”గా పోలినేషన్ /pollination జరుగుతుంది.

లేదా Hand pollination చేయాల్సిన అవసరం వుంటుంది.

Hand pollination: ఈ process లో ..మొదటి cutting లో అన్నీ మగ పూవులే వుంటాయి.ఇవి గుత్తులు గుత్తులుగా వుంటాయి.

కానీ తరువాత 2nd & 3rd generation (3G) లో అన్నీ ఆడపువ్వులే వస్తాయి.

ఇక్కడ గుత్తులుగా వచ్చిన మగ పూవులను తుంచి, కాయలావుండే ( female), దానిచివర ఉండే పూవే ఆడ (female). దానికి మగపువ్వును త్రుంచి, దాని పుప్పొడిని, ఆడపువ్వు పుప్పొడి కి అతికేలా రెంటినీ కలపాలి..
ఇది బీర hand pollination..
ఈ సమయము లో ‘బనానా 🍌 పీల్ ఫెర్మెంటెడ్ juice’ వాడాలి.. పూత కాత నిలబడుతుంది.

Note:* బీర కాకుండ వేరే మొక్కలకి male & female రెండూ ఒకే పువ్వులో ఉంటాయి, కాబట్టి వాటికి hand pollination చేసే సమయంలో ఒక బ్రెష్ లాంటి దానితో దానిపై రుద్దితే, సరిపోతుంది

Information by:
A. వెంకటేశ్వరరావు గారు
Vikarabad CTG

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart